Category Archives: MEDIA MUCHATLU

హెచ్ఎంటీవీలో తీసివేతల పర్వం

హెచ్ఎంటీవీలో తీసివేతల పర్వం కొనసాగుతుంది. కెమెరామెన్లను, సీనియర్ జర్నలిస్టులను రిజైన్ చేయాల్సిందిగా చెప్తున్నరు. కాస్ట్ కటింగ్ పేరుతో అడ్డగోలు తీసివేతలకు పాల్పడుతున్నరు. మరిన్ని తొలగింపులు తప్పవని సంకేతాలిస్తున్నరు. ఉన్నఫలంగా జర్నలిస్టులను రోడ్డు మీద పడేయడం దుర్మార్గం.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on హెచ్ఎంటీవీలో తీసివేతల పర్వం

టీవీ9 నాజీలారా మీకోసం హిట్లరే వస్తడు

ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం మొదట సబ్ ఎడిటర్లు, సీనియర్ సబ్ ఎడిటర్ల  లిస్ట్ ఇవ్వమన్నది. మీరు సబ్ ఎడిటర్ , సీనియర్ సబ్ ఎడిటర్  కాదు కదా అని మీకు నచ్చని తెలంగాణ జర్నలిస్టుల పేర్లు ఇచ్చిన్రు. తర్వాత కెమెరా మెన్ల లిస్ట్  ఇవ్వమనగానే మీరు కెమెరా మెన్లు కాదుకదా అని సప్పుడు చెయ్యకుండా కొందిరి … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on టీవీ9 నాజీలారా మీకోసం హిట్లరే వస్తడు

టాటా స్కైలో టీ న్యూస్

టాటా స్కై వినియోగదారులకు శుభవార్త.. తొలి తెలంగాణ న్యూస్ చానల్.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీన్యూస్ ఇప్పుడు టాటా స్కైలో చానల్ నెంబర్  763 లో వస్తున్నది.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on టాటా స్కైలో టీ న్యూస్

జీ 24గంటలు క్లోజ్.. ఉద్యోగులకు 3 నెలల జీతం చెల్లింపు

జీ 24గంటలును మూసివేస్తున్నట్టు ఇవాళ జీ గ్రూప్ ప్రతినిధులు చెప్పిన్రు. ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు ప్రతినిధులు ఉద్యోగులు నష్టపరిహారం చెల్లించకుండానే చానల్ ను మూసివేస్తున్నట్టు ప్రకటించిన్రు. దీంతో జర్నలిస్టులు జీ ప్రతినిధిని అడ్డుకుని.. ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన్రు. 6 నెలల జీతం పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసిన్రు.  చర్చలకు పిలిచిన జీ గ్రూప్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జీ 24గంటలు క్లోజ్.. ఉద్యోగులకు 3 నెలల జీతం చెల్లింపు

ప్యాకప్ ప్యాకప్

క్లోజ్…….. లాకౌట్.. మూతబడ్డది.. జీ 24గంటలు మొత్తానికి తాళం పడ్డది. ఇవాలో, రేపో చానల్  సామగ్రి అంతా ఒడిశాకు తరలిపోనున్నది. ఇవాలే టెక్నికల్ చీఫ్ అన్ని లెక్కబెట్టుకున్నడు. అన్నీ కట్టగట్టుకుని తీసుకెళ్లాలని ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారికి అప్పజెప్పిండు. ఎంప్లాయిస్ ఆరునెలల జీతం పరిహారంగా ఇవ్వాలని కోరుతున్నరు. తమ లెక్క సెటిల్ చేయకముందే మొత్తం ప్యాక్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ప్యాకప్ ప్యాకప్

జీ గ్రూప్‌ వాళ్లకు జీతాలు పడ్డయి

హమ్మయ్య.. జీ 24 జర్నలిస్టులు హ్యాపీ..  సుదీర్ఘ నిరీక్షణ అనంతరం జీ ఎంప్లాయిస్‌ కు జీతాలు పడ్డయి.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జీ గ్రూప్‌ వాళ్లకు జీతాలు పడ్డయి

చుక్కలు చూపెట్టిన చుక్కా రాములు

10టీవీలో సీపీఎం నేతల ఆగడాలు పరాకాష్టకు చేరినయి. చుక్కా రాములు అయితే మెదక్ జిల్లా రిపోర్టర్ కు చుక్కలు చూపెట్టిండు. టూ మచ్ గా బిహేవ్ చేసి ఉద్యోగంలోంచి తీసివేయించిండు. కార్మికుల పక్షాన కొట్లాడుతమని.. పేదల పక్షమని ఓ.. ఊదరగొట్టే వారి అసలురంగు వేరే ఉంది. మెదక్ జిల్లాలో సీపీఎం ప్రెస్ మీట్ కు వచ్చిన … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on చుక్కలు చూపెట్టిన చుక్కా రాములు

జీతమో శివచంద్రా!

శివప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న జీ 24 గంటలులో ఉద్యోగులు జీతమో రామచంద్రా అని అరుస్తున్నరు. అసలే పండగ దగ్గరకొస్తున్నది.  ఎప్పుడూ ఒకటోతారీఖు పడే జీతాలు ఇప్పటివరకు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నరు. నిన్న బొత్స సతీష్ జీ గ్రూప్ యాజమాన్యాన్ని కలిసినట్టు తెలిసింది. సతీష్ తో జీ గ్రూప్ ఒప్పందాన్ని రద్దుచేసుకునేదిశగా కదులుతున్నట్టు సమాచారం. అసలే జీతంలేక … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జీతమో శివచంద్రా!

సీమాంధ్ర చానళ్లు ఎన్బీఏ గైడ్ లైన్స్ పాటిస్తయా?

సమైక్యాంధ్ర పేరుతో హింసను ప్రేరేపిస్తున్న చానళ్లకు పోలీసులు నోటీసైులు పంపిన్రు. ఎన్బీఏ గైడ్ లైన్స్ ను పాటించాలని హెచ్చరించిన్రు. కానీ పోలీసుల హెచ్చరికలను చానళ్ల యాజమాన్యాలు లైట్ తీసుకున్నయి. తీసి పక్కు పడేసినయి. గతంలో తమకు నచ్చని పనిచేయమన్నారని చెప్పి NBSA నుంచి టీవీ9 రవిప్రకాష్.. సాక్షి జగన్ తప్పుకున్నరు. ఇలాంటి వీళ్లు ఎన్బీఏ గైడ్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | 1 Comment

ఉగ్రవాదుల పక్కన జగన్

ఉన్మాదంతో సామాన్యులను పొట్టన పెట్టుకునేవాడే ఉగ్రవాది.. సాక్షి చానల్ లాంచింగ్ నుంచి ఫస్ట్ టైమ్ ఓ మంచిపని చేసింది.. రెండు బాక్సుల్లో ఉగ్రవాదులను చూపించి.. మరో బాక్సులో జగన్ ను చూపించింది. ఆ ఉగ్రవాదుల కన్నా జగన్ అనే ఉగ్రవాది మహా డేంజర్ అని సాక్షి ఒప్పుకున్నట్టయింది. రామ్ రెడ్డి మంచిపనిచేసినవ్.. అప్పుడు సోనియాను తిట్టుకుంటూ ఐటెం … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఉగ్రవాదుల పక్కన జగన్

ఎన్బీఏ గైడ్ లైన్స్ పాటించని మీడియాపై చర్యలు తీసుకుంటం

ఎన్బీఏ గైడ్ లైన్స్ పాటించని మీడియాపై చర్యలు తీసుకుంటమని ఇంచార్జ్ డీజీపీ ప్రసాదరావు అన్నరు. హింసను ప్రేరేపించే చానళ్లపై చర్యలు తీసుకుంటమని ప్రసాదరావు హెచ్చరించిన్రు.  NBA గైడ్‌లైన్స్‌ పాటించని ఛానళ్లను పరిశీలిస్తున్నం. రికార్డెడ్‌ ఎవిడెన్స్‌ ఉన్న చానళ్లపై చర్యలపై సమీక్షిస్తున్నమని  ప్రసాదరావు  తెలిపిన్రు. ఇప్పుడు దినేష్ రెడ్డి ఉండుంటే బొత్స ఆస్తులు ఒక్కటి కూడా మిగలకపోవు.. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on ఎన్బీఏ గైడ్ లైన్స్ పాటించని మీడియాపై చర్యలు తీసుకుంటం

సీమాంధ్ర మీడియాపై మండిపడ్డ బొత్స

సమైక్యం ముసుగులో హింసను ప్రేరేపించేలా సీమాంధ్ర చానళ్లు వ్యవహరిస్తున్నయని మంత్రి, పీసీసీ చీఫ్ బొత్స మండిపడ్డరు. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మీడియా వార్తలు ప్రసారం చేయడం తగదని హితవు పలికిన్రు.

Posted in MEDIA MUCHATLU | Comments Off on సీమాంధ్ర మీడియాపై మండిపడ్డ బొత్స

సీమాంధ్ర జర్నలిస్టుల ఏడుపు

గురువారం తెలంగాణ నోట్ ను కేబినెట్ ఆమోదించంగనే సీమాంధ్ర జర్నలిస్టులది ఒక్కొక్కనిది ఒక్కో ఏడుపు.. సబ్ ఎడిటర్ నుంచి సీఈవోల దాకా ముఖం డ్యాష్ లెక్క పెట్టుకున్నరు.  ఇక స్క్రీన్ మీది కొచ్చిన  యాంకర్లకయితే కండ్లపొంటి నీళ్లొక్కటే తక్కువ.. ఏదో వాళ్ల  చానల్ మూతబడ్డట్టు.. బట్టలుకూడా లేక రోడ్డునపడ్డట్టు ముఖాలు పెట్టిన్రు.. ఔరా.. నాకు తెలవక … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on సీమాంధ్ర జర్నలిస్టుల ఏడుపు

కంబాలపల్లి సారథ్యంలో తమసోమా జ్యోతిర్గమయా..

హిందీలో అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయతే ప్రోగ్రాంను పోలిన మరో కార్యక్రమం తెలుగులో వస్తున్నది.  తమసోమా జ్యోతిర్గమయా  పేరుతో తెలుగులో   టీవీ5లో ఈ బుధవారం నుంచి ప్రసారం కాబోతున్నది.. తెలుగుచానళ్లలో ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. గతంలో జీ 24గంటలులో పొలిటికల్ బ్యూరో , వీ6లో ఇన్ పుట్ ఎడిటర్ గా … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on కంబాలపల్లి సారథ్యంలో తమసోమా జ్యోతిర్గమయా..

సకల జన భేరిపై వివక్ష చూపితేసీమాంధ్ర పత్రికల బహిష్కరణే

‘సీమాంధ్ర మీడియా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నది. సకలజనుల భేరి జరుగనుందన్న వార్తను తెలంగాణ ప్రాంతంలో ప్రముఖంగా ప్రచురించిన కొన్ని సీమాంధ్ర పత్రికలు ఒంగోలు, విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఈ వార్తను లేకుండా పక్షపాతం చూపారు. ఈ రోజు జరిగిన సభపైనా ఇదే వైఖరి అవలంబిస్తే ఎల్లుండి నుంచి తెలంగాణలో అలాంటి పత్రికలను బహిష్కరిస్తాం’ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on సకల జన భేరిపై వివక్ష చూపితేసీమాంధ్ర పత్రికల బహిష్కరణే

ఆంధ్రలో భూములు కొంటున్న సీమాంధ్ర నేతలు, చానళ్ల యజమానులు

సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ప్రజలను డైవర్ట్ చేసి.. సీమాంధ్ర నేతలు, టీవీ చానెళ్ల యజమానులు రాష్ట్ర విభజనను లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్నారు. సీమాంవూధలో రియల్ వ్యాపారానికి ఈ వర్గాలవారు భారీగా నిధులు తరలిస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ సాగిన వీరి రియల్ దందా గత రెండు నెలలుగా సీమాంధ్ర జిల్లాల చుట్టూ సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఆంధ్రలో భూములు కొంటున్న సీమాంధ్ర నేతలు, చానళ్ల యజమానులు

ఆంధ్రా పత్రికలు, టీవీలు చూసుడెందుకు? ఆగమవుడెందుకు?-కేసీఆర్

 ఆంధ్రజ్యోతి వాడు తెలంగాణకు వ్యతిరేక్ంగా వార్త రాసిండు. టీవీ9వాడు తెలంగాణ ఇవ్వరంటున్నరని ప్రజలు ఫోన్లు చేసి చెప్తున్నరని.. తెలంగాణ రాదని భయపడుతున్నరని కేసీఆర్ అన్నరు. సీమాంధ్ర డబ్బాలు చూసుడెందుకు? ఆంధ్ర పత్రికలు చదువుడెందుకు; ఆగమవుడెందుకు అని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సూచించారు.  సో తెలంగాణ ప్రజలెవరూ ఆంధ్రా డబ్బాలు చూసి ఆగం కాకండి

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఆంధ్రా పత్రికలు, టీవీలు చూసుడెందుకు? ఆగమవుడెందుకు?-కేసీఆర్

తెలంగాణ ఎమ్మెస్వోలకు చేవలేదా? చేతకాదా?

సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మొదలైన మొదటిరోజే అక్కడి ఎమ్మెస్వోలు వీ6 ప్రసారాలను పూర్తిగా నిలిపివేసిన్రు. సీమాంధ్రలో జరిగిన మొదటిరోజు ఆందోళనలను వీ6 ప్రసారం చేసినప్పటికీ తెలంగాణ వాళ్ల  చానల్ అన్న కారణంతో సీమాంధ్రలో పూర్తిగా బ్యాన్ చేసిన్ సీమాంధ్ర ఎమ్మెస్వోలకు ఉన్న దమ్ము తెలంగాణవారికి లేదా? సీమాంధ్ర చానళ్లు ఎప్పుడు లైవ్ ఇవ్వాలో కూడా అక్కడి … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | 1 Comment

ఏపీఎన్జీవోల సభను కవర్ చేసిన ఉద్యోగులకు నజరాన

నరనరాన సమైక్యవాదం జీర్ణించుకుపోయిన  ఎన్టీవీ చౌదరి ఏపీఎన్జీవోల సభను కవర్ చేసినవారికి, వార్తలు రాసినవారికి 5వేలు నజరానా ఇచ్చిన్రు.  

Posted in MEDIA MUCHATLU, Top Stories | 1 Comment

ఈనాడు, ఈటీవీ-2లో ఆంధ్రా ఉద్యోగులకు స్వేచ్ఛ

సీమాంధ్ర ఉద్యమవార్తలను విచ్చలవిడిగా రాయాలని ప్రసారం చేయాలని ఈనాడు, ఈటీవీ 2 ఉద్యోగులకు హుకుం జారీచేసింది. సీమాంధ్ర ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఉద్యోగులు సమైక్యాంధ్ర సభకు వెళ్లాలని తనమాటగా చెప్పమని రామోజీరావు మేనేజర్లకు చెప్పినట్టు సమాచారం. దీంతో ఈనాడు సంస్థల ఉద్యోగులంతా సభలో హల్ చల్ చేసిన్రు.. తెలంగాణ మీటింగ్ కు పోయిన జర్నలిస్టులకు షోకాజ్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | 1 Comment