Category Archives: TELANGANA NEWS

తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్ష- లోక్‌సభలో హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే

తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌కు సుదీర్ఘమైన, అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాంతానికి విశిష్టమైన రాజకీయ సాంస్కతిక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. 1960వ దశకంలోనే ప్రత్యేకతెలంగాణ రాష్ట్రం కోసం, 1970లో ప్రత్యేకఆంధ్ర కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగాయి. చర్చలు, ఒప్పందాల ద్వారా అవి కాలక్రమేణా సమసిసోయాయి. అయితే.. … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్ష- లోక్‌సభలో హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే

తెలంగాణకు లోక్‌సభ ఆమోదం

– చర్చలో పాల్గొన్న షిండే, సుష్మ, జైపాల్ – పటాకులు పేల్చి.. గులాల్ చల్లుకుని – పండుగ చేసుకున్న తెలంగాణవాదులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నది మొదలు విజయసౌధపు మెట్లను ఒక్కొక్కటిగా అధిరోహిస్తూ వచ్చిన తెలంగాణ.. టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదంతో గెలుపు శిఖరానికి చేరుకుంది. బుధవారం రాజ్యసభలో … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణకు లోక్‌సభ ఆమోదం

ఒకే ఒక్కడు! తెలంగాణ మొనగాడు

హైదరాబాద్ ఫిబ్రవరి 18 : మలిదశ తెలంగాణ ఉద్యమం ఆసాంతం కేసీఆర్‌దే. ప్రతి మలుపులోనూ ఆయనే. గెలుపులోనూ ఆయనే. 13 ఏళ్ల ప్రస్థానంలో ఉద్యమ దీపం ఆరకుండా ఆయన వేసిన ఎత్తుగడలు, ఆ క్రమంలో జరిపిన పోరాటాలు ఉద్యమాలకు ఒక కొత్త సిలబస్. జలదృశ్యంలో గుప్పెడుమందితో పురుడుపోసుకున్న ఉద్యమం జనసాగర కెరటమై ఢిల్లీని ముంచెత్తడం ఒక … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on ఒకే ఒక్కడు! తెలంగాణ మొనగాడు

కల నిజమైంది.. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది

– తెలంగాణకు లోక్‌సభ ఆమోదం.. తెలంగాణలో పెల్లుబికిన సంబురం – నేడు టీ బిల్లుపై రాజ్యసభలో చర్చ.. ఆమోదం అనంతరం ప్రథమ పౌరుడికి.. – రాష్ట్రపతి సంతకంతో 29వ రాష్ట్రంగా అవతరణ – 12 గంటలకు సభ ప్రారంభం – బిల్లుపై చర్చ మొదలు పెట్టిన షిండే – గందరగోళంతో కొద్దిసేపటికే వాయిదా – తిరిగి … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on కల నిజమైంది.. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది

జనం నుంచి వనంలోక- తరలిన సమ్మక్క – సారలమ్మ..

మేడారం, ఫిబ్రవరి 15: రెండేళ్లకోసారి వనం విడిచి జనంలోకి వచ్చి.. నాలుగురోజులపాటు కోట్లాది మందికి దర్శనమిచ్చే మేడారం సమ్మక్కసారలమ్మలు.. శనివారం తిరిగి వనప్రవేశంచేశారు. ఈ వేడుకను చూసేందుకు జనహోరు పోటెత్తింది. తల్లీబిడ్డలకు మొక్కులు చెల్లించుకోవడంలో భక్తులు మునిగితేలారు. చల్లంగ కాపాడమంటూ వేడుకున్నారు. సామాన్యుల నుంచి అసామాన్యులవరకు ఇక్కడికి వచ్చి అమ్మలిద్దరినీ దర్శించుకున్నారు. జాతరలో భాగంగా బుధవారం … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on జనం నుంచి వనంలోక- తరలిన సమ్మక్క – సారలమ్మ..

కొట్టలేదు.. కొట్టదలచుకుంటే ఎవరూ ఉండరు: ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్

ఫిబ్రవరి 15 : రాష్ర్టాన్ని విభజిస్తే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని సీమాంధ్ర నేతలు చేస్తున్న డిమాండ్‌పై సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలనే సీమాంధ్ర నేతల్లారా ఖబడ్దార్.. యూటీ, గీటీ జాన్తా నై అని స్పష్టం చేశారు. ఎవరైనా మాకు వెన్నుపోటు పొడవాలని చూస్తే పోటుకు నాలుగు పోట్లు … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on కొట్టలేదు.. కొట్టదలచుకుంటే ఎవరూ ఉండరు: ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్

తెలంగాణ రాష్ట్రంతోనే ఇంటికి-నాగం జనార్దన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 : తెలంగాణ రాష్ట్రం తీసుకునే తాను ఇంటికి వెళతానని, అప్పటివరకు ఢిల్లీలోనే ఉంటానని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తాను తెలంగాణ కోసమే జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరానని వివరించారు. నా కల సాకారమైందన్నారు. పార్టీపై మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని అన్నారు. ‘రెండు … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on తెలంగాణ రాష్ట్రంతోనే ఇంటికి-నాగం జనార్దన్‌రెడ్డి

అది ముమ్మాటికీ పార్లమెంట్‌పై దాడే

లోక్‌సభలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజ్‌గోపాల్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి సృష్టించిన విధ్వంసాన్ని, హింసాత్మక ఘటనలకు పాల్పడటాన్ని పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సభలో వ్యవహరించిన రౌడీ ఎంపీలను భగత్‌సింగ్‌తో పోల్చడమా? అని వారు నిప్పులు చెరిగారు. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on అది ముమ్మాటికీ పార్లమెంట్‌పై దాడే

రేపు లోక్ సభలో టీ బిల్లు ప్రవేశం

రేపు జరగనున్న లోక్‌సభ సమావేశంలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. నేడు కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం టీ బిల్లును మార్పులు, చేర్పులతో కేంద్రం రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on రేపు లోక్ సభలో టీ బిల్లు ప్రవేశం

చెయ్యి కోసివ్వాలా..రక్తంతో రాసివ్వాలా? తెలంగాణపై ఏం చేస్తే నమ్ముతారు?

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 11 : తెలంగాణ అంశంలో ఏం చేస్తే మమ్మల్ని నమ్ముతారో చెప్పండి. చేయి కోసివ్వాలా..? రక్తంతో జై తెలంగాణ అని రాసివ్వాలా..? తెలంగాణ వస్తుంది నాదీ భరోసా అని బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ పార్టీ తెలంగాణ నేతలకు తేల్చి చెప్పారు. తెలంగాణ నేతల యెండెల లక్ష్మీనారాయణ, యెన్నెం శ్రీనివాసరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on చెయ్యి కోసివ్వాలా..రక్తంతో రాసివ్వాలా? తెలంగాణపై ఏం చేస్తే నమ్ముతారు?

రేపు హస్తినకు వెళ్లనున్న గవర్నర్

హైదరాబాద్ : రాష్ట్రగవర్నర్ నరసింహన్ రేపు ఉదయం 11.30 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నెల 13,14 తేదీల్లో ఢిల్లీలో జరిగే గవర్నర్ల సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

Posted in TELANGANA NEWS | Comments Off on రేపు హస్తినకు వెళ్లనున్న గవర్నర్

కమ్మనేతలను టీ ప్రజలు వదిలిపెట్టరు: టీఎన్జీవో

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరని టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ హెచ్చరించారు. ఈ వర్గానికి చెందిన నేతలు తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగున అడ్డు పడుతున్నారని దుయ్యబట్టారు. పాలక పక్షం, ప్రతిపక్షం కలిసి తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు.

Posted in TELANGANA NEWS | Comments Off on కమ్మనేతలను టీ ప్రజలు వదిలిపెట్టరు: టీఎన్జీవో

త్వరలో జూనియర్ లెక్చరర్ల నోటిఫికేషన్

హైదరాబాద్: త్వరలో జూనియర్ లెక్చరర్ల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జేఎల్ నోటిఫికేషన్‌కు అంగీకారం తెలిపారు. వెలువడనున్న నోటిఫికేషన్ ద్వారా 2,262 జనరల్ లెక్చరర్లు, 646 ఒకేషనల్ లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సమాచారం.

Posted in TELANGANA NEWS | Comments Off on త్వరలో జూనియర్ లెక్చరర్ల నోటిఫికేషన్

ఓవరాక్షన్ చేసిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

న్యూఢిల్లీ : స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస నోటీసు ఇచ్చి ఓవరాక్షన్ చేసిన సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. సభ లోపల, బయట తెలంగాణపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ తలనొప్పిగా మారిన ఆరుగురు ఎంపీలపై కాంగ్రెస్ హైకమాండ్ కొరడా ఝుళిపించింది. పార్టీ నుంచి ఆ ఆరుగురిని బహిష్కరించి కాంగ్రెస్ తన సిన్సియారిటీని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఓవరాక్షన్ చేసిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

బిల్లుపై ఇవీ తెలంగాణ ఆందోళనలు

ఎట్టకేలకు తెలంగాణ వచ్చేస్తున్నదన్న సంతోషాల నడుమే.. కోరుకున్న స్థాయిలో సంపూర్ణ తెలంగాణ రావడం లేదన్న ఆందోళన తెలంగాణ ప్రాంత నాయకత్వంలో, ప్రజాసంఘాల్లో వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రజలు కోరుకున్న అనేక అంశాలను బిల్లులో పొందుపర్చలేదని తెలంగాణ ప్రాంత నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలను దీర్ఘకాలంలో దెబ్బతీసే పలు ప్రమాదకర అంశాలు కేబినెట్ ఆమోదించిన బిల్లులో … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on బిల్లుపై ఇవీ తెలంగాణ ఆందోళనలు

ఆచితూచి అడుగులేద్దాం -కేసీఆర్‌

కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర వేసినా సీమాంధ్రకు అనుకూలంగా సవరణలు చేపట్టడంతో తెలంగాణవాదులు కంగుతిన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తున్నదని ఆనందించాలో, చేపట్టిన సవరణల వల్ల జరుగుతున్న నష్టానికి విచారించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బిల్లులో తెలంగాణ వాదులు ప్రతిపాదించిన సవరణలు పట్టించుకోకుండా, సీమాంధ్రనేతల ప్రతిపాదనలకు మాత్రమే ఆమోదం తెలుపడంతో వారిలో అంతర్మథనం ప్రారంభమైంది. తెలంగాణ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఆచితూచి అడుగులేద్దాం -కేసీఆర్‌

తెలంగాణపై ఇంచు కూడా తగ్గం- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

తెలంగాణపై ఒక్క ఇంచు కూడా వెనకకుతగ్గేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు బీజేపీ సంపూర్ణంగా మద్దతునిస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు మద్దతునిచ్చే విషయంలో కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణపై ఇంచు కూడా తగ్గం- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

సమైక్యవాదులకు చెంప దెబ్బ.. విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల కొట్టివేత

 సుప్రీంకోర్టులో సీమాంధ్ర నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. మొత్తం 9 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. విభజనపై జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డే సుమారు గంటన్నర పాటు సుదీర్ఘ వాదనలు విన్నారు. సుప్రీంకోర్టు విచారణకు ఇది సరైన సమయం కాదని ధర్మాసనం తెలిపింది. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సమైక్యవాదులకు చెంప దెబ్బ.. విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల కొట్టివేత

సుష్మాను అనుమానిస్తే.. తెలంగాణ అమరుల అమరత్వాన్ని అవమానించినట్టే: కిషన్‌రెడ్డి

తెలంగాణపై బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంతోపాటు, ఆ తరువాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ మోసాల వల్లే తెలంగాణలో 1100 మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును పెట్టకుండా కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణపై బీజేపీ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సుష్మాను అనుమానిస్తే.. తెలంగాణ అమరుల అమరత్వాన్ని అవమానించినట్టే: కిషన్‌రెడ్డి

హోంశాఖ చేతికి టీ బిల్లు – ఊపందుకున్న కేంద్ర కార్యాచరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 3 : మరో రెండు రోజుల్లో తెలంగాణకు అత్యంత కీలకమైన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటం.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అభిప్రాయాలు జత చేసుకుని టీ బిల్లు హస్తినకు చేరుకోవటం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం మరింత వేడెక్కింది. దీనికి దాదాపు రాష్ట్ర ముఖ్యనాయకత్వం మొత్తం హస్తినలో మకాం వేయడం మరింత సెగను … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on హోంశాఖ చేతికి టీ బిల్లు – ఊపందుకున్న కేంద్ర కార్యాచరణ