Category Archives: MEDIA MUCHATLU

లాంచింగ్ కు రెడీ అవుతున్న భారత్ టుడే చానల్

      తెలుగు జర్నలిజంలోకి మరో న్యూస్ చానల్ రాబోతుంది. మూస ధోరణిలో సాగుతున్న తెలుగు చానళ్లకు భిన్నంగా భారత్ టుడే చానల్ ఉండబోతుంది. భారతీయతకు ఈ చానల్ పెద్దపీట వేయనుంది. స్వామి పరిపూర్ణానంద శిష్యులైన ఎన్నారైల ఆధ్వర్యంలో చానల్ వస్తున్నట్టు సమాచారం. గతంలో టీవీ5లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేసిన విజయ్ కుమార్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

సంఘాలు సాయం చేస్తున్నయని అన్నరు కదా.. పక్కవారి కోసం ఎవరూ పోరాడరనడానికి మరో సాక్ష్యం

ఏ.. డెస్క్ జర్నలిస్టులకు ఐడీ కార్డులు సరిపోతాయి.. హెల్త్ కార్డులు ఇస్తున్నాంగా అక్రిడేషన్లు ఎందుకు..  అని కమిటీలో చర్చించినట్టు తెలుస్తున్నది.   ఈ కమిటీలో మన అభిమాన సంఘాల నేతలు లేరా.. వాళ్లెందుకు వ్యతిరేకించలేదు. పక్కవారి  కోసం ఎవరూ పోరాడరు. మీరు గుడ్డిగా నమ్మినవాళ్లు సాయం చేయరు. అక్రిడేషన్ల కోసం ఐక్యంగా కొట్లాడుదామంటే కొందరు మూర్ఖంగా వాదిస్తున్నరు. … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

ఇప్పుడు రిస్క్ చేయకుంటే మనకు మిగిలేది రస్కే !

ఆ సారుకు మన కష్టాలు తెలుసు.. ఈ సారు సంఘం కోసమైనా మనకోసం మాట్లాడుతడు. ఆ అన్న పాజిటివ్ గానే మాట్లాడిండు. మనకు అక్రిడేషన్లు వస్తయని తడిగుడ్డ వేసుకుంటే మనకేం రావు. ఏ సంఘాన్ని నమ్ముకున్నా మనకు న్యాయం జరగదు. మొన్న సీఎం ముందు డెస్క్ వాళ్లకెందుకు అక్రిడేషన్లని మన ప్రియతమ నేతలే అన్నరట. ఇంకావాళ్లను … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్‌ ఇవ్వాలి

తెలంగాణ జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీకి పోరుతెలంగాణ విన్నపం.. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఫీల్డ్‌ జర్నలిస్టుల ప్రియారిటీ తగ్గి డెస్క్‌ జర్నలిజం ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం నడుస్తున్నదంతా డెస్క్‌ ఓరియెంటెడ్‌ జర్నలిజమే. వార్త ప్రచురుణలో అయినా.. ప్రసారంలో అయినా డెస్క్‌దే ముఖ్యపాత్ర.  అలాంటి డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడేషన్‌ విషయంలో మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది.  జర్నలిజం అంటే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

తెలంగాణ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు

తెలంగాణ  జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం ప్రెస్ అకాడమీలో జర్నలిస్టులతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ అక్రిడేషన్ మార్గదర్శకాల కోసం ప్రెస్ అకాడమీ 9 మందితో … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

జర్నలిస్టుల అక్రిడేషన్లపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత

 జర్నలిస్టులకు అక్రిడేషన్లు కల్పించే అంశంపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత వస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ప్రభుత్వ సలహాదారు రమణాచారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు, అక్రిడేషన్‌కార్డుల మార్గదర్శకాలపై చర్చించారు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

థాంక్యూ రామన్న!

ఇటీవల మరణించిన ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ కుటుంబానికి మంత్రి కేటీఆర్ రూ.2లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. హరిప్రసాద్ ఇద్దరు కుమారులను చదివించే భాధ్యత తమదేనన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చిన్రు.  హరిప్రసాద్ కుటుంబాన్ని ఆదుకున్నందుకు థాంక్స్ రామన్న.  

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

ఏబీఎన్ లో పెరిగిన జీతాలు

ఏబీఎన్ చానల్ లో జీతాలు పెరిగినయ్. రూ.వెయ్యి, మూడు వేలు, ఐదు వేల వరకు పెంచినట్టు సమాచారం. కొన్ని నెలలుగా  రెవెన్యూ లేనందున జీతాలు సమయానికి వస్తాయో రావో.. ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్న భయంలో ఉన్న ఉద్యోగులకు ఈ హైక్ తో వాళ్ల ఎండీ ఎంతో హైట్ లో కనిపిస్తున్నడట. ఏబీఎన్ లో ఆర్.కె … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

నచ్చినవ్ రవిప్రకాష్

తమ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ చనిపోతే  కనీసం స్క్రోలింగ్ పెట్టని చానళ్లు కోకొల్లలు.  అలాంటిది టీవీ9లో పనిచేస్తూ అకాలమరణం పొందిన న్యూస్ రీడర్ బద్రికి   ఆ సంస్థ ఘన నివాళి అర్పించింది.  వార్తలు చదివి సేవలందించిన బద్రికి రెండు రోజులు నిరంతరాయంగా ఆయన మరణవార్తను ప్రసారం చేసి టీవీ9 రుణం తీర్చుకుంది. ఇవాళ టీవీ9లో పనిచేసే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

రోడ్డు ప్రమాదంలో టీవీ 9 సీనియర్‌ న్యూస్‌ రీడర్‌ బద్రి మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో టీవీ9 సీనియర్‌ న్యూస్‌ రీడర్‌ బద్రిమృతిచెందారు. ప్రమాదంలో ఆయన భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. మృధుస్వభావి బద్రికి పోరుతెలంగాణ నివాళులు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

టీయూడబ్ల్యూజే (H 143)కు దొంతు రమేష్ రాజీనామా

టీయూడబ్ల్యూజే (H 143)సంఘానికి టీవీ9 జర్నలిస్ట్ దొంతు రమేష్ రాజీనామా చేసిన్రు. వరంగల్ జర్నలిస్టులు ఈ సంఘంలో చేరడంలో కీలకపాత్ర పోషించినవారిలో ఒకరైన రమేష్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసిన్రు.                               … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

స్ట్రయిక్ ఫర్ లైఫ్… జీతాలివ్వనందుకు నిరసనగా చానల్ స్టూడియోలోనే బోర్డింగ్, లాడ్జింగ్

మన దగ్గర జీతాలివ్వకపోతే ఏం చేస్తరు..  యాజమాన్యాన్ని బతిలాడుతరు. వాళ్లు స్పందించకపోతే వేరే చానల్ లోకి జంప్ అయితరు. జీతాలు కట్ చేసినా.. కోతలు విధించినా అన్నీ మూస్కుంటరు. అదే యాజమాన్యానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం గొంతు చించుకుంటరు. అరెస్ట్ అయితరు. జైళ్లకు పోతరు. అదే వాళ్లకు సమస్యలొస్తే మాత్రం సైలెంట్ అయిపోతరు. జర్నలిస్టు … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

ఐన్యూస్ లో ఒక నెల జీతాలిచ్చారు

ఐన్యూస్ లో ఒక నెల జీతాలిచ్చారు. ఉద్యోగులు కొంత హ్యాపీ. మిగతా నెల జీతం కూడా ఇంకింత హ్యాపీగా ఫీలవుతరు. 99 చానల్ వాళ్లు కూడా జీతాలిచ్చి పుణ్యం కట్టుకోండి. 6 టీవీ కూడా జిల్లా రిపోర్టర్లకు వేతనాలు చెల్లించి.. వాళ్లను ఆదుకోండి.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

సిక్స్ టీవీలో సిక్స్ మంత్స్ నుంచి జీతాల్లేవ్..

సిక్స్ టీవీలో  జిల్లా రిపోర్టర్లకు ఆరు నెలలనుంచి జీతాలిస్తలేరట. పైగా ఎంఎస్వోలకు చెల్లించాల్సిన డబ్బు కూడా రిపోర్టర్లనే ఇవ్వమంటున్నారట. పాపం ఆరు నెలల నుంచి జీతాలు లేకుండా రిపోర్టర్లు చాలా అవస్థలు పడుతున్నరట

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

99 చానల్ లో 99% ఇంచార్జులు ఖాళీ

99 చానల్ లో 99 శాతం ఇంచార్జులు ఖాళీ అయ్యారు. ఇన్ పుట్  ఎడిటర్ శ్రీధర్ రావు, అవుట్ పుట్ ఎడిటర్ కిరణ్, డెస్క్ ఇంచార్జి పూర్ణచందర్ చానల్ ను వీడి వేరేచోట జాయిన్ అయిన్రు.  సీఈవో గా కపిల్ ను తప్పించి సీటీవోగా బాధ్యతలు అప్పగించిన్రు. సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను ఇప్పుడు సీఈవోగా … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

ఐన్యూస్, 99 చానళ్ల లో రెండు నెలల నుంచి జీతాలివ్వడంలేదు

ఐన్యూస్, 99 చానళ్ల లో రెండు నెలల నుంచి జీతాలివ్వడంలేదట. జర్నలిస్టులు రెంట్లు కట్టలేక, ఇంటి ఖర్చులు వెళ్లక ఇబ్బందులు పడుతున్నరు..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

జర్నలస్టులకు ఇళ్ల స్థలాలెవ్వి.. హెల్త్ కార్డులెవ్వి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలెవ్వి.. హెల్త్ కార్డులెవ్వి.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు,  హెల్త్ కార్డులపై ఇంకా క్లారిటీ రాలేదు.  చాలా మంది జర్నలిస్టులు ఇన్సూరెన్స్ లేక అవస్థలు పడ్డరు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

చానెల్ చాల్ అయింది కదా.. ఇక ఫుల్ సాలరీ వేయండి

తెలంగాణలో టీవీ9 చానల్ ప్రసారాలు తిరిగి ప్రారంభమయ్యాయి. టీవీ9 చానల్ నిలిపివేసిన్రని యాజమాన్యం సంస్థలోని ఉద్యోగులకు సాలరీ కట్ చేసింది.  చానల్ కష్టాల్లో  ఉన్నప్పుడు ఎంప్లాయిస్ అండగా ఉన్నరు. ఇప్పుడు చానల్ వస్తుంది కాబట్టి కట్ చేసిన సాలరీ వేసి వాళ్లను అప్పుల్లోంచి గట్టెక్కించండి.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

జర్నలిస్టు భవనానికి రూ.10 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు

బడ్జెట్ లో జర్నలిస్టు  భవన్ కోసం రూ.10 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు, మంత్రులకు పోరుతెలంగాణ తరపున ధన్యవాదాలు..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

వార్తాలోకం పత్రికను ఆవిష్కరించిన ప్రెస్ అకాడమీ చైర్మన్

సీనియర్ జర్నలిస్ట్  సారథ్యంలో వస్తున్న వార్తాలోకం పత్రికను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరించిన్రు. ప్రాంతీయ ప‌త్రిక‌లు స్థానిక స‌మ‌స్య‌ల‌నే ప్ర‌ధాన వార్త‌లుగా ప్ర‌చురిస్తే ప్ర‌జాద‌ర‌ణ పొందుతాయని ఆయన అన్నరు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment