7 నుంచి తెలంగాణ ప్రక్రియ

-పార్లమెంటు సమావేశాలు ముగియగానే వేగవంతం
-కేబినెట్ ముందుకు రాష్ట్ర ఏర్పాటు నోట్
-శాసనసభ ఆమోదానికి తీర్మానం పంపే అవకాశం
పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకోనుంది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల ఆరో తేదీన ముగుస్తుండటంతో ఇక తెలంగాణ అంశంపై దృష్టి పెట్టాలని కేంద్రం భావిస్తున్నదని అధికారవర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నోట్‌ను కేంద్ర హోంశాఖ త్వరలోనే కేబినెట్ ముందు పెట్టనుందని ఆ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యల అధ్యయనానికి కేంద్ర కేబినెట్ ఒక మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటుచేసే అవకాశముందని తెలిపాయి. ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని శాసనసభ ఆమోదానికి పంపవచ్చని అధికారవర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణపై కేంద్రవూపభుత్వం కమిటీని వేయనుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఇటీవల ప్రకటన చేశారు.

దీంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసేందుకు యూపీఏ నిర్ణయించిందని స్పష్టమైన సంకేతాలిచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుందని కేంద్రవూపభుత్వవర్గాలు తెలిపాయి. తెలంగాణ పదిజిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రస్తుతం భావిస్తున్నప్పటికీ ఇతర ప్రాంతాలను కూడా నూతన రాష్ట్రంలో కలపాలని వస్తున్న డిమాండ్లను పరిశీలించాల్సింది మంత్రుల బృందమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. రాష్ట్ర సమైక్యతను కోరుతూ సీమాంవూధకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవటంతో లోక్‌సభలో 12మంది ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత తలెత్తిన ఆందోళనలను పరిశీలించేందుకు ఇప్పటికే ఏఐసీసీ ఆంటోనీ కమిటీని వేసింది.

వీరప్పమొయిలీ, అహ్మద్‌ప ఇతర సభ్యులుగాగల ఆ కమిటీ రాష్ట్రంలోని ఇరువూపాంత నేతల వాదనలను పరిశీలిస్తున్నది. రాజ్యాంగం ప్రకారం నిర్ధేశిత సమయంలోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌ను 10 సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) జూలై 30న తీర్మానంలో కేంద్రవూపభుత్వాన్ని కోరటంతో కేంద్రం ఆ దిశగా చర్యలను వేగవంతం చేయనుందని తెలుస్తోంది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.