Category Archives: NATIONAL NEWS

గల్లంతైన మలేషియా విమానం హైజాక్ ?

మలేషియా: గత వారం రోజులుగా కనిపించకుండా గల్లంతైన మలేషియా విమానం హైజాక్‌కు గురైనట్లు మలేషియా ప్రభుత్వానికి ఎయిర్‌లైన్స్ దర్యాప్తు సంస్థ నివేదిక అందజేసింది. విమానం అదశ్యంపై అధికారుల విచారణ పూరైంది. హైజాక్‌కు కారణాలు తెలియడంలేదని ఆ నివేదికలో పేర్కొంది. విమానం నడపడంలో అనుభవం ఉన్న ఒకరిద్దరు వ్యక్తులు కలిసి విమానాన్ని హైజాక్ చేసినట్లుగా అధికారులు అనుమానం … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on గల్లంతైన మలేషియా విమానం హైజాక్ ?

ఆమ్‌ఆద్మీ పేరుతో పాకిస్థాన్‌లో పార్టీ ఆవిర్భావం

భారత్‌లోని ఆమ్‌ఆద్మీ ప్రభావం పాకిస్థాన్‌లో పడింది. అక్కడ అష్రమ్ ఉల్ ముల్క్ అనే మానవ హక్కుల కార్యకర్త ఆమ్‌ఆద్మీ పార్టీ పేరుతో పార్టీని స్థాపించి ఆదేశ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించారు.

Posted in NATIONAL NEWS | Comments Off on ఆమ్‌ఆద్మీ పేరుతో పాకిస్థాన్‌లో పార్టీ ఆవిర్భావం

యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించండి: జయలలిత

చెన్నై: యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు. తమిళనాడు దేశంలో ప్రగతి సాధించిన రాష్ట్రంగా ఏర్పడాలంటే యూపీఏను పడగొట్టాలని కోరారు. వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.

Posted in NATIONAL NEWS | Comments Off on యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించండి: జయలలిత

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలకు నగరా మోగింది. జనరల్ ఎన్నికలు -2014 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 9 విడతల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. జూన్ 1 నాటికి ప్రస్తుత లోకసభ(15వ) కాలపరిమితి ముగియనున్నందున మే 31నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరేలా ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ తయారు … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాహుల్ ఆర్డినెన్స్‌లపై దాదా అభ్యంతరం!

ఢిల్లీ, మార్చి 1: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుకుతెచ్చిన అవినీతి నిరోధక బిల్లులను ఆర్డినెన్స్ మార్గం ద్వారా అమలుచేయాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభ్యం తరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ఆర్డినెన్స్‌ల విషయమై కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబల్ శనివారం రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ ప్రతిపాదనపై ప్రణబ్ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on రాహుల్ ఆర్డినెన్స్‌లపై దాదా అభ్యంతరం!

సీమాంధ్రకు ప్రోత్సాహకాలు : జైరాం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణను విడదీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సీమాంధ్రకు భారీగానే వరాల వర్షాన్ని కేంద్ర కేబినెట్ కురిపించింది. సీమాంధ్రలో మూడు కేంద్రీయ విద్యాలయాలతోపాటు ప్రఖ్యాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)ను సీమాంధ్రకే కేటాయిస్తూ కేం ద్రం నిర్ణయం తీసుకున్నది. సీమాంధ్రలో మూడు కేంద్రీయ విద్యాలయాలను కడప, గుంటూరు, తూర్పుగోదావరి … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on సీమాంధ్రకు ప్రోత్సాహకాలు : జైరాం

హిందూ-సిక్కులమైత్రికి నిదర్శనం

లూధియానా, ఫిబ్రవరి 23: హిందువులు, సిక్కుల మైత్రికి బీజేపీ-శిరోమణి అకాలీదళ్ పార్టీల పొత్తే నిదర్శనమని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. గుజరాత్‌తో సిక్కులకు అవినాభావసంబంధం దానిని ఎవరూ వేరుచేయలేరని స్పష్టం చేశారు. హిందువులు, సిక్కులు కలిసి అవినీతి కాంగ్రెస్‌ను దేశంనుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లో సిక్కులను లక్ష్యంగా చేసుకుని.. వేధిస్తున్నారని వస్తున్న … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on హిందూ-సిక్కులమైత్రికి నిదర్శనం

గెజిట్ వచ్చిన రోజే నోటిఫికేషన్ తేదీ: జైరాం

రాష్ట్ర విభజనకు సంబంధించి గెజిట్ వచ్చిన రోజును నోటిఫికేషన్ తేదీ అంటారని, ఆరోజు నుంచి కొత్త రాష్ట్రం అమలులోకి వస్తుందని జైరాం రమేష్ అన్నారు. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు పాసైందని, బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతామన్నారు. ఆ తర్వాత గెజిట్ విడుదలవుతుందని పేర్కొన్నారు. గెజిట్ వచ్చిన రోజునే నోటిఫికేషన్ తేదీ అంటారని వివరించారు. … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on గెజిట్ వచ్చిన రోజే నోటిఫికేషన్ తేదీ: జైరాం

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ బిల్లు పాసైంది: షిండే

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో బీజేపీ సహకరించకుంటే తెలంగాణ బిల్లు పాసయ్యేది కాదని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ఏపీ విభజన బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్ధతునిచ్చిందని పేర్కొన్నారు. విభజన ద్వారా రెండు ప్రాంతాలకు న్యాయం జరిగిందని తెలిపారు. రెండు ప్రాంతాలు అభివద్ధి పథంలో నడుస్తాయని అన్నారు.  

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on బీజేపీ మద్దతుతోనే తెలంగాణ బిల్లు పాసైంది: షిండే

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను తమ పార్టీ నిలబెట్టుకుందని బీజేపీ స్పష్టం చేసింది. ఈమేరకు ఇవాళ ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తామని తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. అటు సీమాంధ్రకు, ఇటు తెలంగాణకు న్యాయం చేసేందుకు కషి చేశామన్నారు. అధికారంలోకి వచ్చాక మిగతా పనులు చేస్తామని పేర్కొన్నారు.

Posted in NATIONAL NEWS | Comments Off on ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: రాజ్‌నాథ్

ఉద్యోగుల కేటాయింపునకు కమిటీలు: జైరాం

ఢిల్లీ: తెలంగాణ, సీమాంధ్రకు ఉద్యోగాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఐఏఎస్ అధికారులు… దాదాపు రాష్ట్రస్థాయి 84 వేల మంది ఉద్యోగుల కేటాయింపునకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ప్రకటించారు. సీమాంధ్రలో అభివృద్ధి, నిధుల కేటాయింపునకు డిప్యూటీ చైర్మన్ నేతృత్వంలో ప్లానింగ్ కమిషన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఉద్యోగుల కేటాయింపునకు కమిటీలు: జైరాం

నిలిచిపోయిన లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: తెలంగాణ బిల్లు ఆమోద ప్రక్రియకు సంబంధించిన కీలకమైన 90 నిమిషాల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలను లోక్‌సభ టీవీ నిలిపివేసింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తెలంగాణ బిల్లు చర్చ ను చేపట్టిన తర్వాత హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రసంగం ప్రారంభం కాగానే ప్రసారాలు నిలిచిపోయాయి. లోక్‌సభ టీవీ ‘సభవాయిదా పడింది’ అని … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on నిలిచిపోయిన లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు

పార్లమెంటు భద్రతకు ఏం చేద్దాం?

-భద్రతా కమిటీ అత్యవసర సమీక్షకు స్పీకర్ ఆదేశం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పార్లమెంటులో సీమాంధ్ర సభ్యులు గురువారం చేసిన దాడుల వంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు స్పీకర్ మీరాకుమార్ సోమవారం పార్లమెంటు భద్రతా కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు భవనం భద్రత కోసం ప్రస్తుతం తీసుకొంటున్న చర్యలన్నింటినీ పరిశీలించి, … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on పార్లమెంటు భద్రతకు ఏం చేద్దాం?

రేపే చర్చ ముగించండి- కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో కేసీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఈ ప్రక్రియను తొందరగా ముగించాలని చూస్తోంది. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కంటే ముందే సభలో చర్చ చేపట్టేలా చూడాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే.. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఢిల్లీలోని ఆయన … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on రేపే చర్చ ముగించండి- కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో కేసీఆర్

ఈ సమావేశాల్లో టీ బిల్లు ఆమోదింపజేస్తం- కేంద్ర మంత్రి షిండే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 ): ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదింప చేస్తామని పునరుద్ఘాటించారు. సోమవారం తెలంగాణ బిల్లుపై సభలో చర్చ జరుగుతుందని వెల్లడించారు. ఇదే అంశంపై సోమవారం ఉదయమే కేబినెట్ సమావేశం ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఈ సమావేశాల్లో టీ బిల్లు ఆమోదింపజేస్తం- కేంద్ర మంత్రి షిండే

బాబుకు రాజ్‌నాథ్ అపాయింట్‌మెంట్ నిరాకరణ

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. హస్తినలో పడరానిపాట్లు పడుతూనే ఉన్నారు. ఈమేరకు ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కావాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలమైంది. రాజ్‌నాథ్‌ను కలవాలని చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరారు. అందుకు రాజ్‌నాథ్‌సింగ్ తిరస్కరించారు

Posted in NATIONAL NEWS | Comments Off on బాబుకు రాజ్‌నాథ్ అపాయింట్‌మెంట్ నిరాకరణ

సభలో పరిణామాలు కలచివేశాయి : ప్రధాని

ఢిల్లీ : ఇవాళ లోకసభలో సీమాంధ్ర ఎంపీల తీరుపై ప్రధాని మన్మోహన్ తీవ్ర ఆవేధన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇట్లాంటి ఘటనలను ఇదివరకెన్నడూ చూడలేదని సహచర ఎంపీల వద్ద ప్రధాని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదన్నట్లు సమాచారం.

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on సభలో పరిణామాలు కలచివేశాయి : ప్రధాని

తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు

న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుకు భారతీయ జనతాపార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన విందుకు హాజరైన బీజేపీ అగ్రనేతలు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానికి వారు హామీ ఇచ్చారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని విందుకు … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు

గురువారం లోక్‌సభకు టీ బిల్లు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ గురువారమే లోక్‌సభలో టీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం.. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే కలిశారు.

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on గురువారం లోక్‌సభకు టీ బిల్లు!

రేపు పెద్దల సభకు తెలంగాణ బిల్లు

న్యూఢిల్లీ : ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు లైన్ క్లియరైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం సైతం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు మీడియా … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on రేపు పెద్దల సభకు తెలంగాణ బిల్లు