Category Archives: Top Stories

ఎవరు లోకల్? ఎవరు నాన్ లోకల్?

రాష్ట్ర విభజన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో స్థానికతకు ప్రామాణికత ఏమిటనేది చర్చనీయమవుతున్నది. దీనిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల నేపథ్యంలో ఎవరు స్థానికులు? ఎవరు స్థానికేతరులు?.. అనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొన్నేళ్లుగా సీమాంధ్రులు తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగుల విద్యా ఉద్యోగ అవకాశాలను దోచుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఎవరు లోకల్? ఎవరు నాన్ లోకల్?

సొమ్ము తెలంగాణది..సోకు సీమాంధ్రది

రాష్ట్ర విభజనలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీఐఐసీ తెలంగాణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక వాడల్లో ప్లాట్లను విక్రయించగా రూ.13 వేల కోట్లకు పైగానే సంస్థ ఖాతాకు చేరింది. ఆ డబ్బులు పెట్టి సీమాంధ్రలో పట్టా భూములు కొని పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో రూపొందించిన వాడల్లో ప్రభుత్వ భూములే … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సొమ్ము తెలంగాణది..సోకు సీమాంధ్రది

సీఎం పీఆర్వోగా వనం, పీఆర్వోగా విజయ్‌కుమార్

తెలంగాణ సీఎం పీఆర్వోగా వనం జ్వాలా నరసింహరావు, పీఆర్వోగా వరంగల్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ గటిక విజయ్‌కుమార్ నియమితులయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విజయ్‌కుమార్‌ పీఆర్వోగా నియామకం కావడం సంతోషకర విషయం.. పోరు తెలంగాణ తరపున ఆల్‌ ద బెస్ట్‌ అన్నా…

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on సీఎం పీఆర్వోగా వనం, పీఆర్వోగా విజయ్‌కుమార్

ఇదేం బాదుడు!

సిమెంటు ధరల్లో భారీ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ప్రజలు ఇబ్బంది పడకుండా ధరలు తగ్గించేందుకు నడుం కట్టింది. సోమవారంనాడు కంపెనీ యజమానులతో సామరస్యపూర్వక పరిష్కారానికి చర్చలు ప్రారంభించింది. వర్షాకాలం ముంగిట్లో పెంపునకు దారి తీసిన పరిస్థితులేమిటన్న విషయమై ఆరా తీసింది. మొదట తగ్గింపునకు ససేమిరా అన్న యాజమాన్యాలు చివరికి కొద్ది రోజుల వ్యవధి కావాలని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఇదేం బాదుడు!

11 తీర్మానాలు ఏకగ్రీవ ఆమోదం

 పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం సమావేశమైన శాసనసభ ఈ అంశంపై విస్తతంగా చర్చించింది. తెలంగాణ రాష్ర్టానికి చెందిన భూభాగాలను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలిపివేయడాన్ని సభ తీవ్రంగా … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on 11 తీర్మానాలు ఏకగ్రీవ ఆమోదం

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో అమరులకు స్మారకస్తూపం

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరులకోసం.. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో మహత్తర స్తూపాన్ని నిర్మిస్తామని, ప్రభుత్వమే ఈ బాధ్యతను తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ స్తూపాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని.. తెలంగాణ రాష్ట్ర అధికారిక కార్యక్రమాలన్నీ అమవీరుల స్తూపానికి సెల్యూట్ చేసిన తర్వాత ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో అమరులకు స్మారకస్తూపం

600 గ్రామాలు మునకే..

పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిని అధికారులు దాచిపెడుతున్నారా? ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు వస్తాయని వరద ప్రమాదాన్ని తగ్గించి చూపుతున్నారా? అవుననే అంటున్నారు జలవనరుల నిపుణులు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంపు గ్రామాల సంఖ్య భారీగా పెరుగుతుందని వారంటున్నారు. పోలవరం వరద పోటెత్తితే దాదాపు ఆరువందల గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని గత చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on 600 గ్రామాలు మునకే..

ధూంధాంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

అరవయ్యేళ్ల చిమ్మచీకట్లు చీల్చుకుంటూ అర్ధరాత్రి తెలంగాణ సూరీడు పొద్దుపొడువనున్నాడు! కలబడి నిలబడిన నాలుగున్నర కోట్ల జాతికి శుభాకాంక్షలు తెలుపనున్నాడు! నవోదయానికి నాంది పలుకనున్నాడు! తెలంగాణ తల్లి దాస్యశంఖలాలు తెంచేందుకు నింగికేగిన అమరులు భానుడి కిరణాలుగా పురిటిగడ్డను ముద్దాడనున్నారు! ఆ నవోదయానికి తరుణం ఆసన్నమైంది! ఆ వెలుగులకు వేడుకలూ సిద్ధమవుతున్నాయి! జూన్ 2.. తెలంగాణ రాష్ట్ర అవతరణ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ధూంధాంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

సంబురాలకు ముస్తాబైన పరేడ్

సికింద్రాబాద్:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం పరేడ్‌గ్రౌండ్‌ను నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ సందర్శించి భద్రతా చర్యలను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఉప కమిషనర్ ఈడీ విజయ్‌రాజ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వేడుకల … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సంబురాలకు ముస్తాబైన పరేడ్

బీసీలకు ప్రాధాన్యమివ్వాలె -సంగిశెట్టి శ్రీనివాస్

అరవై యేండ్ల వలసాధిపత్యానికి చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రజలు స్వయం పాలనకు, ఆత్మగౌరవం, అభివద్ధి, పునర్నిర్మాణ నినాదానికి పట్టం కట్టారు. మొదటిసారిగా సంపూర్ణమైన రాజకీయాధికారం తెలంగాణకు దక్కింది. ప్రభుత్వం స్థానిక ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం కొట్లాడిన వారిని స్మరించుకుంటూ భవిష్యత్ తెలంగాణకు బంగారు బాటలు ఎట్లా వేసుకోవాలో ఆలోచించాలి. దశాబ్దాలుగా … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on బీసీలకు ప్రాధాన్యమివ్వాలె -సంగిశెట్టి శ్రీనివాస్

ఉద్యమాల చిత్రశిల్పి శేఖర్

అనారోగ్య పీడితున్నే అయితేనేం యోధున్నే అన్న చెరబండరాజు బాటలో కార్టూనిస్టు శేఖర్ చివరి క్షణం వరకు పోరాడాడు. శరీరాన్ని వేధిస్తున్న క్యాన్సర్‌తో, సమాజాన్ని పీడిస్తున్న క్యాస్ట్ క్యాన్సర్‌తో ఏకకాలంలో పోరాడిన యోధుడు కంబాలపల్లి శేఖర్. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన బొమ్మ కావాలను కుంటే మనకు ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ గుర్తుకొస్తాడు. అదే విధంగా ఈ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఉద్యమాల చిత్రశిల్పి శేఖర్

కార్టూన్ లెజెండ్‌ను కబళించిన క్యాన్సర్-కంబాలపల్లి శేఖర్ ఇకలేరు

కార్టూన్ శిఖరం కూలింది. కార్టూన్ ప్రియులకు, కంబాలపల్లి అభిమానుల కంట కన్నీరు మిగిలింది. ప్రముఖ కార్టూనిస్ట్ కంభాళపల్లి చంద్రశేఖర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న శేఖరన్న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా ఏళ్లుగా కంభాళపల్లి శేఖర్ సేవలందించారు. శేఖర్ కార్టూన్లో తెలుగు ఫ్లెవర్.. పంచ్.. స్టైల్.. అందరు కార్టూనిస్టుల కంటే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on కార్టూన్ లెజెండ్‌ను కబళించిన క్యాన్సర్-కంబాలపల్లి శేఖర్ ఇకలేరు

తెలంగాణ గుండెల్లో గులాబీ.. భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్‌

తెలంగాణలో కారు టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. గులాబీ పార్టీ గుబాళించింది. కేసీఆర్ మాటే మంత్రమైంది. మన రాష్ట్రంలో మనదే పాలన అన్న నినాదం తారకమంత్రమైంది. ఓటరు స్థిర నిశ్చయంతో కులం, మతం, వర్గం, ప్రాంతం అన్నీ విస్మరించి గులాబీ పార్టీని గుండెలకు హత్తుకున్నాడు. ఫలితంగా జిల్లాల ఎల్లలను తుత్తునియలు చేసి తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఘన విజయం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ గుండెల్లో గులాబీ.. భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్‌

అబ్‌కీ బార్‌ మోడీ సర్కార్.. భారత్‌లో కాషాయ ప్రభంజనం

సార్వత్రిక ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ ఆధిక్యం సాధించడంపై ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ట్విట్టర్‌లో తన స్పందనను తెలియజేశారు. భారత్ గెలిచింది. ముందున్నవన్నీ మంచిరోజులే (భారత్ కీ విజయ్. అచ్చే దిన్ ఆనేవాలే హై) అని ట్వీట్ చేశారు.  తల్లి ఆశీర్వాదం … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on అబ్‌కీ బార్‌ మోడీ సర్కార్.. భారత్‌లో కాషాయ ప్రభంజనం

9న టీఆర్‌ఎస్ కార్యవర్గం భేటీ

ఈ నెల 9న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పార్టీ తరుఫున పోటీచేసిన అభ్యర్థులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు. 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలకు టీఆర్‌ఎస్ పోటీ చేయడం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on 9న టీఆర్‌ఎస్ కార్యవర్గం భేటీ

ఒక్క శేఖర్… రెండు క్యాన్సర్లు-అల్లం నారాయణ

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుతిమెత్తగా ఉన్నది. కరస్పర్శ శీతలంగా ఉన్నది. కార్టూ న్లు వేసిన కరవాలం లాంటి చెయ్యి శేఖర్‌ది. కడుపు క్యాన్సర్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఒక్క శేఖర్… రెండు క్యాన్సర్లు-అల్లం నారాయణ

సచివాలయ శాఖలు కట్!

రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. శాఖల వారీగా విభజన, పంపకాల కోసం అధికారులతో ఏర్పాటైన 14 కమిటీలు తమకు అప్పగించిన పనిని దాదాపు పూర్తిచేశాయి. ప్రధాన శాఖలకు చెందిన సమగ్ర నివేదికలను అపెక్స్ కమిటీ అయిన ప్రణాళిక సంఘం కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని కమిటీకి అందజేశాయి. దీంతో విభజన ప్రక్రియపై క్రమంగా స్పష్టత … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on సచివాలయ శాఖలు కట్!

సమాజాన్ని మేల్కొలిపే శేఖర్ కార్టూన్లు

క్యాన్సర్ వ్యాధిని కార్టూనిస్ట్ శేఖర్ అధిగమించి సమాజాన్ని చైతన్యపరిచే మరిన్ని మంచి కార్టూన్లు వేయాలని సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం ఆకాంక్షించారు. మలుపు ప్రచురణల ఆధ్వర్యంలో కార్టూనిస్ట్ శేఖర్ రూపొందించిన కులం క్యాన్సర్ కార్టూన్ ఆల్బం ఆవిష్కరణ సభను శనివారం సాయంత్రం అబిడ్స్ బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో నిర్వహించారు. ఆల్బంను ఆవిష్కరించిన సందర్భంగా … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on సమాజాన్ని మేల్కొలిపే శేఖర్ కార్టూన్లు

వామన్‌రావు ద గ్రేట్..

వామన్‌రావు గారు మంచి వ్యాపారవేత్తే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి.. తమ వార్తా సంస్థలో పనిచేసే వ్యక్తి చనిపోతే కనీసం స్క్రోలింగ్ కూడా పెట్టని మీడియా సంస్థలున్న తెలుగు నేలలో తమ  చానల్‌లో పనిచేసి అకాల మరణం చెందిన బండి రవీందర్‌ కుటుంబానికి అండగా నిలిచింది హెచ్‌ఎంటీవీ. వరంగల్ రిపోర్టర్ బండి రవీందర్ కుటుంబానికి 15 … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on వామన్‌రావు ద గ్రేట్..

జర్నలిస్ట్‌ బండి రవీందర్‌ ఇకలేరు

ఉద్యమకారుడిని, జర్నలిస్ట్‌ యోధుడిని ఓరుగల్లు గడ్డ కోల్పోయింది. అస్వస్థతతో బండి రవీందర్ ఇవాళ( మే ఒకటిన) కన్నుమూశారు. వరంగల్‌ జిల్లా చిట్యాల మండలానికి చెందిన బండి రవీందర్ జర్నలిస్ట్‌గా టీవీ9, హెచ్‌ఎంటీవీలో  సేవలందించిన్రు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నరు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్‌ చురుకుగా పాల్గొన్నరు. రవీందరన్నకు పోరుతెలంగాణ నివాళులు…

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జర్నలిస్ట్‌ బండి రవీందర్‌ ఇకలేరు