Category Archives: POEMS

ఎవడు మతతత్వవాది? ఎవడు కాదు?

ఇంతకీ ఎవడు మతతత్వవాది? ఎవడు కాదు? నిజంగా సెక్యూలరిస్టులంటే.. ఏ మతానికి చెందని వారా? అన్ని మతాలను సమంగా చూసేవారా? లేక ఒక వ్యక్తికి, ఓ ఘటనకు ముడిపెట్టి.. ఓ మతాన్నే విమర్శించేవాళ్లా ? అదే నిజమైతే.. ఏదో ఒక జమానాలోనో.. ఘటనలోనో.. నరమేధం సృష్టించని జాతేది? మతమేది? అందరూ ఆ తానులో ముక్కలేగా.. ఇంకెందుకు … Continue reading

Posted in POEMS | Comments Off on ఎవడు మతతత్వవాది? ఎవడు కాదు?

సెక్యులర్‌ ముసుగులో ఎందుకు మేధావి కలరింగ్‌?

ఎవడున్నాడీ లోకంలో.. ప్రాంతీయ పక్షపాతి కానివాడు. నువ్వెవరంటే.. నేను విశ్వమానవుడినని చెప్పగలిగే ధీరుడు. కులమో, మతమో.. ఇజమో.. గిజమో… ఒక చట్రంలో చిక్కని వాడెవ్వడు.. ఐనా మన పిచ్చి గానీ.. ముస్లింలకు అల్లా.. క్రైస్తవులకు జీసస్‌.. హిందువులకు రాముడో , కృష్ణుడో మరో ముక్కోటిదేవతలో.. దేవుళ్లే.. సర్వాంతర్యాములు.. కానీ సకల జనుల వాళ్లు కాదు కదా? … Continue reading

Posted in POEMS | Comments Off on సెక్యులర్‌ ముసుగులో ఎందుకు మేధావి కలరింగ్‌?

రండిరా చూసుకుందాం -సుజాత సూరేపల్లి

బలైన అత్మల సాక్షిగా రండిరా చూసుకుందాం రక్తం సల సల మరుగుతుంది గుండె మండుతుంది బలైన ఆత్మల సాక్షిగా యుద్ధ భూమిలొ సిద్ధంగున్నం బందొబస్తుగున్నం భూములని దోచుకుని తిన్న కొవ్వు కరగదీస్తం బిడ్డా ! పది జిల్లాలు మా పంచ ప్రాణాలు హైదరాబాద్ మా గుండెకాయ రా ఇంకొక్క మాట హైదరబాద్ మీద పేలిన్రొ ఖబడ్దార్ … Continue reading

Posted in POEMS | Comments Off on రండిరా చూసుకుందాం -సుజాత సూరేపల్లి

నెత్తుటిలో సగం….

ఆకు చెప్పులేసుకొని నాలుగు రొట్టె ముక్కలు మూటగట్టి సరిహద్దు ముళ్ళకంచెలు దాటి, యవ్వనాన్ని ఎడారి ఇసుకలో నెత్తుటి దోసిల్లతో పారబోస్తున్న వాడి కనుగుడ్లలో దాగిన నీటి చెలిమె చూశావా?? పుట్టిన గడ్డపై నక్కి నక్కి బతకాల్సిన దైన్యాన్ని గట్టిగా చప్పట్లు చరిచి ఆనందాన్ని బిగ్గరగా పాడలేనితనాన్ని ఏనాడైనా విన్నవా?? వాడినిక్కడ నుండి తరుముతున్నది నువ్వూ నేనే … Continue reading

Posted in POEMS | Comments Off on నెత్తుటిలో సగం….

ఏం చేస్తావో చేస్కో

‘ప్రభుత్వం నాది, పవర్ నాది, పర్స్ నాది చూడూ తెగేసి చెపుతున్నా.. రాస్కో తెలంగాణకు పైసా ఇవ్వను చూస్కో ఏం చేస్తావో చేస్కో’ ‘మాటల వాణ్ణికాను, పక్కా చేతల వాణ్ణి చేసింది తక్కువ చెయ్యబొయ్యేది ఎక్కువ ఇంకేమేమి చేస్తానో చూస్కో ఏం చేస్తావో చేస్కో’ ‘ఖలీల్ జిబ్రాన్ కరక్టే అన్నాడు మీ పిల్లలు మీ పిల్లలు … Continue reading

Posted in POEMS | Comments Off on ఏం చేస్తావో చేస్కో

తొండి

మనసంతా గాలిగాలి బతుకంతా గోసగోస పాడినకాడికి సాలుతియ్ ఇగ లాలిపాటలు ఆపుజేయ్ జోలపాటలు బందుజేయ్ రేషం పాటలు మోసం పాటలు షురూ చేయ్ అయిందొకనాడు పోయిందొకనాడు తెలంగాణ పదాన్ని వడిసెలలో పెట్టి పంటను సీరుకతింటున్న ఆధిపత్య పక్షుల్ని గెదిమి గెదిమి కొట్టాలె ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదనే కూసుండ కుర్చీ ఇత్తే పండ మంచమడిగె’ డప్పందుకో … Continue reading

Posted in POEMS | Comments Off on తొండి

ఎప్పుడొస్తవు తెలంగాణా

ఎప్పుడొస్తవు తెలంగాణా ఎట్లొస్తవె తెలంగాణా కండ్లు కాయలు కాచి, చూపు మందగించె కనుచూపు మేరల్లో కనరావాయితివే… ॥ ఎప్పుడొస్తవు॥ కోరమీసం పోరగాండ్లు దోరవయస్సు కోడెగాండ్లు నిలువెత్తు మంటలో అగ్నికాహుతై బంగారు బతుకుల్ని బలిపెట్టినా రాలే ॥ ఎప్పుడొస్తవు॥ రాస్తరోకోలు, రైలు రోకోలు ప్రతిరోజు పస్తుల దీక్షలు జంతర్ మంతర్ వద్ద జనమంత గుమిగూడి ఢిల్లీ గద్దెలదర … Continue reading

Posted in POEMS | Comments Off on ఎప్పుడొస్తవు తెలంగాణా

ఉస్మానియా చూడరా ఉద్యమాల ఊటరా

ఉస్మానియా చూడరా ఉద్యమాల ఊటరా పల్లె తెలంగాణమంత పోరువీరుల బాటరా శాస్త్రాలు జ్ఞానమంత శ్రమజీవుల సృష్ఠేనని చరిత తిరగరాయాలని బతుకు పోరుసాగాలని కష్టజీవి కన్నీళ్లకు కారణాలు తెలియజెప్పి పెద్ద చదువులసారం జనులమేలు కోరాలని యువతకు ఉత్తేజమిచ్చె నెత్తురు ఉస్మానియా ప్రగతిశీల భావాల విత్తుర ఉస్మానియా //ఉస్మానియా // మట్టిమనిషుల వెట్టి చాకిరికి వెలగట్టి చెమటచుక్కల ఊటచెలిమెల్ని … Continue reading

Posted in POEMS | Comments Off on ఉస్మానియా చూడరా ఉద్యమాల ఊటరా

దసరానాడు పాలపిట్ట తీరు- తెలంగాణ

వాళ్ళెవరు? మనకు నీతులు బోధించడానికి! వాళ్ళెవరు? మన నేతలై బాధించడానికి వాళ్ళెవరు? పాదయావూతలై పాదధూళి మిగల్చడానికి వాళ్ళెవరు? యోధపువూతికలై బాణాలు సంధించి ఎద రగల్చడానికి వాళ్ళెవరు? మనిషినో జెండాగా నిలబెట్టి మనిషికో ఎజెండా చేతికిచ్చి- గుండెల మీద పొర్లాడిన పోరగాండ్లకు కండ్లముందల కదలాడుతున్న రెండు కండ్ల ముచ్చటకు బీరిపోయి బలిదానాలతో జారిపోతే ఎండుకట్టెలయి నిల్చునేలాచేసి రోడ్‌షో, … Continue reading

Posted in POEMS | Comments Off on దసరానాడు పాలపిట్ట తీరు- తెలంగాణ

బహిష్కృత ‘కలం’!

నా భూమ్మీద నాకు జాగాలేదని దగా చేస్తివి నా భాష నాకు కాకుండా రాకుండా అడ్డుపడితివి నా బువ్వ నేను తినకుండా నా సజ్జలు, రాగులు, మక్కలు అన్ని నీ ఊర్ల పండే బియ్యానికి బలి చేస్తివి బతుకమ్మని బతకనియ్యవైతివి లష్కరు బోనాలకు ఎసరు పెడితివి హైదరాబాద్‌ల కట్ల పాములెక్క మెట్రో రైలు పెట్టి ’కోటి’లను … Continue reading

Posted in POEMS | Comments Off on బహిష్కృత ‘కలం’!

కైనీడల కింద కత్తులు మొలుస్తయ్!

మట్టి కంటి సూపుల మీద మన్నుగప్పే రాజ్య ద్రోహం ఇదొక అప్రకటిత యుద్ధం బతుకిప్పుడు పొయిమీద కుండ తుకతుక రగిలే మనాది వాడి బొంద వాడే తవ్వుకుంటున్న ఇగురం! నాలుగోస్తంభాన్ని నిలువునా కూల్చాలని కలగంటున్న ఏలిక దుబ్బ సెల్కల మీద ఇది పరాయి గాలిదుమారం పెరడును కత్తుల కొయ్యలు చేసి నిత్యగాయాల బహుమానాలు! పత్తికాయ పగిలినట్టు … Continue reading

Posted in POEMS | Comments Off on కైనీడల కింద కత్తులు మొలుస్తయ్!

అక్షర ఖడ్గం

  రండి రండి తెలంగాణ రా రమ్మంటుందీ తల్లి పాల రుణం దీర్చె తరుణం వచ్చిందీ గళమున నిప్పులు గానాలే బాణాలుగా ప్రాణాలే పోనీ… తల్లి పాదాలకు మోకరిల్లీ అక్షరము వెపను కన్న లక్ష రెట్లు మిన్నా మనిషికన్న తెలంగాణ మట్టి గొప్పదన్నా కడుపులోన తలబెడత కాళ్లకు దండం బెడుత కంచె చేనుమేస్తే ఎలా? వంచకులను … Continue reading

Posted in POEMS | Comments Off on అక్షర ఖడ్గం

సమైక్య నేతలను ఉరికిచ్చి కొడదం-ప్రతాప్

కళలు గన్న తెలంగాణా కలలోని స్వప్నమాయే.., గంజినిల్ల బ్రతుకులన్నిటికి గంజినిల్లె దిక్కయే…, వలస జీవితాలకు వలసబాటే దిక్కయే…, బిడుభుములన్ని ఎండి పడుభుములయే.., తెలంగాణా ఇస్తామన్న నోల్లన్ని ముగాబోయే…, తెలంగాణా ప్రజల ఆశలన్ని నిరశాలయే…, ఉద్యమాలన్నీ చిత్తుకాగితాల రాతలయే…, సమైక్య చానళ్లన్నీ రాబంధులై పొడువబట్టే .., అయినా ఆగదు ఈ తెలంగాణా, ఆగదు ఈ తెలంగానం…! సమైక్య … Continue reading

Posted in POEMS | Comments Off on సమైక్య నేతలను ఉరికిచ్చి కొడదం-ప్రతాప్

ఎవరైతేనేం…?

కారణమేదైతేనేం! తప్పెవరిదైతేనేం!! తవ్వుకోవడం మానేద్దాం ఎంత తవ్వినా.. రాజకీయ పెంకాసులే కదా! నిన్న జరిగిన యుద్ధం మిగిల్చిన విషాదం నుండి తేరుకుందాం పంచనామాలు ఫలితాన్నివ్వవు పరిష్కారాన్నీ చూపవు తూర్పు దిక్కున పొద్దు పొడుస్తుందని తెల్వడానికి ఏ తత్వం నేర్వాలి? దండుల ముందుండి నడవడం కావాలి చేతుల జెండాలై ఎగరడం రావాలి ఉద్యమాల స్ఫూర్తిగా.. రాలిన సమిధల … Continue reading

Posted in POEMS | Comments Off on ఎవరైతేనేం…?

కసి రగిలే క్షణాలలో

నీ గాన సౌందర్యంలో నా మట్టి కొత్త శకమై పరిమళించింది నీ అడుగుల సవ్వడికి నా నేలంతా సంధ్యారాగమయి ప్రభవించింది నీ స్వర తరంగాల ఝంఝ మారుతంలో నా వీర తెలంగాణ ఘీంకార నాదమయింది నీ రేలపాట వెన్నెలై ప్రకంపించినప్పుడు సముద్రం స్తంభించింది కోకిలమ్మ మూర్చనలు పోయింది నువ్వు ..వసంత మేఘరాగాన్ని ఆలపించే వయెలిన్‌వనీ తూర్పు … Continue reading

Posted in POEMS | Comments Off on కసి రగిలే క్షణాలలో

రేపటి తొలి పొద్దు తెలంగాణల్నే..

కన్నీళ్ళ కత్తుల వంతెనల్ని దాటి కదనరంగం వైపు అడుగులేస్తున్నం గొంతు గొంతును కలుపుకుంటూ గుండె గుండెను తడుముకుంటూ నినాదాల హోరులో, నారజీరే కమ్మకత్తుల నై తెలంగాణన్న కుత్కెల మీద మిట్కరిస్తున్నం. అమరుల పీన్గుల మీద పమాణం జేసినోళ్ళారా నాల్కెలు పెగుల్తలేవు/ పేల్తలే గొంతుల పచ్చనోట్ల కట్టలడ్డంపడ్డయి గదా? నా తల్లి బొండిగ మీద తులాభారాలు తూగేటోళ్ళారా! … Continue reading

Posted in POEMS | Comments Off on రేపటి తొలి పొద్దు తెలంగాణల్నే..

కాలం మళ్లీ గాడిన పడేదెన్నడో! -రత్నశ్రీ

జ్వరం తగ్గేటట్టు లేదు !! కాలం గావుకేక పెట్టింది వాన వెలసి నీరెండలో చిమ్మచీకటి దగ్దమైన హృదయాన్ని ఆర్పే ఒక్క బాష్పబిందువూ లేదు తేజో వలయాలన్నీ విద్యుదాఘాతానికి గురై కాలిపోతూ వాలిపోతూ సంజకెంజాయ రంగులన్నీ కంటిపాప చుట్టూ దుఃఖఛాయలై: కాలం ఈసారి చావుకేక పెట్టింది చీకటి వొడిలో వెలుతురు గాఢనిద్ర అంతర్‌ బహిర్‌ వేదనలు ఒట్టిపోయిన … Continue reading

Posted in POEMS | Comments Off on కాలం మళ్లీ గాడిన పడేదెన్నడో! -రత్నశ్రీ

లగేరహో రహెమున్నీసా!

చుట్టుముట్టిన ఖాకీల నడుమ నువ్ శివమూగిన కాలికమ్మవు జన్మనిచ్చిన గడ్డమీద నీకెంత పాయిరం తల్లీ ! ఒడువని యుద్ధాన్ని భుజానేసుకొని సిరిసిల్ల ఎర్రబస్సెక్కినవా… త్యాగాల మట్టిమీద సరికొత్త చరిత్ర రాసినవ్ భయమెరుగని కొదమసింగమై అవినీతి రాబందుల మీద గర్జించినవ్ సమ్మక్క సారక్కల సాలుదప్పని చాకలి ఐలమ్మవైనవ్ గుండెరగిలిన నాలుగు కోట్లమంది కోపాన్నంత ఒంటినిండా పులుముకొని పటపట … Continue reading

Posted in POEMS | Comments Off on లగేరహో రహెమున్నీసా!

విధ్వంసక విత్తనాలు నాటుతూ..!

వైఎస్ పారిచ్చిన రక్తం ఇప్పుడిప్పుడిప్పుడే ఘనీభవిస్తున్నది ఆ ఘనీభవించిన దారుల్లో ఆమె తోడేళ్లగుంపుతో దండయాత్రకు దిగుతున్నది ఇనుప చువ్వల దండు ఇళ్లంత కలెదిరిగి ఒళ్లంత గుచ్చితే ఆమె ఇప్పుడు నెయ్యిపట్టుకొని వస్తున్నది *** కొడుకు రాముడు, రహీమ్, శిలువ చెక్కిన బొమ్మ నోట్లకట్టలతో మహాసౌధాన్ని నిర్మించుకున్న యువరాజు పార్లమెంట్‌లో గుండెను విప్పిన మనిషి గుండెలు తెగిపడ్డ … Continue reading

Posted in POEMS | Comments Off on విధ్వంసక విత్తనాలు నాటుతూ..!

సమైక్య నేతలను ఉరికిచ్చి కొడదం

కళలు గన్న తెలంగాణా కలలోని స్వప్నమాయే.., గంజినిల్ల బ్రతుకులన్నిటికి గంజినిల్లె దిక్కయే…, వలస జీవితాలకు వలసబాటే దిక్కయే…, బిడుభుములన్ని ఎండి పడుభుములయే.., తెలంగాణా ఇస్తామన్న నోల్లన్ని ముగాబోయే…, తెలంగాణా ప్రజల ఆశలన్ని నిరశాలయే…, ఉద్యమాలన్నీ చిత్తుకాగితాల రాతలయే…, సమైక్య చానళ్లన్నీ రాబంధులై పొడువబట్టే అయినా ఆగదు ఈ తెలంగాణా, ఆగదు ఈ తెలంగానం…! సమైక్య చానళ్లపై … Continue reading

Posted in POEMS | Comments Off on సమైక్య నేతలను ఉరికిచ్చి కొడదం