Category Archives: NATIONAL NEWS

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేం : బీజేపీ

న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖతను వ్యక్తం చేసింది. లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అహ్వానాన్ని ఢిల్లీ బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు హర్షవర్ధన్ తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 4 స్థానాలు తక్కువగా ఉన్నాయని, పూర్తిస్థాయి మెజార్టీ లేకపోవడంతో ప్రతిపక్షంలో ఉంటామని ఆయన లెప్టినెంట్ గవర్నర్‌కు తెలిపారు.

Posted in NATIONAL NEWS | Comments Off on ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేం : బీజేపీ

ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నరు. ఈ సెషన్స్ లోనే తెలంగాణ బిల్లుపెట్టండి-సుష్మా

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తోందని, ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లును పెట్టాలని సుష్మాస్వరాజ్ ఇవాళ లోక్ సభలో  డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మద్దతివ్వదని సుష్మాస్వరాజ్ స్ఫష్టంగా చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా చేపట్టిన ఏ చర్యనూ తాము సమర్థించమని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెప్పగా ఇవాళ పార్లమెంటులో సుష్మాస్వరాజ్ … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నరు. ఈ సెషన్స్ లోనే తెలంగాణ బిల్లుపెట్టండి-సుష్మా

అవిశ్వాసానికి మద్ధతివ్వం: రాజ్‌నాథ్

సీమాంధ్ర మీడియా ఆశలు గల్లంతయినయి.  సీమాంధ్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి దూరం ఉండనున్నట్టు బీజేపీ ప్రకటించింది. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి తాము మద్ధతు ఇవ్వబోమని రాజ్ నాథ్ సింగ్  ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు ఆటంకం ఉండబోదని పేర్కొన్నారు. అవిశ్వాసానికి బీజేపీ మద్దతిస్తదని తప్పుడు ప్రచారం చేసిన సీమాంధ్ర మీడియా … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on అవిశ్వాసానికి మద్ధతివ్వం: రాజ్‌నాథ్

జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే దీక్ష

రాలెగావ్‌సిద్ది: జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం సామాజికి ఉద్యమకారుడు అన్నాహజారే మరోసారి నిరవధిక దీక్షకు దిగారు. మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధిలో ఆయన దీక్ష ప్రారంభించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లుపై యూపీఏ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేదంటే ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకోవాలని అన్నా హజారే కోరారు.

Posted in NATIONAL NEWS | Comments Off on జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే దీక్ష

విభజనపై పూర్తి అధికారం కేంద్రానిదే: షిండే

తెలంగాణ బిల్లును రాష్ట్రపతికి పంపామని షిండే తెలిపారు. రాష్ట్రపతి అసెంబ్లీకి ఎంత సమయం ఇస్తారో తెలియదన్నారు. గత రెండు ఎన్నికల మేనిఫెస్టోలోనూ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని హామి ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. అసెంబ్లీ అభిప్రాయం చెప్పకపోతే కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విభజనపై పూర్తి అధికారం కేంద్రానికి ఉందని తేల్చి చెప్పారు. ఈ సమావేశాల్లోనే … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on విభజనపై పూర్తి అధికారం కేంద్రానిదే: షిండే

ఈనెల 12న హైదరాబాద్ కు దిగ్విజయ్

ఈనెల 12న హైదరాబాద్‌కు వస్తున్నట్టు డిగ్గీ చెప్పారు. సొంత పార్టీ పార్లమెంట్ సభ్యులు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం బాధాకరంగా ఉందని దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. పలువురు సీమాంధ్ర ఎంపీలతో సంప్రదింపులు జరిపామని, నోటీసులు ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. జేసీ ఎలాంటి పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేశారో తెలుసుకుంటున్నానని చెప్పారు. సీఎం కిరణ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఈనెల 12న హైదరాబాద్ కు దిగ్విజయ్

పరువు తీశారు.. పదవులు వీడండి

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సెమీఫైనల్స్‌లా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైనట్టు తెలిసింది. ఒక్క మిజోరం మినహా ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా విఫలమైంది. ఎన్నికల ఫలితాలను విశ్లేషించేందుకు సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on పరువు తీశారు.. పదవులు వీడండి

ఆత్మశోధన చేసుకోవాలి: సోనియా

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద పార్టీ లోతైన ఆత్మశోధన జరుపుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. కుమారుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెంటరాగా ఆదివారం ఏఐసీసీ కార్యాలయంలో మీడియా ముందుకు వచ్చిన సోనియా ఫలితాలను తనదైన శైలిలో విశ్లేషించారు. ఆమె మాటల్లోనే… అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలహీన ప్రదర్శన మీద లోతైన … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఆత్మశోధన చేసుకోవాలి: సోనియా

కమలం వికసించింది.. మోడీ గాలి వీచింది

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతమే. అత్యధిక విద్యావంతులుండే దేశ రాజధాని నుంచి సమాజానికి బహుదూరంగా మెలిగే గిరిజన రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ దాకా బహుళ సంస్కృతులు, భిన్న సమాజాలు, సామాజిక వర్గాలకు ఈ నాలుగు రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఎక్కడా కాంగ్రెస్‌కు నీడ దొరకకపోవడం ఆ పార్టీని దిగ్భ్రాంతిపరిచే అంశమే. విలేకరుల సమావేశంలో … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on కమలం వికసించింది.. మోడీ గాలి వీచింది

ఆమ్ ఆద్మీ అదుర్స్

-ఢిల్లీ ఎన్నికల్లో అపూర్వ విజయగీతిక -షీలాదీక్షిత్‌పై 25,864 మెజారిటీతో కేజ్రీవాల్ గెలుపు -హ్యాట్రిక్ ముఖ్యమంవూతికి ఘోర పరాభవం -31 స్థానాలతో ముందంజలో బీజేపీ -8 సీట్లతో మూడోస్థానానికి కాంగ్రెస్ -హంగ్ అసెంబ్లీ.. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అదుర్స్ అనిపించింది. ఎన్నికల బరిలోకి … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఆమ్ ఆద్మీ అదుర్స్

విరాళాలు నొక్కేసిన అశోక్ బాబు

ఏపీఎన్జోవో నేత అశోక్ బాబు సమైక్యాంధ్ర పేరుతో వసూలు చేసిన విరాళాలను నొక్కేశారని  ఏపీఎన్జీవో మాజీ జనరల్ సెక్రటరీ సుబ్బారామన్, సతీష్ అన్నరు. అశోక్‌బాబు రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయడాన్ని తప్పుబట్టారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాకుండా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘంలో ఉంటారా లేక రాజకీయాల్లోకి వెళతారో సూటిగా సమాధానం … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on విరాళాలు నొక్కేసిన అశోక్ బాబు

బెంగళూరు ఏటీఎం అనుమానితుడు అరెస్ట్

బెంగళూరు: బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై ఓ వ్యక్తి తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు కర్నాటకలోని తుమ్ముకూరులో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. నవంబరు 19న ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవాడానికి వెళ్లిన మహిళపై దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on బెంగళూరు ఏటీఎం అనుమానితుడు అరెస్ట్

10 జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోద ముద్ర

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రజల పోరాటం ఫలించింది. 10 జిల్లాల తెలంగాణకే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. జీవోఎం తయారు చేసిన బిల్లు ముసాయిదాను కేబినెట్ సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించినట్లు … Continue reading

Posted in NATIONAL NEWS, TELANGANA NEWS, Top Stories | Comments Off on 10 జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోద ముద్ర

ఐదింటిలో నాలుగు బీజేపీకే : ఎగ్జిట్ పోల్స్

న్యూఢిల్లీలో : 2014 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐదురాష్ట్రాలకు గాను నాలిగింటిలో బీజేపీ అధికారాన్ని చేపడుతుందని పోల్స్ స్ఫష్టం చేస్తున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు స్వంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సీవోటర్ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఐదింటిలో నాలుగు బీజేపీకే : ఎగ్జిట్ పోల్స్

రేపటినుంచి ‘వింటర్’ హీట్

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పన్నెండురోజుల పాటు జరుగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గురువారం నుంచి జరిగే సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టే పలు అస్త్రాలతో బీజేపీ సహా ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగా, విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు పన్నుతోంది. నరేంద్రమోడీ పాల్గొన్న పాట్నా ర్యాలీలో పేలుళ్లు, మహిళలపై … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on రేపటినుంచి ‘వింటర్’ హీట్

రాజ్‌ఘాట్‌లో టీ జేఏసీ మౌన ప్రార్థన

న్యూఢిల్లీ, డిసెంబర్ 3 :ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని, యువతీయువకు ల బలిదానాలను అపహాస్యం చేస్తూ కేంద్రం రాయల తెలంగాణ నిర్ణయాన్ని తీసుకోనున్నదనే వార్తల నేపథ్యంలో ఆ ప్రతిపాదనపై శాంతియుతంగా పోరాటాన్ని కొనసాగించే తెలంగాణ ప్రజలకు శక్తినివ్వాలని మహాత్మాగాంధీని ప్రార్థించామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మంగళవారం టీజేఏసీ బృందం రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on రాజ్‌ఘాట్‌లో టీ జేఏసీ మౌన ప్రార్థన

తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం

-ఈ సమావేశాల్లోనే ఆమోదించాలి: సుష్మాస్వరాజ్ నతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా బిల్లు తేవాలని యత్నిస్తున్నామని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మంగళవారం స్పీకర్ వివిధ రాజకీయ పక్షాలతో జరిపిన సమావేశం అనంతరం ప్రధాని విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు విషయమై మీడియా … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం

సోనియా సంపద 200 కోట్ల డాలర్ల- హఫింగ్టన్ పోస్ట

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన నాయకుల్లో సోనియాగాంధీ కూడా ఒకరంటూ హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్ విడుదల చేసిన సర్వే సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచంలోని 20మంది అత్యంత ధనవంతులైన దేశాధినేతలు, నాయకుల సంపద వివరాలు వెల్లడించిన హఫింగ్టన్ పోస్ట్ వెబ్‌సైట్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 200కోట్ల డాలర్ల సంపదతో 12వ స్థానంలో నిలిచారని పేర్కొంది. బ్రిటన్ రాణి … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on సోనియా సంపద 200 కోట్ల డాలర్ల- హఫింగ్టన్ పోస్ట

శీతాకాల సమావేశాల్లో బిల్లు వచ్చేనా?

 గత నెల రోజులుగా హస్తినలో అనూహ్యమైన వేగంతో సాగిన తెలంగాణ ప్రక్రియకు.. అకస్మాత్తుగా బ్రేకులు పడినట్లు కనిపిస్తున్నది. మొన్నటిదాకా దూసుకుపోయిన ప్రక్రియ.. కొద్ది రోజులుగా మందగమనంతో సాగుతున్నది. ఇదిగో జీవోఎం సమావేశం.. అదిగో తయారైన నివేదిక.. అంటూ ప్రచారార్భాటం సాగినా.. ఆచరణలో మాత్రం నిర్ణయాత్మక అడుగులు లేకపోవడం తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగిస్తున్నది. దీనికితోడు రాయల తెలంగాణ … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on శీతాకాల సమావేశాల్లో బిల్లు వచ్చేనా?

ఆధార్ లింక్‌ను వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం

కోల్‌కతా: గ్యాస్ సిలిండర్‌కు, ఇతర పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును అనుసంధానం చేయడాన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వ్యతిరేకించింది. ఈమేరకు ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

Posted in NATIONAL NEWS | Comments Off on ఆధార్ లింక్‌ను వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం