Category Archives: MEDIA MUCHATLU

జర్నలిస్ట్‌ బండి రవీందర్‌ ఇకలేరు

ఉద్యమకారుడిని, జర్నలిస్ట్‌ యోధుడిని ఓరుగల్లు గడ్డ కోల్పోయింది. అస్వస్థతతో బండి రవీందర్ ఇవాళ( మే ఒకటిన) కన్నుమూశారు. వరంగల్‌ జిల్లా చిట్యాల మండలానికి చెందిన బండి రవీందర్ జర్నలిస్ట్‌గా టీవీ9, హెచ్‌ఎంటీవీలో  సేవలందించిన్రు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నరు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్‌ చురుకుగా పాల్గొన్నరు. రవీందరన్నకు పోరుతెలంగాణ నివాళులు…

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జర్నలిస్ట్‌ బండి రవీందర్‌ ఇకలేరు

పండగ చేసుకుంటున్న తెలుగు చానళ్లు, పత్రికలు

తెలుగు చానళ్లకు, పత్రికలకు పండగే పండగ.. ఒక్క చానల్ కూడా మామూల వార్తలు చూపెట్టడం లేదు. అన్ని పెయిడ్ న్యూసే.. ప్రచారమైనా.. పరామర్శలైనా.. ఇంటర్వ్యూలైనా, ఫేస్ టు ఫేస్ అయినా.. ఆఖరికి మార్నింగ్ న్యూస్ పేపర్స్ ఎనలైజ్ కు కూడా పేమెంట్ ఇచ్చినోళ్లనే పిలుస్తున్నరు. రేటింగ్ లో ఫస్టున్న చానల్ నుంచి రేటింగ్ లో లాస్ట్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on పండగ చేసుకుంటున్న తెలుగు చానళ్లు, పత్రికలు

కామయ్య సూత్రాలు

మనం ఆడేది టెన్నిస్‌ కాదు.. క్రికెట్.. ఈ ఆటలో సింగిల్స్ తీస్తే పని నడవదు. ఫోర్లు, సిక్సులు కొట్టాలి. అప్పుడే ఆట బావుంటుంది. జర్నలిజం రెండు రకాలు.. ఒకటి న్యూస్‌ మేకింగ్‌, రెండు న్యూస్ ట్రాకింగ్‌. న్యూస్‌ మేకింగ్‌ మనమే వార్తలను సృష్టించాలి. న్యూస్‌ ట్రాకింగ్ అంటే జరిగేవి చూయించాలి. ఇప్పటి వరకు మీరు సింగిల్సే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on కామయ్య సూత్రాలు

స్పోర్ట్స్ ఎనలిస్ట్ నరేందర్ కు పోరు తెలంగాణ నివాళి

స్పోర్ట్స్ ఎనలిస్ట్ నరేందర్ రేవల్లి(49) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం కన్నుమూశారు. నరేందర్ సొంతజిల్లా కరీంనగర్. నరేందర్ కు పోరు తెలంగాణ అంజలి ఘటిస్తుంది.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on స్పోర్ట్స్ ఎనలిస్ట్ నరేందర్ కు పోరు తెలంగాణ నివాళి

మార్చి 31 తర్వాత ఎక్స్ ప్రెస్ న్యూస్

ఎక్స్ ప్రెస్ న్యూస్ చానల్ ను  మార్చి 31 న తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నరు. కుదరకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో లాంచ్ చేసే అవకాశముంది. చానల్ పూర్తిస్థాయిలో వైవిధ్యభరితంగా ఉంటుందని ఎన్టీవీ మాజీ ఎంప్లాయిస్ ప్రస్తుత ఎక్స్ ప్రెస్ న్యూస్ ఎంప్లాయిస్ చెప్తున్నరు. నేమాని హెడ్ గా మురళి ఇన్ పుట్ గా వ్యవహరిస్తున్నరు. … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on మార్చి 31 తర్వాత ఎక్స్ ప్రెస్ న్యూస్

ఖాళీ అవుతున్న సీవీఆర్, 10టీవీ

యాజమాన్యం టార్చర్ భరించలేక జర్నలిస్టులు పారిపోతున్నరు. అవసరమైతే ఖాళీగానైనా ఉంటాం కానీ ఈ సంస్థల్లో పనిచేయమని చెప్తున్నరు.  సీవీఆర్ లో యాజమాన్యం వేధింపులు భరించలేక అవుట్ పుట్ మొదలుకొని సబ్ ఎడిటర్స్, గ్రాఫిక్స్ అన్ని డిపార్టుమెంట్ల వాళ్లు ఉద్యోగాలకు రిజైన్ చేస్తున్నరట. సీవీఆర్ యాజమాన్యం జర్నలిస్టులను డాక్టర్  కోసం వచ్చే రిప్రజెంటేటర్స్ లాగా ట్రీట్ చేస్తుంది. … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఖాళీ అవుతున్న సీవీఆర్, 10టీవీ

హెచ్ఎంటీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా విరాహత్ అలీ

హెచ్ఎంటీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా విరాహత్ అలీని నియమించిన్రు. మొన్నటి వరకు  చీఫ్ న్యూస్ కో ఆర్డినేటర్ గా పనిచేసిన  విరాహత్ ఇక నుంచి ఇన్ పుట్ ఎడిటర్ గా వ్యవహరించనున్నరు. ఆల్ ద బెస్ట్ అన్నా..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on హెచ్ఎంటీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా విరాహత్ అలీ

అవంతి శ్రీనివాస్ బంధువుల చేతిలోకి స్టూడియో ఎన్

స్టూడియో ఎన్ చేతులు మారినట్టు సమాచారం. అవంతి శ్రీనివాస్ బంధువులు, చింతకాయల అయ్యన్నపాత్రుడు బంధువులు స్టూడియోఎన్ ను కొన్నరట. చానల్ బాధ్యతలు శ్రీవాస్తవ చూస్తున్నరట. అటు తిరిగి ఇటు తిరిగి చానల్ మళ్లీ టీడీపీ చేతిలోకే పోయింది.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on అవంతి శ్రీనివాస్ బంధువుల చేతిలోకి స్టూడియో ఎన్

కాస్ట్ కటింగ్ అంటే..

హెచ్ఎంటీవీ హన్మంతరావు కాస్ట్ కటింగ్ కు కొత్త అర్థం చెప్తున్నరు. ఎక్కడైనా కాస్ట్ కట్టింగ్ అంటే ఓ 50 వేలు, 60 వేలు జీతం ఉన్నవారిని తీసివేయడం చూసినం. కానీ హెచ్ఎంటీవీలో అది పూర్తి రివర్స్.. కాస్ట్ కటింగ్ కింద తీసివేస్తమని చెపతూ 10 వేలు, 20 వేలు, 25 వేలు జీతం ఉన్నవారిని తొలగిస్తున్నరు. … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on కాస్ట్ కటింగ్ అంటే..

ప్రజాశక్తిలో విభజన

తెలుగు చానళ్లు చూసే ప్రేక్షకులకు ఒక శుభవార్త. రోజు  ఏదో ఒక చానల్ లో తెలకపల్లి రవిని చూసే బాధ ఇకమీదట తప్పనుంది. సీమాంధ్ర ప్రజాశక్తి ఎడిటర్ గా తెలకపల్లి రవిని నియమించారు.. కానీ హైదరాబాద్ విడిచివెళ్లేందుకు తెలకపల్లి అంగీకరించడంలేదని టాక్.  ఇప్పటికే 10టీవీలో ఓ పిచ్చి ప్రోమో వేయించుకుని జనాలను బెంబేలెత్తిస్తున్న తెలకపల్లికి హైదరాబాద్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ప్రజాశక్తిలో విభజన

టీయూడబ్ల్యూజే ఆవిర్భావం.. లోగో ఆవిష్కరించిన కేసీఆర్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ జర్నలిస్టుల జాతర సభ గ్రాండ్ గా జరిగింది.  టీజేఎఫ్ టీయూడబ్ల్యూజేగా మారింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు లోగోను టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆవిష్కరించారు. రాబోయే తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టులకు 2 బెడ్ రూంల ఇళ్లు కట్టిస్తమని చెప్పిన్రు. ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కేసీఆర్ కొనియాడిన్రు. అల్లం … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on టీయూడబ్ల్యూజే ఆవిర్భావం.. లోగో ఆవిష్కరించిన కేసీఆర్

ఆదివారం నాడు తెలంగాణ జర్నలిస్టుల జాతర

ఈ ఆదివారం పొద్దుగాల 10 గంటలకు టీజేఎఫ్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జర్నలిస్టుల జాతర సభ జరగనుంది. సభకు తెలంగాణ జర్నలిస్టులు భారీగా తరలిరావాలని టీజేఎఫ్ నేతలు పిలుపునిచ్చిన్రు. ఈ సభలోనే టీయూడబ్ల్యూజేపై ప్రకటన చేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.  

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఆదివారం నాడు తెలంగాణ జర్నలిస్టుల జాతర

చానళ్లను విడగొట్టే పనిలో సీమాంధ్ర మీడియా

ఇన్నాళ్లు తెలంగాణ ఉసురుపోసుకున్న సీమాంధ్ర మీడియా ఇప్పుడు చానళ్లను విడగొట్టే పనిలో పడ్డరు. ఈటీవీ గ్రూప్ ఈటీవీ-3ని స్టార్ట్ చేయనుంది. మిగతా చానళ్లు కూడా విడగొట్టేపనిలో పడ్డాయి. తెలంగాణ చానల్ గా విడగొట్టినప్పుడు తెలంగాణ వారినే బాసులుగా నియమించాలి. ఆంధ్రోళ్లనే కీ పొజిషన్ లో పెడితే చానళ్లు పెట్టి లాభం లేదు. ఇప్పటికే ఆంధ్రోళ్లు కీ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on చానళ్లను విడగొట్టే పనిలో సీమాంధ్ర మీడియా

ఊపందుకున్న వలసలు

యాజమాన్యం.. బాసుల టార్చర్ తట్టుకోలేక కొందరు.. సాలరీ హైక్ తో కొందరు జర్నలిస్టులు ఇతర చానళ్లకు వలస పోతున్నరు. మరికొందరు అవకాశాల కోసం ప్రదక్షిణ్యలు చేస్తున్నరు. 10 టీవీలో యాజమాన్యం టార్చర్ తట్టుకోలేక కొందరు జర్నలిస్టులు పారిపోగా.. మరికొందరు సాలరీ హైక్ తో ఇతర చానల్ కు పోయారు. ఇంకొందరు గతంలో పనిచేసిన చానళ్ల తలుపులు … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఊపందుకున్న వలసలు

ఏక్ సే దస్ తక్..

తెలుగు చానళ్లు 1 నుంచి 10 వరకు నిండిపోయినయి. టీవీ-1, ఈటీవీ-2, ఈటీవీ-3, 4టీవీ, చానల్ 4, టీవీ-5, వీ-6, 6టీవీ, టీవీ-7, టీవీ-8, టీవీ-9, 10టీవీ.. 1 నుంచి పది మధ్యలో ఇక సందులేదు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఏక్ సే దస్ తక్..

మరో కొత్త తెలుగు చానల్

టీవీ8 పేరుతో కొత్త చానల్ వస్తున్నది. సీనియర్ జర్నలిస్ట్ కంభాలపల్లి కృష్ణ   ఈ  ఈ చానల్ లో చేరినట్టు సమాచారం.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on మరో కొత్త తెలుగు చానల్

అంతా థూ థూ అంటే ఆంధ్రా మీడియా వహ్వా అంటుంది

కుక్కతోక సక్కగైతదా?.. సీమాంధ్ర మీడియా తీరు మారుతదా? ఓవైపు దేశంలో, మరోవైపు విదేశాల్లో అంతా థూ థూ అంటున్నా సరే. సీమాంధ్ర మీడియాకు మాత్రం గురువారం నాటి పార్లమెంటు సంఘటనలు తప్పుగా అనిపించలేదు. కనిపించలేదు. గురువారం దేశంలోని అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్నీ,ఎన్ని టీవీలు ఉన్నాయో అన్నీ పార్లమెంటులో సీమాంధ్ర … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on అంతా థూ థూ అంటే ఆంధ్రా మీడియా వహ్వా అంటుంది

లగడపాటి లాగు ఊడుకొట్టినంత పనిచేసిన నేషనల్ మీడియా

-మీరు ఉగ్రవాదులు!.. పార్లమెంటులో మీ చర్యలకు దేశం తలదించుకోవాల్సివచ్చింది -రాజగోపాల్! రౌడీలా ప్రవర్తించావు -పార్లమెంటులో కబడ్డీ ఆడతానంటావా? : టైమ్స్ నౌ-అర్నాబ్ -ఇంకా నయం, ఏకే 47లు వాడలేదు: సీఎన్‌ఎన్ ఐబీఎన్-రాజ్‌దీప్ -ఆడోళ్ల స్ప్రేతో నీకేం పని?: ఎన్‌డీటీవీ- బర్కాదత్ ‘పార్లమెంటుకు కత్తులు, ఏకే- 47 రైఫిళ్లు కూడా తెస్తారా?.. మైకులు విరగ్గొడితే అవార్డులొస్తాయా?..మీలాంటి వాళ్లను … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on లగడపాటి లాగు ఊడుకొట్టినంత పనిచేసిన నేషనల్ మీడియా

బీజేపీలో చేరిన శైలేష్ రెడ్డి

డైనమిక్ జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్న శైలేష్ రెడ్డి ఆదివారం   కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తెలుగు జర్నలిజంలో.. తెలంగాణ ఉద్యమం దిక్కులేక  తల్లడిల్లుతున్న తరుణంలో తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి జీ 24 గంటలు చానల్ తెలంగాణ కోసం నడిపిన్రు శైలేష్ రెడ్డి.. తెలంగాణ చానళ్లేవీ లేనప్పుడు  ఒక్క శైలేష్ రెడ్డి మాత్రమే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on బీజేపీలో చేరిన శైలేష్ రెడ్డి

హెచ్ఎంటీవీ ఎండీ, సీఈవో పదవులకు రామచంద్రమూర్తి రిజైన్

రామచంద్రమూర్తి గారు హెచ్ఎంటీవీ ఎండీ, సీఈవో పదవులకు రిజైన్ చేసిన్రు.  ఇక మీదట చీఫ్ ఎడిటర్ గా మాత్రమే కొనసాగనున్నరు. అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు హన్మంతరావు (గుంటూరు) చూసుకుంటరని మూర్తిగారు ప్రకటించిన్రు.. చానల్ అడ్మినిస్ట్రేషన్ సగం గుంటూరు నుంచి పూర్తి గుంటూరు మారిందని తెలంగాణ జర్నలిస్టులు చర్చించుకుంటున్నరు. తెలంగాణవారికి అప్పగిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on హెచ్ఎంటీవీ ఎండీ, సీఈవో పదవులకు రామచంద్రమూర్తి రిజైన్