69 మందితో టీఆర్‌ఎస్ తొలి జాబితా

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీఆర్‌ఎస్ శుక్రవారం ప్రకటించింది. పలువురు సిట్టింగ్‌లతో సహా మొత్తం 69 మందికి తొలి జాబితాలో స్థానం కల్పించారు. అనంతరం అభ్యర్థులతో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ప్రమాణం చేయించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం లభించిన నేను పార్టీ క్రమశిక్షణకు, నాయకత్వ ఆదేశాలకు బద్ధుడనై నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అవినీతికి పాల్పడబోనని, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో, అంకితభావంతో అహర్నిశలు కృషి చేస్తానని, తెలంగాణ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ఉన్న ఈ పత్రాన్ని కేసీఆర్ స్వయంగా చదువుతూ మిగిలినవారితో ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు అభ్యర్థులు వెళ్లి కేసీఆర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ కూడా అంతే ఆప్యాయంగా స్పందించారు.

లిస్టు ప్రకటించడానికి ముందు కేసీఆర్ సమయం విషయంలో ఎంతో జాగ్రత్త పాటించారు. 10.54నిమిషాలకు మీడియా హాల్లోకి వచ్చిన కేసీఆర్ నిమిషంన్నర పాటు కూర్చున్నారు. ఆ తరువాత సమయం ఎంత అని పక్కనున్న వారిని అడిగారు. నాయిని ముందు ఉన్న ఆయన ఫోన్‌ను పట్టుకుని సమయం చూసుకున్నారు. వెంటనే కడియం స్పందిస్తూ మరొక్క నిమిషం ఉందని చెప్పారు. అది గడిచిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడటం ప్రారంభించారు. ఈ ముహూర్తం బ్రహ్మముహూర్తం అని పండితులు పెట్టారని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ అదృష్ట సంఖ్య అయిన ఆరు ప్రకారం 69 మంది అభ్యర్థులనే ప్రకటించారని సమాచారం. 6+9=15, 1+5=6 కనుకే 69మంది అభ్యర్థులను ప్రకటించారు.

ఇదీ అభ్యర్థుల జాబితా..: మెదక్ – గజ్వేల్: కే చంద్రశేఖర్‌రావు, సిద్దిపేట: హరీష్‌రావు, అందోల్: బాబూమోహన్, మెదక్: పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి: చింతా ప్రభాకర్, పటాన్‌చెరు: జీ మహిపాల్‌రెడ్డి.

కరీంనగర్ – హుజూరాబాద్: ఈటెల రాజేందర్, ధర్మపురి: కొప్పుల ఈశ్వర్, వేములవాడ: సీహెచ్ రమేష్‌బాబు, కరీంనగర్: గంగుల కమలాకర్, కోరుట్ల: విద్యాసాగర్‌రావు, రామగుండం: సోమారపు సత్యనారాయణ, సిరిసిల్ల: కేటీ రామారావు, మానకొండూరు: రసమయి బాలకిషన్, హుస్నాబాద్: వీ సతీష్‌కుమార్, పెద్దపల్లి: దాసరి మనోహర్‌రెడ్డి, మంథని: పుట్టా మధు, జగిత్యాల: సంజయ్ కుమార్.

నిజామాబాద్ – బాన్సువాడ: పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి: ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్: హన్మంత్‌షిండే, కామారెడ్డి: గంప గోవర్ధన్, బోధన్: షకీల్ అహ్మద్, ఆర్మూర్: ఏ జీవన్‌రెడ్డి, బాల్కొండ: ప్రశాంత్‌రెడ్డి.

ఆదిలాబాద్ – ఆదిలాబాద్: జోగు రామన్న, బోథ్: జీ నగేష్, ముథోల్: వేణుగోపాలచారి, చెన్నూరు: నల్లాల ఓదెలు, సిర్పూర్: కావేటి సమ్మయ్య, నిర్మల్: శ్రీహరిరావు, బెల్లంపల్లి: చెన్నయ్య, ఖానాపూర్: రేఖానాయక్, ఆసిఫాబాద్: కోవా లక్ష్మీ.

రంగారెడ్డి – పరిగి: హరీశ్వర్‌రెడ్డి, తాండూరు: మహేందర్‌రెడ్డి, చేవెళ్ల: కేఎస్ రత్నం, వికారాబాద్: బీ సంజీవరావు, మేడ్చల్: ఎం సుధీర్‌రెడ్డి.

మహబూబ్‌నగర్ – కొల్లాపూర్: జూపల్లి కష్ణారావు, మక్తల్: వై ఎల్లారెడ్డి, కల్వకుర్తి: జైపాల్‌యాదవ్, మహబూబ్‌నగర్: వీ శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి: నిరంజన్‌రెడ్డి, జడ్చర్ల: సీ లకా్ష్మరెడ్డి, అచ్చంపేట: జీ బాలరాజు, దేవరకద్ర: వెంకటేశ్వర్‌రెడ్డి, అలంపూర్: ఎం శ్రీనాథ్, నాగర్ కర్నూల్: మర్రి జనార్దన్‌రెడ్డి, గద్వాల్: బీ కష్ణమోహన్‌రెడ్డి.

వరంగల్- డోర్నకల్: సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ: దాస్యం వినయ్‌భాస్కర్, స్టేషన్ ఘన్‌పూర్: టీ రాజయ్య, భూపాలపల్లి: మధుసూదనాచారి, నర్సంపేట: పెద్ది సుదర్శన్‌రెడ్డి, ములుగు: అజ్మీరా చందూలాల్, వరంగల్ తూర్పు: కొండా సురేఖ, పాలకుర్తి: ఎన్ సుధాకర్‌రావు, జనగాం: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వర్ధన్నపేట్: ఆరూర్ రమేష్.

హైదరాబాద్- సికింద్రాబాద్: పద్మారావు గౌడ్.

నల్లగొండ – సూర్యాపేట: జీ జగదీష్‌రెడ్డి, ఆలేరు: గొంగిడి సునీత, నకిరేకల్: వీరేశం, దేవరకొండ: లాలు నాయక్, మిర్యాలగూడ: అమరేందర్‌రెడ్డి, హుజూర్‌నగర్: కాసోజు శంకరమ్మ. ఖమ్మం- కొత్తగూడెం: జలగం వెంకట్‌రావు, సత్తుపల్లి: పిడమర్తి రవి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.