Category Archives: POEMS

హఠ్‌.. సాలా!!-రత్నశ్రీ

సామూహిక మానభంగం ఆరున్నర దశాబ్దాల వసంతం అర్ధరాత్రి  కూకటివేళ్లతో పెకిలిపోయింది సూర్యుడు తెల్లారి భళ్లున నవ్వాడు నెత్తుటి పుష్పంమీద ఫోటో ఫ్లాష్‌ సిరామిక్‌ నునుపులో ఎర్ర కలువలు దండకారణ్యంలో శోకవచనం ఎవడో పాటకట్టి లూప్‌లో పెట్టాడు ఏకాకి కీచురాయి భీతావహ స్వప్నం దయచేసి అందరూ వెళ్లిపోండి కాసేపట్లో ఇక్కడ ఎన్‌కౌంటర్‌ జరగబోతోంది హఠ్‌.. సాలా! -రత్నశ్రీ

Posted in POEMS | Comments Off on హఠ్‌.. సాలా!!-రత్నశ్రీ

తెలంగాణ గోస

ఏం జేతునక్కా? గంజి దాగుదమంటే గింజ లేకపాయె బువ్వ దిందామంటే చిల్లి గవ్వలేక పాయె ఏమున్న దక్కో? ఏం జేతునక్కా? కాల్వ లెండిపాయె చెర్వు లెండి పాయె నదిలోని నీళ్ళన్ని సీమాంధ్ర పాలాయె ఏమున్నదక్కో ఏం జేతునక్కో? సదువుకుందా మంటె సంక జూపిచ్చిండ్రు కొలువులేమో కోన సీమాంధ్ర పాల్జేసిరి ఏమున్నదక్కో? ఏం జేతునక్కో? తెలంగాణ దెస్తమని … Continue reading

Posted in POEMS | Comments Off on తెలంగాణ గోస

ఛీ గీళ్ళదో మాటనా?

ఇగ ఇచ్చుడే నన్నరు ఇగ తెచ్చుడేనన్నరు గల్లి గల్లి తిరిగిండ్రు జబ్బపూగిరేసిండ్రు ఆడమాదే! గీడమాదే ఏడైనా! మాదేనన్నరు; మా మాటకు తిరుగులేదు మాటంటే’ మాటన్నరు ఇగ ఢిల్లీ పోవుడే అడ్గుడే; తెచ్చుడేనన్నరు రాసుకోంవూడి‘తెలంగాణ’ మా మాటింటది; అమ్మ ఇత్తది తెలంగాణ; అమ్మ మొక్కుండ్రి; అమ్మకు ముడుపులు గట్టుండ్రి; అమ్మకు ఇగ అచ్చుడే; ఇగ తెచ్చుడే అనుకుంట … Continue reading

Posted in POEMS | Comments Off on ఛీ గీళ్ళదో మాటనా?

రేపటి తొలి పొద్దు తెలంగాణల్నే..

కన్నీళ్ళ కత్తుల వంతెనల్ని దాటి కదనరంగం వైపు అడుగులేస్తున్నం గొంతు గొంతును కలుపుకుంటూ గుండె గుండెను తడుముకుంటూ నినాదాల హోరులో, నారజీరే కమ్మకత్తుల నై తెలంగాణన్న కుత్కెల మీద మిట్కరిస్తున్నం. అమరుల పీన్గుల మీద పమాణం జేసినోళ్ళారా నాల్కెలు పెగుల్తలేవు/ పేల్తలే గొంతుల పచ్చనోట్ల కట్టలడ్డంపడ్డయి గదా? నా తల్లి బొండిగ మీద తులాభారాలు తూగేటోళ్ళారా! … Continue reading

Posted in POEMS | Comments Off on రేపటి తొలి పొద్దు తెలంగాణల్నే..

వీరునికి చావులేదు-ఉదయమిత్ర

అనుకుంటాంగాని హత్యలు జేసి ఆశయాల్ని చిదిమేయగలరా… తలి ్లగర్భం నుండివిడివడిన వాడు పుడమి గర్భంలో సమసిపోవోచ్చునేమొగానీ ఉరికంబంమీద జన్మించివోడికి ఉజ్వల పోరాటగానం జేసినోడికి చావెక్కడ? ఉరిదీసినా కొద్దీ ‘బషాయిటుడు’ లా పుట్టుకొస్తుంటాడు వీరునికి చావులేదు శరీరాన్ని చిదిమేస్తే చరిత్ర ఆగిపోదు… అతడు నడిచిన తొవ్వ ఉంటది జగిత్యాల జైత్ర యాత నుండి జంగల్ మహల్ దాంక … Continue reading

Posted in POEMS | 1 Comment

జనగళం -డాక్టర్. చెరుకు సుధాకర్

వేల మిలియన్ మార్చ్‌ల రూపమా- ఐలన్నా! అవును, అక్షరాలు దిద్దాల్సిన బాల్యం యుద్ధబాల శిక్షను దిద్దడం నేర్పింది వడివడిగా నడవడమూ నేర్పింది పసులగాచే బాల్యం, వెన్నెల రాత్రుల్లో అన్నల పాటలకు కోరస్ ఇచ్చి ఇచ్చి అలుపెరగని మార్చింగ్ సాంగ్ నేర్పింది- పాలకంకుల కాపాడడానికి విసిరిన వడిసెల రాయి గురి చూసి కొట్టే నైపుణ్యం నేర్పింది నిన్న … Continue reading

Posted in POEMS | Comments Off on జనగళం -డాక్టర్. చెరుకు సుధాకర్

ఇపుడు రాని తెలంగాణా అవసరం లేదు,

పోరు చరిత్ర వెచ్చని దేహం కింద కన్ను తెరిచిన అగ్గిపిట్ట పది కొమ్మలపై నుండి చేస్తూన్న ఉద్యమం తెలంగాణా త్యాగాల తెలంగాణా! నా తెలంగాణా! ఇపుడు రాని తెలంగాణా మనకి అవసరం లేదు, ఇంత ఉద్యమం వృధా కాకుండా చూసే బాద్యత మనందరిది. అరవ సంవత్సరాల దోపిడీ చాలు.. .రెండు సంధర్బాల ద్రోహం చాలు… ఇక … Continue reading

Posted in POEMS | Comments Off on ఇపుడు రాని తెలంగాణా అవసరం లేదు,

తగలబడే చోట తలదాచుకోమని ఎవ్వడు చెప్పిండు-తెలంగాణ శ్రీనివాస్‌

రోమ్‌లాంటి నగరం తగలబడడానికే తప్ప.. తలదాచుకోవడానికి కాదని రాసిండు ఆంధ్రకవి ఎండ్లూరి సుధాకర్‌ తగలబడే చోట తలదాచుకోమని ఎవ్వడు చెప్పిండు రోమ్‌కు పోయి కామ్‌గా బతుకాలె కానీ.. రోమ్‌లో బ్రహ్మనాయుడు విగ్రహం పెడ్తమంటే వాళ్లు ఊకుంటరా తెలంగాణ జాగలకొచ్చి విగ్రహం పెట్టి.. తెలంగాణోన్నే కులహీనుడన్నావంటే నీకు ఈ గడ్డ ఎంత స్వేచ్ఛనిచ్చిందో అర్థం చేసుకో శ్రీశ్రీకి … Continue reading

Posted in POEMS | Comments Off on తగలబడే చోట తలదాచుకోమని ఎవ్వడు చెప్పిండు-తెలంగాణ శ్రీనివాస్‌

జాతి జాతి అని జాంగలు చింపుకుంటరేందిరా భాయ్‌ -బైరగోని శ్రీనివాస్‌

జాతి జాతి అని జాంగలు చింపుకుంటరేందిరా భాయ్‌ ఎవ్వని జాతి.. ఎక్కడి జాతి ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలు ప్రతిష్టించినప్పుడు మీకు జాతి గుర్తుకు రాలేదా బ్రహ్మనాయుడుకు మా బతుకుకు సంబంధం ఏంది. నన్నయ్య గురించి తెలిసిన తెలుగుజాతికి.. భాస్కర రామాయణం రాసిన హుళక్కి భాస్కరుడు ఎందుకు గుర్తురాలేదు అరే భాయి అల్లూరి విగ్రహాన్ని పెట్టేటప్పుడు.. మా … Continue reading

Posted in POEMS | Comments Off on జాతి జాతి అని జాంగలు చింపుకుంటరేందిరా భాయ్‌ -బైరగోని శ్రీనివాస్‌

చస్తూ బతికే జీవనమెందుకు..-తెలంగాణ శ్రీనివాస్‌

భయం భయం అనుక్షణం భయం భయం చస్తూ బతికే జీవనమెందుకు బానిసత్వపు బతుకులెందుకు ఎదురుతిరిగితే నీదే జయం పిరికివాడివి కాదునీవు.. పిడికిలి బిగించి పోరాడు.. చేవలేని వాడివి కాదు నీవు.. చావుకైనా తెగించిపోరాడు ఇంకెన్నాళ్లు సీమాంధ్రుల అణచివేతకు బలవుతావు అణచివేయబడ్డ సోదరా.. ఇకనైనా లేవరా.. తెలంగాణ నీదిరా.. తెగించి కొట్లాడరా.. నీ తల్లి తెలంగాణకు విముక్తి … Continue reading

Posted in POEMS | Comments Off on చస్తూ బతికే జీవనమెందుకు..-తెలంగాణ శ్రీనివాస్‌

విద్యార్థులం మేం తెలంగాణ విద్యార్థులం-తెలంగాణ శ్రీనివాస్‌

విద్యార్థులం మేం తెలంగాణ విద్యార్థులం మూగబోయిన తెలంగాణ వీణను మీటి.. నివురుగప్పిన చైతన్యాన్ని నిద్రలేపి.. చితికిన ఆశల్ని చిగురింపజేసి.. అణచివేయబడ్డ తెలంగాణవాదాన్ని పెకిలించి తరతరాల నిస్పృహను తరిమికొట్టి నలిగిన హృదయాలను రగిలించి కణకణమండే నిప్పు కణికలమై.. ఉడికిన యువరక్తాన్ని ఉసిగొల్పి.. ఉరుములమై.. మెరుపులమై.. పిడుగులమై.. ఎగిసిపడే భీకర అలలమై.. కడిలిలో సునామీలమై.. ఉవ్వెత్తున ఎగుస్తాం.. ఉన్మత్త … Continue reading

Posted in POEMS | Comments Off on విద్యార్థులం మేం తెలంగాణ విద్యార్థులం-తెలంగాణ శ్రీనివాస్‌

ప్రభంజనం ఇది ప్రభంజనం-తెలంగాణ శ్రీనివాస్‌

ప్రభంజనం ఇది ప్రభంజనం తెలంగాణ విద్యార్థుల ప్రభంజనం ఏబీవీపీ, టీఆర్‌ఎస్వీ, పీడీఎస్‌యూ.. దళితసంఘాలు, బీసీ సంఘాలు.. సంఘమేదైనా పోరాటమొక్కటే.. చేరాల్సిన గమ్యమొక్కటే సాధించాల్సిన లక్ష్యమొక్కటే సిద్ధాంతాలు పక్కకుబెట్టి సింహాల్లా దూకిన్రు లాఠీలకు తలలు అడ్డుపెట్టిన్రు తుపాలకు గుండెలను ఎదురొడ్డి నిలిచిన్రు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన్రు ఉద్యమానికి రథసారథులయిన్రు ఉద్యమ ప్రభంజాన్ని ఢిల్లీకి చాటిన్రు ప్రభంజనం … Continue reading

Posted in POEMS | Comments Off on ప్రభంజనం ఇది ప్రభంజనం-తెలంగాణ శ్రీనివాస్‌

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు-కాళోజి

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు భాషీయుల ‘సుహృద్భావన’ ఎంతని వర్ణించుట సిగ్గుచేటు వాక్యంలో మూడుపాళ్ళు ఇంగ్లీషు వాడుకుంటు తెలంగాణీయుల మాటలో ఉర్దూపదం దొర్లగానే హిహీ అని ఇగిలించెడి సమగ్రాంధ్ర వాదులను ఏమనవలెనో తోచదు. ‘రోడ్డని’ పలికేవారికి సడకంటె ఎవగింపు ఆఫీసని అఘొరిస్తూ కచ్చేరంటే కటువు సీరియలంటే తెలుగు సిల్సిల అంటే ఉరుదు సాల్టు, షుగర్, టిఫిన్ … Continue reading

Posted in POEMS | Comments Off on తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు-కాళోజి

పోదాం పదరా!!

పదరా పదరా పోదాం పదరా తెలంగాణ సాధిద్దాం పదరా దొంగల దూరం కొడదాం పదరా వేరే రాజ్యం చేద్దాం పదరా || పదరా || షాట్లకు బెదరక చెదరక పదరా హిరణ్యకశిపుడు హడలగ పదరా నర్సింహుడవై ముందుకు పదరా పదరా పదరా … || పదరా || అధికృత హింసనే పాలన అంటే ప్రహ్లాదుని హేళన … Continue reading

Posted in POEMS | Comments Off on పోదాం పదరా!!

నిర్వాకం

నమ్ముకొని పెత్తనము ఇస్తే నమ్మకము పోగొట్టుకొంటివి కుప్పకావలి ఉండి కట్టలు తప్పదీస్తివి ముద్దెరేస్తివి సాటివాడు చేరదీస్తే నోటినిండా మన్ను గొడ్తివి పదవి అధికారముల బూని పదిలముగ తల బోడి జేస్తివి దాపునకు రానిస్తె చనువుగ టోపి పెడితివి లాభపడితివి అన్నవై తమ్ముళ్ల తలలను నున్న జేస్తివి మురియబడితివి తొత్తులను చుట్టూర జేర్చుక పెత్తనాలు చేయబడితివి ‘పొచంపాడు’ … Continue reading

Posted in POEMS | Comments Off on నిర్వాకం

దోపిడి చేసే ప్రాంతేతరులను…

దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం దోస్తుగ ఉండే వారితొ మేమును దోస్తే చేస్తం – ప్రాణమిస్తం ఎంతకు అంత అన్న ధోరణితో చింతమాని బ్రతుకును సాగిస్తం తెలంగాణమిది – తెలంగాణమిది తీరానికి దూరాన వున్నది ముంచే యత్నం చేస్తే తీరం మునుగును … Continue reading

Posted in POEMS | Comments Off on దోపిడి చేసే ప్రాంతేతరులను…

తెలంగాణ వేరైతే-కాలోజీ

తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా? తెలంగాణ వేరైతే తెలుగుబాస మరుస్తారా? తెలంగాణ వేరైతే కిలోగ్రాము మారుతుందా? తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపొతుందా? తెలంగాణ వేరైతే చెలిమి తుట్టి పడుతుందా? తెలంగాణ వేరైతే చెలిమి లెండిపొతాయా? కులము తగ్గిపొతుందా బలము సన్నగిలుతుందా పండించి వరికర్రల గింజ రాలనంటుందా? రూపాయికి పైసాలు నూరు కాకపొతాయా? కొర్టు అమలు అధికారము … Continue reading

Posted in POEMS | Comments Off on తెలంగాణ వేరైతే-కాలోజీ