Category Archives: NATIONAL NEWS
శివ పార్వతులే మాకు మూలం : జమైత్ ఉలేమా ముఫ్తీ
అయోధ్య: ముస్లింలందరికి శివుడే మూలం, శివపార్వతులే మాకు సృష్టికర్తలు అంటున్నాడు ఓ మత పెద్ద. ఈ మాటలు అన్నది ఏ హిందుత్వ సంస్థ నాయకుడో లేకపోతే ఏ హిందూ మత గురువో అనుకుంటున్నారా! వారే ఈ వ్యాఖ్యలు చేసుంటే దీనిలో విశేషము ఏముంది. ఈ మాటలు అన్నది ఓ ముస్లీం మత పెద్ద. జమైత్ ఉలేమా … Continue reading
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ మళ్లీ ఆమెదే..
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల కిరీటాన్ని సెరెనా విలియమ్స్ మరోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో షరపోవాను 6-3, 7-6 తేడాతో సెరెనా ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకుంది.
శర్మ డబుల్ శతక్కొట్టాడు..
కోల్ కతా: శ్రీలంకతో ఈడెన్ గార్డెన్ లో జరిగిన నాల్గో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో దుమ్ము రేపాడు. తుది రెండు వన్డేలకు జట్టులోకి వచ్చిన రోహిత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కేవలం 148 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో రెండో శతకాన్ని పూర్తిచేశాడు. అర్ధ … Continue reading
గోవా కొత్త సీఎంగా పర్సేకర్
గోవా 22వ ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ శనివారం ప్రమాణం చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రాజ్‌భవన్‌లో పర్సేకర్‌తో గోవా గవర్నర్ మృదులాసిన్హా ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు ఫ్రాన్సిస్ డిసౌజా, దయానంద్ మండ్రేకర్, రమేశ్ తవాడ్కర్, మహదేవ్ నాయక్, దిలీప్ పారులేకర్, మిలింద్ నాయక్, అలినా సల్దానా (బీజేపీ), సుదిన్ ధావాలికర్, దీపక్ ధావాలికర్ (ఎంపీజీ) బాధ్యతలు … Continue reading
కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరింది
న్యూఢిల్లీ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే నెలలో ఆయన అధికారాన్ని చేపట్టారు. ప్రస్తుతం … Continue reading
శారద స్కాంలో టీఎంసీ మాజీ నేత అరెస్ట్
కొల్కత్తా: శారద చిట్ స్కాం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మాజీ నాయకుడు అసీఫ్ ఖాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఉదయం ఖాన్‌ను కొల్‌కత్తాలో బిదాన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. శారద చిట్ స్కాం కేసులో టీఎంసీకి చెందిన బడా నాయకుల హస్తం ఉందని … Continue reading
యూపీ నుంచి రాజ్యసభకు పారికర్!
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రక్షణ మంత్రిత్వ శాఖను ఆయన చేపడతారని వినిపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత శనివారం సీఎం పదవికి ఆయన రాజీనామా సమర్పిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆయనను … Continue reading
మోడీ సునామీలో..థర్డ్‌ఫ్రంట్ గల్లంతు
న్యూఢిల్లీ, మే 16: యూపీఏ, ఎన్డీఏ కూటములకు దూరంగా ఉంటూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదామని కొండంత ఆశతో ఉన్న ప్రాంతీయ పార్టీలను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తుత్తునియలు చేశారు. ఇప్పటికే అనేక కలహాలున్నప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాత కలిసిపోదామనుకున్న చిన్న పార్టీల నేతలకు ఆ అవసరం లేకుండా చేశారు. మోడీ ప్రభంజనంలో అన్నాడీఎంకే, తణమూల్ … Continue reading
యూపీలో పట్టాలు తప్పిన డూస్ ఎక్స్‌ప్రెస్
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో జాన్‌పూర్‌కు సమీపంలో డూస్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలులోని ఎనిమిది బోగీలు అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఎల్బీ స్టేడియంలో రేపు మోడీ సభ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఈ నెల 22న తెలంగాణలో ఎన్నికల ప్రచారం .రేపు మోడీ సభను ఎల్బీ స్టేడియంలో నిర్వహించేందుకు అనుమతి లభించింది. దాంతో సభ ఏర్పాట్లలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు.
రజనీకాంత్‌తో మోడీ భేటీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రముఖ దక్షిణాది సినీ నటుడు రజనీకాంత్‌తో ఆదివారం భేటీ అయ్యారు. చెన్నైలో ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకొన్న మోడీ అక్కడి నుంచి నేరుగా రజనీకాంత్ నివాసం పోయెస్ గార్డెన్‌కు వెళ్లారు. వారు దాదాపు 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీపై తమిళనాడులో విపరీతంగా ప్రచారం జరగటంతో … Continue reading
వడోదర లోక్‌సభ స్థానానికి మోడీ నామినేషన్
గుజరాత్ : వడోదర లోక్‌సభ స్థానానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడారు. లోక కళ్యాణం కోసం తమకు మద్దతివ్వండని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు మద్దతిస్తే సుపరిపాలన అందిస్తామని చెప్పారు. తన పట్ల వడోదర ప్రజలు చూపిన ప్రేమ, అభిమానానికి … Continue reading
మోడీ మంచి ప్రధాని అవుతారు-బీజేపీ ప్రధాని అభ్యర్థికి అద్వానీ కితాబు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంవూదమోడీ ఉత్తమ ప్రధానమంత్రి అవుతారని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ప్రస్తుతించారు. తనకు రాజకీ య భవిష్యత్తును అందించింది.. అద్వానీయేనని, ఆయ న లేకుంటే ఈ స్థానంలో ఉండేవాడినేకాదని నరేంవూదమోడీ కొనియాడారు. శనివారం గాంధీనగర్ లోక్‌సభ నియోజకర్గానికి అద్వానీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మోడీ అద్వానీకి … Continue reading
రైతులకు యూపీఏ ఏం చేసిందో చెప్పాలి: మోడీ
జార్ఖండ్: కోట్లాది మంది ప్రజల అడుగులతో ముందుకు వెళ్లినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. అన్నదాతలు చెమట చిందిస్తేనే దేశం కడుపు నిండేదని.. రైతులకు ఏం చేశారో యూపీఏ సమాధానం చెప్పాలని మోడీ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో ముందుకెళ్తున్న అన్నదాతలను గుజరాత్ సర్కారు గౌరవించిందని, వారిని రాష్ర్టానికి పిలిపించి … Continue reading
మున్సిపల్ ఫలితాలపై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 9న ఫలితాలు ప్రకటించాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. మే 7 తర్వాతనే ఫలితాలు ప్రకటించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. దీనిపై రేపు తదుపరి విచారణ జరుగనుంది.
ఫేస్బుక్ చేతికి ఒకులాస్
న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక వెబ్సైట్ సర్వీసుల సంస్థ ఫేస్బుక్ కొనుగోళ్ల పర్వంలో దూసుకపోతున్నది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, వాట్స్ ఆప్‌లను కొనుగోలు చేసిన సంస్థ తాజాగా అమెరికా కేంద్రస్థానంగా వర్చ్యూవల్ రియాల్టీ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న ఒకులాస్ను చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రెండు బిలియన్ డాలర్లు. గడిచిన నెల రోజుల్లో ఇది రెండొ … Continue reading
ఆండ్రాయిడ్ ఫోన్లలో డెండ్రాయిడ్ వైరస్!
న్యూఢిల్లీ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువులను మనకు ఎంత సౌలభ్యంగా ఉంటాయో అప్పుడప్పుడు అంత్యంత ప్రమాదకారిగా మారుతుంటాయి. ఆండ్రాయిడ్ ఆధారంగా నడిచే ఫోన్లు వాడుతున్నారా అయితే జాగ్రత్త సుమా! ఎందుకుంటే ఈ మొబైళ్లపై ట్రక్‌కి వైరస్ డెండ్రాయిడ్ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ట్రోజన్ రకానికి చెందిన ఈ వైరస్ ద్వారా … Continue reading