JNJMACHS మీటింగ్ లో మార్మోగిన తెలంగాణవాణి

ఇవాళ  JNJMACHS మీటింగ్ జరిగింది. తెలంగాణ జర్నలిస్టులు  JNJMACHS బాధ్యులను కడిగిపారేసిన్రు. మీటింగ్ లో తెలంగాణవాణి మార్మోగింది. కాసాని శ్రీను, కప్పర ప్రసాద్ పాయింట్ టు పాయింట్ కొశ్చన్ చేసి సమాధానాలు రాబట్టిన్రు. ఇన్నాళ్లు 900 ల లోపు నెంబర్ ఉన్నవాళ్లకే స్థలాలిస్తమన్న వాళ్లు సభ్యులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తమని ప్రస్తుతానికి ఒప్పుకున్నరు. స్థలాలొచ్చిన తర్వాత ఇదే మాట మీద ఉంటరో..  లేదో.. చూడాలి మరి. మెంబర్స్ ఎక్స్ పీరియన్స్ పై రీ స్క్రూటినీ చేయడానికి ఒప్పుకున్నారని సభ్యులను అంటున్నరు. ఆల్ రెడీ పోరుతెలంగాణ బయటపెట్టిన లిస్టును మళ్లీ డిస్ ప్లే చేస్తరట.  JNJMACHS సభ్యులు లిస్ట్ ను పోరు తెలంగాణ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నరు.

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.