Category Archives: MEDIA MUCHATLU

యాడ్స్ అరాచకం నుంచి బయటపడగలిగాం.. జై ట్రాయ్

సంధిసుదలు, రుద్రాక్షలు.. అష్టకల్ప మూలికలు,  యంత్రాలు, మంత్రాలను అర్ధగంటలకు, అర్ధగంటలు చూసే బాధ నుంచి మనకు విముక్తి లభించింది. రెండున్నర గంటల సినిమాను 4 గంటలు చూపెట్టే ఎంటర్ టైన్ మెంట్ చానళ్లకు డ్రాడ్ కాస్టింగ్ ఫెడరేషన్ చెక్ పెట్టింది.  ఇకపై గంటకు 12 నిమిషాలే వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయాలని పరిమితి విధించింది. ఈ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on యాడ్స్ అరాచకం నుంచి బయటపడగలిగాం.. జై ట్రాయ్

కేబుల్ ఆపరేటర్లను ఆపరేట్ చేయనున్న ట్రాయ్

చాలా రాష్ట్రాల్లోని కేబుల్ డిస్ట్రిబూషన్‌లో గుత్తాధిపత్యం నెలకొన్నట్టు ప్రసార నియంవూతణ సంస్థ ట్రాయ్ గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మల్టీ సిస్టం ఆపరేటర్ల (ఎంఎస్‌వోల)పై ఆంక్షల విధించాలని అది యోచిస్తోంది. ఏరియా, మార్కెట్ ప్రతిపాదికన ఆంక్షలు విధించడం ద్వారా ఎంఎస్‌వోల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే విషయంపై అభివూపాయాలు తెలియజేయాలని.. ఇందుకు సంబంధించిన స్టేక్‌హోల్డర్లను ట్రాయ్ కోరింది. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on కేబుల్ ఆపరేటర్లను ఆపరేట్ చేయనున్న ట్రాయ్

10 టీవీ క్రైమ్‌ సిబ్బందిపై దాడి దుర్మార్గం

ఓ తల్లి కూతుళ్ళ ఆత్మహత్య వార్తను కవర్ చేయడానికి వెళ్ళిన 10 టీవీ క్రైమ్ సిబ్బంది పై చిలుకల గూడ C.I అంజయ్య దాడికి పాల్పడి పాల్పడ్డరు. రోడ్డు పైన నిల్చొని లైవ్ కవరేజ్ చేస్తున్న రిపోర్టర్ దేవేందర్ తో వాగ్వాదానికి దిగిన C.I అనంతరం దాడికి తెగబడ్డాడు. జర్నలిస్టులపై పోలీసుల జులుంను పోరుతెలంగాణ ఖండిస్తున్నది.

Posted in MEDIA MUCHATLU | Comments Off on 10 టీవీ క్రైమ్‌ సిబ్బందిపై దాడి దుర్మార్గం

చెక్‌బౌన్స్‌తో అల్లాడుతున్న సీవీఆర్‌ ఉద్యోగులు

సీవీఆర్‌ ఉద్యోగులు జీతం లేక అల్లాడుతున్నరు. సీవీఆర్‌ యాజమాన్యం ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయినయి.. దాదాపు 70 మందికి పైగా చెక్కులు బౌన్స్‌ అయినయి. అకౌంట్‌ పే చేయకుండా చెక్కులిస్తూ.. సంస్థ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ లేకుండా చేస్తున్నరని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. రోజువారీగా వడ్డీచెల్లించే బ్యాంకుల్లో డబ్బులను పెడుతూ 5 తారీఖు చెల్లించాల్సిన జీతాలను … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on చెక్‌బౌన్స్‌తో అల్లాడుతున్న సీవీఆర్‌ ఉద్యోగులు

‘సెట్‌టాప్’కు.. రెండు వారాల గడువు- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుకు రెండు వారాల గడువు ఇస్తూ.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలుచేసే ప్రక్రియలోభాగంగానే గడువు ఇచ్చామని.. అప్పటివరకు కేబుల్ ఆపరేటర్లు, ఇతరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలులేదని హైకోర్టు సోమవారం ఆధికారులకు సూచించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on ‘సెట్‌టాప్’కు.. రెండు వారాల గడువు- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఆర్టిస్టులకున్న సోయి తెలంగాణవాదులకేది?

తమ పొట్టకొడుతున్న డబ్బింగ్ సీరియళ్లను నిషేధించాలని టీవీ ఆర్టిస్టులు పోరాటం చేస్తున్నరు. తమ న్యాయమైన కోరికను పట్టించుకోని టీవీ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ఎన్నిసార్లు బతిమిలాడినా వినకపోవడంతో నిన్న మా టీవీ కార్యాలయంపై దాడి చేసిన్రు. రగులుతున్న కడుపుమంటను దాడి రూపంలో వెళ్లగక్కిన్రు. ఉద్యమానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న సీమాంధ్ర మీడియా చానళ్లపై … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఆర్టిస్టులకున్న సోయి తెలంగాణవాదులకేది?

తెలంగాణ జర్నలిస్టులకు అవార్డులు

టీవీ9 సీనియర్‌ అవుట్ పుట్‌ ఎడిటర్‌.. కరీంనగర్‌కు చెందిన V.చంద్రమౌళి  ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్నరు. నమస్తే తెలంగాణ ఫీచర్స్‌ ఎడిటర్..  నిజామాబాద్ జిల్లాకు చెందిన సరస్వతి రమ శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ ఉగాది విశిష్ట పురస్కారం (బెస్ట్ జర్నలిస్ట్  అవార్డు)తో సత్కరించింది.  తెలంగాణ గాదలు, బాధలు, యోధుల సాహసాలపై ఆర్టికల్స్‌ రాసి … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on తెలంగాణ జర్నలిస్టులకు అవార్డులు

తులసిలో వచ్చే నెల నుంచి సీనియర్లకు రెడ్ కార్పెట్

తులసి చానల్‌లో వచ్చే నెల నుంచి సీనియర్లను తీసుకుంటరట. సీనియర్ల కోసం ఇప్పటికే చాలా మందిని సంప్రదించారట. చానల్‌ ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయట.. దీంతో కాపు చానళ్ల సంఖ్య (జీ 24 గంటలు (బొత్స), తులసి(రామచంద్రప్రభు)  రెండుకు చేరుతుంది.

Posted in MEDIA MUCHATLU | Comments Off on తులసిలో వచ్చే నెల నుంచి సీనియర్లకు రెడ్ కార్పెట్

గ్రాండ్ గా దక్కన్ టీవీ లోగో ఆవిష్కరణ

తెలంగాణ కోసం మరో  చానల్ ‘దక్కన్ టీవీ’ రాబోతున్నది…  ఫ్యాప్సీ హాల్ లో లో దక్కన్ టీవీ లోగో ఆవిష్కరణ గ్రాండ్ గా జరిగింది.  ప్రొ.కోదండరాం, దేవిప్రసాద్, కేకే, ఈటెల రాజేందర్, నాగం, యెన్నం,   ప్రొ.హరగోపాల్, ప్రొ.మాడబూషి శ్రీధర్,  శైలేష్ రెడ్డి, వేదకుమార్, గోపాల కిషన్, దేశపతి శ్రీనివాస్ లోగో ఆవిష్కరణకు హాజరయిన్రు.  ఈ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on గ్రాండ్ గా దక్కన్ టీవీ లోగో ఆవిష్కరణ

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై, ఈటీవీ-2, ఏబీఎన్ చానళ్లపై ప్రెస్ కౌన్సిల్ ఫైర్

తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఈటీవీ-2, ఏబీఎన్ చానళ్లపై ప్రెస్ కౌన్సిల్ మండిపడ్డది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నయని.. ఈ చానళ్లు యెల్లో జర్నలిజానికి మారుపేరని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ అన్నరు. ఆంధ్రజ్యోతి పత్రిక, చానల్ లైసెన్సును ఎందుకు క్యాన్సల్ చేయొద్దో చెప్పాలని నోటీసులు జారీ చేస్తమన్నరు.  అవును ప్రెస్ కౌన్సిల్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | 1 Comment

ఆర్ వీఎస్ చానల్ లో కర్చీఫ్ వేసుకొండి

ఆర్ వీఎస్ చానల్ లో ఉద్యోగులను తీసుకుంటున్నరు. రెండు నెలల్లో చానల్ ను తీసుకురావాలని యాజమాన్యం అనుకుంటున్నది. అవకాశం కోసం ఎదురుచూస్తున్నవారు వెంటనే కర్చీఫ్ వేసుకొండి. లేకపోతే ప్లేస్ దొరకదు. అసలే మీడియాలో పిచ్చి కాంపిటీషన్ ఉన్నది. ఖైరతాబాద్ లో ఈ చానల్ ఆఫీసు ఉన్నది. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఆర్ వీఎస్ చానల్ లో కర్చీఫ్ వేసుకొండి

వీ6లో పెరిగిన జీతాలు

వీ6లో జీతాలు పెరిగినయి. ఇంతకుముందు ట్రైనీలకు జీతాలు పెంచగా.. ఇప్పుడు సీనియర్స్‌కు జీతాలు పెంచిన్రు. తీన్మార్‌ ప్రొడ్యూసర్‌ నవీన్ కు 10వేల వరకు జీతాన్ని పెంచిన్రట. అచ్చమైన తెలంగాణ యాసలో స్క్రిప్ట్‌.. వాయిస్‌తో నవీన్‌ తీన్మార్‌ ను హిట్‌ చేసిండు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on వీ6లో పెరిగిన జీతాలు

థర్డ్ యానివర్సరీ జరుపుకున్న టీన్యూస్

ఏప్రిల్‌ 4: టీ న్యూస్.. తెలంగాణ గుండెచప్పుడు.. సీమాంధ్ర పాలకులు, చానళ్ల కుట్రలను నిత్యం ఛేదిస్తూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను వార్తల రూపంలో ప్రతిధ్వనింపజేస్తూ.. ఉద్యమానికి ఊపిరిలూదుతున్న టీన్యూస్ ఇవాళ థర్డ్ యానివర్సరీ జరుపుకుంటున్నది.  కార్యాచరణ ఉన్నప్పుడు తెలంగాణవాదులు ఉద్యమంలో  పాల్గొని తమ ఆకాంక్షను ఎలుగెత్తి చాటుతున్నరు . కార్యాచరణ ఉన్నా.. లేకున్నా.. మూడు సంవత్సరాలుగా … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on థర్డ్ యానివర్సరీ జరుపుకున్న టీన్యూస్

సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుపై హైకోర్టు స్టే

హైదరాబాద్, విశాఖల్లో సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటు అంశంపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. కేబుల్ ప్రసారల డిజిటలైజేషన్‌పై హైకోర్టు రెండు వారాల వెసులుబాటు కల్పించింది. రెండు వారల పాటు ప్రసారాలకు అటంకాలు కలిగించవద్దని హైకోర్టు సూచించింది.

Posted in MEDIA MUCHATLU | Comments Off on సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుపై హైకోర్టు స్టే

టీఎన్ఎన్ న్యూస్ చానల్ టెస్ట్ సిగ్నల్ షురూ…

తెలంగాణ న్యూస్ నెట్ వర్క్ ( టీఎన్ఎన్) చానల్ టెస్ట్ సిగ్నల్ షురువైంది. ఏ విషయాన్నైనా దాపరికం లేకుండా.. ముక్కుసూటిగా, ముఖం మీద గుద్దినట్టు  చెప్పే ఏకైక జర్నలిస్టు….   సీనియర్ మోస్ట్  తెలంగాణ జర్నలిస్టు  పాశం యాదగిరి సారథ్యంలో టీఎన్ఎన్ చానల్ వస్తున్నది. పాశం యాదగిరి టీఎన్ఎన్ చానల్ కు  చీఫ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నరు. ఆల్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on టీఎన్ఎన్ న్యూస్ చానల్ టెస్ట్ సిగ్నల్ షురూ…

ఇక న్యూస్ చానల్ గా RVS

ఆర్వీఎస్ చానల్ త్వరలో న్యూస్ చానల్ గా రాబోతున్నది.ఇన్నిరోజులు ఎంటర్ టైన్ మెంట్ చానల్ గా ఉన్న ఆర్వీఎస్ న24గంటలు న్యూస్ ఇచ్చేందుకు సిద్ధమైతున్నది.  రిక్రూట్ మెంట్స్ మొదలైనయి.  జర్నలిస్టు అన్నలు ట్రై చేసుకోవచ్చు.

Posted in MEDIA MUCHATLU | Comments Off on ఇక న్యూస్ చానల్ గా RVS

స్టూడియో ఎన్ చానల్ ఫర్ సేల్

కేవలం చానల్ అయితే 18 కోట్లు, బిల్డింగ్ తో పాటు కావాలంటే 40 కోట్లు..  స్టూడియో ఎన్ చానల్ ఫర్ సేల్.  ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు ఇవ్వని యాజమాన్యం చానల్ ను అమ్మకానికి పెట్టిందని ప్రచారం జరుగుతున్నది.

Posted in MEDIA MUCHATLU | Comments Off on స్టూడియో ఎన్ చానల్ ఫర్ సేల్

టాలీవుడ్ చానల్లో మొదలైన రిక్రూట్ మెంట్స్

అగ్రిగోల్డ్ సంస్థ టాలీవుడ్ చానల్ తీసుకొస్తున్నది.  పూర్తి ఎంటర్ టైన్ మెంట్ చానల్ గా టాలీవుడ్ చానల్ రాబోతున్నది. ఈ చానల్ రిక్రూట్ మెంట్స్ మొదలయినయి.

Posted in MEDIA MUCHATLU | Comments Off on టాలీవుడ్ చానల్లో మొదలైన రిక్రూట్ మెంట్స్

సంస్థ నష్టాల్లో ఉన్నా ఉద్యోగులకు జీతాలు పెంపు

ఆ టీవీకి ఇంతవరకు బ్రేక్ ఇవెన్ లేదు. ఇప్పటివరకూ నష్టాల్లోనే నడుస్తున్నది. అయినా విలువలకు ప్రాధాన్యతనిస్తది. సంస్థ నష్టాల్లో ఉందికదా అని అడ్డమైన యాడ్స్ తీసుకోరు. చైర్మన్, వైస్ చైర్మన్, సీఈవో అందరూ నిజాయితీపరులే. జనానికి చేటు చేస్తయన్న యాడ్స్ ను నిరాకరించిన చరిత్ర ఈ చానెల్ ది. ఏ చానల్ గురించి చెప్తున్ననో అర్థమైనట్టున్నది. … Continue reading

Posted in MEDIA MUCHATLU | 1 Comment

తెలంగాణ జర్నలిస్టులపై పోలీసుల జులుం

ఇందిరాపార్క్ దగ్గర పోలీసులు కావాలని మీడియా వారిని టార్గెట్ చేసిన్రు. సమరదీక్ష సభవైపు వస్తున్న నమస్తే తెలంగాణ జర్నలిస్టు కట్టా కవితపై దాడిచేసిన్రు. అరెస్ట్ చేయడానికి యత్నించిన్రు. అక్కడున్న జర్నలిస్టులు కవితకు మద్దతుగా ఆందోళన చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గిన్రు.కవితపై పోలీసుల దాడిని పోరుతెలంగాణ ఖండిస్తున్నది. సమైక్యాంధ్ర జర్నలిస్టులు ధర్నాలు చేస్తే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on తెలంగాణ జర్నలిస్టులపై పోలీసుల జులుం