ఆమ్ ఆద్మీ అదుర్స్

-ఢిల్లీ ఎన్నికల్లో అపూర్వ విజయగీతిక
-షీలాదీక్షిత్‌పై 25,864 మెజారిటీతో కేజ్రీవాల్ గెలుపు
-హ్యాట్రిక్ ముఖ్యమంవూతికి ఘోర పరాభవం
-31 స్థానాలతో ముందంజలో బీజేపీ
-8 సీట్లతో మూడోస్థానానికి కాంగ్రెస్
-హంగ్ అసెంబ్లీ.. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అదుర్స్ అనిపించింది. ఎన్నికల బరిలోకి దిగిన తొలిసారే ఆ పార్టీ 28 స్థానాలు సాధించి అబ్బురపరిచింది. ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ సర్కారుకు చరమగీతం పాడు తూ తన రాజకీయ ఆగమనాన్ని ఘనంగా చాటింది. మరోవైపు వరుసగా మూడుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పిన అధికార కాంగ్రెస్ పార్టీ దారుణమై న చావుదెబ్బ తిన్నది. మూడుసార్లు ముఖ్యమంవూతిగా కొనసాగిన షీలాదీక్షిత్‌కి కూడా దారుణ పరాభవం తప్పలేదు. ఇక ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. మెజారిటీకి దూరంగానే ఉండిపోయింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 31, ఆమ్ ఆద్మీ 28, కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలను సాధించాయి. ఇక బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీ దళ్, జేడీయూ చేరో స్థానాన్ని గెలుపొందాయి. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాయి. మిత్రపక్షం అకాలీ దళ్‌తో కలుపుకొని బీజేపీ 32 స్థానాలు గెలుపొందినప్పటికీ.. మ్యాజిక్ మార్క్ (36)కు నాలుగు స్థానాల దూరంలో నిలిచిపోవడంతో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది.
krejival
ఢిల్లీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. కాంగ్రెస్ దారుణంగా వెనుకబడిపోవడంతో సీఎం షీలా దీక్షిత్ ఓటమిని అంగీకరిస్తూ తన రాజీనామా లేఖను లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు పంపారు. ‘మేం ఓటమిని అంగీకరిస్తున్నాం. తప్పు ఎక్కడ జరిగిందో మేం విశ్లేషిస్తాం. ఢిల్లీ ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. గత 15 ఏళ్ల మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు’ అని ఆమె తెలిపారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ షీలా దీక్షిత్‌ను 25,864 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించి పెను సంచలనం సృష్టించారు. ఇక కృష్ణనగర్ నియోజకవర్గంలో 43,150 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ తమకు అత్యధిక సీట్లు కట్టబెట్టినందుకు ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలకు తాము సేవ చేస్తామనే విశ్వాసం వ్యక్తంచేసిన ఆయన.. ప్రభుత్వ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వలేదు. మంచి ప్రదర్శన కనబర్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు, సీఎంగా పనిచేసిన సీఎం షీలా దీక్షిత్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు పలువురు మంత్రులు ఆమ్ ఆద్మీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు.

మైనారిటీ సర్కారు ఏర్పాటుకు బీజేపీ యత్నం!
ఢిల్లీలో మెజారిటీకి 4 స్థానాల దూరంలో నిలిచిన బీజేపీ ఎలాగైనా సర్కారు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మైనారిటీ సర్కారును ఏర్పాటుచేసి.. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలనే ఆలోచనతో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన రణ్‌వీర్ షోకీన్ ప్రభుత్వ ఏర్పాటులో తమకు మద్దతునిస్తారని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా బీజేపీ సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాము ఏ పార్టీకి మద్దతునివ్వబోమని, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ (8 స్థానాలు సాధించింది) మద్దతు తీసుకోబోమని ఏఏపీ అధినేత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా కొనసాగుతామని ఆయన తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలువబోమని బీజేపీ నేత హర్షవర్ధన్ స్పష్టం చేశారు.monga
పరాజితులు
-కిరణ్ వాలియా (విద్యాశాఖ మంత్రి) మాల్వియానగర్ నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. ఏఏపీ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతి ఇక్కడ గెలుపొందారు.
-ఏకే వాలియా (కుటుంబ సంక్షేమ మంత్రి) లక్ష్మీనగర్ నియోజకవర్గంలో ఏఏపీ అభ్యర్థి వినోద్ బిన్నీ చేతిలో పరాజయం పాలయ్యారు.
ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోటీ నెలకొని ఉండే ఢిల్లీలో తొమ్మిది నెలల కిందట రాజకీయం అరంక్షిగేటం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ వస్తూనే సంచలనం సృష్టించింది. అవినీతి, ధరల పెరుగుదల, మహిళల భద్రత వంటి అంశాల నెలకొన్న ప్రజావ్యతిరేకత కారణంగా షీలా దీక్షిత్ సర్కారు దారుణమైన పరాభవాన్ని మూటకట్టుకుందని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు నిజాయితీగా మారుపేరుగా ఉన్న హర్షవర్ధన్‌ను సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపిన బీజేపీ చెప్పుకోదగిన స్థాయిలో స్థానాలు గెలుపొంది భేష్ అనిపించుకుంది. పార్టీ నేతలు నరేంవూదమోడీ, ఎల్‌కే అద్వానీ వంటి దిగ్గజాలు చేసిన ప్రచారం బీజేపీకి మేలు చేసినట్టు భావిస్తున్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.