6న తెలంగాణ యుద్ధభేరి

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ఈ నెల ఆరోతేదీన హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో తెలంగాణ యుద్ధభేరిసభను నిర్వహించన్నుట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సమైక్యాంవూధవూపదేశ్ కోసం సీమాంవూధలో సాగుతున్న సమ్మె నుంచి ప్రభుత్వ పాఠశాలలు, ఆర్టీసీని మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమ, మంగళ, బుధవారాల్లో సీమాంధ్రలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మెనుంచి స్కూళ్లు, ఆర్టీసీని మినహాయించకుంటే ఈ నెల 7న ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో సమైక్యసభ నిర్వహించుకునేందుకు అనుమతివ్వకూడదని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మార్పీఎస్ తెలంగాణ జిల్లా కమిటీల సమావేశం హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ సమ్మె నుంచి ప్రభుత్వ పాఠశాలలు, ఆర్టీసీ బస్సులకు మినహాయింపునిచ్చేలా సీమాంవూధలో ఉద్యమాన్ని ఉదృతం చేయాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీఎన్జీవోలు దిగిరాకుంటే వారి సభకు ఒక్కరోజుముందు ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది అణగారిన, బడుగు, బలహీన వర్గాలతో ‘తెలంగాణ యుద్ధభేరి’ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నెల 3న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాలని, 4న తెలంగాణలోని అన్ని మండలాల్లో ప్రదర్శనలు, 5న అన్ని గ్రామాల్లో దండోరా చాటించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో తెలంగాణ జిల్లాల ఎమ్మార్పీస్ నేతలు యాతకుల భాస్కర్ మాదిగ, వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, రాగడి సత్యం మాదిగ, బీఎన్ రమేశ్ మాదిగ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.