Category Archives: TELANGANA NEWS

రాష్ట్రపతి పాలన మొదలు

హైదరాబాద్, మార్చి 1 :మరికొద్ది రోజుల్లో రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన మొదలైంది. ఈ విషయంలో కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలియజేయడం, గెజిట్ నోటిఫికేషన్ శనివారం మధ్యాహ్నానికే రాష్ట్ర గవర్నర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరుకోవడంతో ఇక రాష్ట్ర పరిపాలనకు రాజ్‌భవన్ కేంద్ర బిందువుగా మారనుంది. గవర్నర్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on రాష్ట్రపతి పాలన మొదలు

‘రూ.5కే భోజనం’ పథకం

హైదరాబాద్: కొంత మంది పేద ప్రజల కడుపులైనా నింపాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈమేరకు అక్షయ ఫౌండేషన్‌తో కలిసి రూ.5కే భోజనం పేరుతో పు ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తుంది. నగర్ మేయర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. నాంపల్లితోపాటు పలు జీహెచ్‌ఎంసీ సర్కిళ్లలో ఈ పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం కోసం జీహెచ్‌ఎంసీ … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on ‘రూ.5కే భోజనం’ పథకం

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన: నేడే నోటిఫైడ్ డేట్

న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఈ రోజు నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఈ రోజే నోటిఫైడ్ డేట్ అమలు కానుంది. రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు.

Posted in TELANGANA NEWS | Comments Off on రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన: నేడే నోటిఫైడ్ డేట్

అంగన్‌వాడీల సమ్మె విరమణ

హైదరాబాద్: గత 13 రోజులుగా సమ్మె చేస్తోన్న అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె విరమించారు. ఈమేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అంగన్‌వాడీల నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దశలవారీగా తమ డిమాండ్లను నెరవేర్చుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు తాము సమ్మె విరమిస్తున్నట్టు నేతలు వెల్లడించారు. రూ.800 జీతం పెంచేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు.

Posted in TELANGANA NEWS | Comments Off on అంగన్‌వాడీల సమ్మె విరమణ

బీజేపీ జాతీయనేత బంగారు లక్ష్మన్ కన్నుమూత

హైదరాబాద్: బీజేపీ జాతీయనేత బంగారు లక్ష్మణ్ కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోధా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. లక్ష్మణ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1939 మార్చి 17న ఆయన జన్మించారు. హైదరాబాద్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1975లో … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on బీజేపీ జాతీయనేత బంగారు లక్ష్మన్ కన్నుమూత

విభజన షురూ..

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ ప్రకటన త్వరలోనే వెలువడనున్న నేపథ్యంలో పాలనా పరమైన విభజన ప్రక్రియలన్నీ వేగం పుంజుకున్నాయి. విభజన క్రమంలో రెండు రాష్ర్టాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం అనుసరించాల్సిన విధానాలపై చీఫ్‌సెక్రెటరీ ప్రసన్న కుమార్ మహంతి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై మార్గదర్శకాలను జారీ చేశారు. ఆయా శాఖల స్పెషల్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on విభజన షురూ..

ఉమ్మడి విద్య.. ఏడాదే

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విభజన జరిగిన ఏడాదిలోగా రెండు రాష్ర్టాల్లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 ప్రకారం రాష్ట్రంలో 107 రాష్ట్ర స్థాయి విద్యా, ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయి. రాష్ర్టాల ఆవిర్భావం నుంచి ఏడాదివరకు రెండు రాష్ర్టాలకు ఈ సంస్థలు సేవలు అందించాల్సి ఉంటుంది. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఉమ్మడి విద్య.. ఏడాదే

ఇందిరాపార్క్ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్ట్

హైదరాబాద్: కనీస గౌరవ వేతనం పెంచాలంటూ ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తలు చలో రాజ్‌భవన్‌కు బయలుదేరారు. చలో రాజ్‌భవన్‌కు బయల్దేరిన అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇందిరాపార్క్ నుంచి అన్ని దారులను పోలీసులు మూసివేశారు.

Posted in TELANGANA NEWS | Comments Off on ఇందిరాపార్క్ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్ట్

ఉమ్మడి రాష్ట్రంలోనే పార్లమెంటు ఎన్నికలు- కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: వచ్చే పార్లమెంటు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే జరుగుతాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. అయితే ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బిజినెస్ స్టాండర్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశముంది. … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on ఉమ్మడి రాష్ట్రంలోనే పార్లమెంటు ఎన్నికలు- కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే

26న కేసీఆర్ రాక – బేగంపేట నుంచి భారీ ర్యాలీ

 తెలంగాణ బిల్లు ఉభయసభలలో ఆమోదం పొందిన క్రమంలో రాజధాని హైదరాబాద్‌లో భారీ ఊరేగింపును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 26న ఊరేగింపు నిర్వహించడానికి టిఆర్‌స్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ రోజున డిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రమానికి చేరుకుంటారని, అక్కడి నుంచి గన్‌పార్క్ వరకు దాదాపు లక్షమందితో ర్యాలీ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on 26న కేసీఆర్ రాక – బేగంపేట నుంచి భారీ ర్యాలీ

సోనియాకు కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కుటుంబసభ్యులతో సహా 10 జనపథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. భార్య, కూతురు, కుమారుడు, అల్లుళ్లు, మనవళ్లతో సహా పన్నెండు మంది కుటుంబ సభ్యులు వెంటరాగా సోనియాగాంధీని కలుసుకున్న కేసీఆర్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సోనియాకు కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్

రాష్ట్రపతి పాలనా?కొత్త ప్రభుత్వమా?

ఫిబ్రవరి 21 :ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలనను విధించాలా? లేక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలా? అనే విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటంతో రాష్ట్ర మంత్రివర్గాన్ని రద్దు చేస్తూ … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on రాష్ట్రపతి పాలనా?కొత్త ప్రభుత్వమా?

మూడు నెలల్లో తెలంగాణ అవతరణ

ఫిబ్రవరి 21 :తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంతిమ ఘట్టానికి చేరుకుంది. పార్లమెంటు ఉభయసభల ఆమోదంతో మరుసటి రోజు శుక్రవారం నుంచి రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దశాబ్దాల పోరాటం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ తేదీ.. నాలుగైదు రోజుల్లో ఖరారు కానుంది. టీ బిల్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు ఈ నెల … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on మూడు నెలల్లో తెలంగాణ అవతరణ

తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీపై షిండే ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 :  కీలకమైన తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో ప్రతిపక్షంపైనా, ప్రత్యేకించి బీజేపీ మద్దతుపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌పైనా ప్రశంసల జల్లు కురిపించారు. 15వ లోక్‌సభ చివరి రోజు సమావేశంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. సభలో వేర్వేరు అంశాలపై అధికారపక్షం, ప్రతిపక్షం పరస్పరం విభేదించుకున్నా.. సభ వెలుపల వాటిని కొనసాగించకపోవడం … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీపై షిండే ప్రశంసల జల్లు

కిరణ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. రాజీనామా నివేదికను కేంద్రానికి పంపించారు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కిరణ్‌ను కోరారు.

Posted in TELANGANA NEWS | Comments Off on కిరణ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్

తీర్మానం నుంచి ఆమోదం దాకా..ఓ యుద్ధ దశ్యం

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకఘట్టం సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం. 2013 జూలై 30న జరిగిన ఆ సమావేశం తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణ దాదాపు ఖాయమైపోయింది.అదే రోజు జరిగిన యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఒకే చేయడంతో కేంద్రం ఆమోదించినట్టే అయ్యింది. తెలంగాణ ప్రజలు కోరుతున్న 10 జిల్లాల తెలంగాణకు సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈ నిర్ణయాన్ని … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS | Comments Off on తీర్మానం నుంచి ఆమోదం దాకా..ఓ యుద్ధ దశ్యం

ఉద్యమం ఉప్పెన

నిప్పులమీద నడిచింది తెలంగాణ, సాయుధపోరు స్పూర్థిని ఆవాహన చేసుకుని అడుగులేసింది తెలంగాణ. అరవైఏళ్ల కల సాకారం చేసుకోవడం వెనక ఎంత ఆర్తి, ఎంత ఆవేదన, హింస. పళ్లబిగువున అన్నీ భరించి అడుగు అడుగు వేసి గమ్యం ముద్దాడింది. ఈ ప్రస్థానంలో ఎన్నెన్నో ఘట్టాలు, నెత్తురు ఉడికించినవి, కుమిలి కుప్పగూలినవి, అగ్నిపరీక్షకు నిలిచినవి. అగ్నికి ఆహుతి చేసుకున్నవి. … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on ఉద్యమం ఉప్పెన

సీఎం కిరణ్ రాజీనామా

రాజీనామాను ఆమోదించిన గవర్నర్ హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన చివరి మీడియా సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ తెలుగుజాతిని ఐక్యంగా ఉంచలేకపోయినందుకు, కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ తాను ఈ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కిరణ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ హైదరాబాద్: ముఖ్యమంత్రి … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on సీఎం కిరణ్ రాజీనామా

రాజ్యసభలో వీధిరౌడీలా సీఎం రమేష్

ఢిల్లీ: ఈరోజు రాజ్యసభలో సీమాంధ్ర టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వీధిరౌడీలా ప్రవర్తించారు. మొన్న మైకు విరగొట్టిన విషయం తెలిసిందే. ఈరోజు సభకు తెలంగాణ బిల్లు వచ్చిందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్ ప్రకటిస్తుండగా ఆయనపై సీఎం రమేష్ చేయిచేసుకున్నారు. అధికారి చేతిలోంచి ప్రతులను లాక్కునేందుకు ప్రయత్నించారు. రమేష్ తీరుపై డిప్యూటీ ఛైర్మన్ ఆగ్రహం … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on రాజ్యసభలో వీధిరౌడీలా సీఎం రమేష్

మావల్లే తెలంగాణ రాష్ట్రం: బీజేపీ

ఢిల్లీ, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరో అడుగుదూరంలోనే ఉండటంతో రాష్ట్రాన్ని ఇచ్చిన క్రెడిట్ సంపాదించుకొనేందుకు కాంగ్రెస్‌తో బీజేపీ పోటీ పడుతున్నది. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీజేపీ అగ్రనేతలు తమవల్లే తెలంగాణ ఏర్పడుతోందని ప్రకటించారు. కొద్దిరోజులుగా సాగుతున్న గందరగోళానికి కాంగ్రెస్సే కారణమని నిందించారు. ప్రజలకు ఇచ్చి న వాగ్దానాన్ని … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on మావల్లే తెలంగాణ రాష్ట్రం: బీజేపీ