5వేల మంది ఉద్యమకారులపై బైండోవర్లు!

 

-అధిగమించి నిర్వహిస్తామంటున్న తెలంగాణ ప్రజ
-ఇప్పటికే రాజధానికి వేల సంఖ్యలో ఉద్యమకారులు!
-అరెస్టులు చేస్తే.. 240 పోలీస్‌స్టేషన్లలోనే ఆందోళన నిర్బంధకాండపై మెరుపు సమ్మె
-సర్కారుకు టీ ఉద్యోగ జేఏసీ హెచ్చరిక
:చలో అసెంబ్లీ కార్యక్షికమం నేపథ్యంలో ఇప్పటికే ఐదువేలకుపైగా తెలంగాణవాదుల బైండోవర్లు.. అనుమానం వస్తే అరెస్టులు! మీటింగ్ హాళ్లు.. టెంటు హౌస్‌లు, చివరకు ట్రావెల్స్‌ను కూడా వదలకుండా.. రాజధానికి దారితీసే రోడ్లపై అడుగడుగునా చెక్‌పోస్టులతో ముమ్మర నిఘా..! తెలంగాణ అంశం పరిష్కారానికి నిరాసక్తతతో ఉన్న ప్రభుత్వం.. సొంత రాష్ట్ర ఆకాంక్షను చాటుకునేందుకు జరిగే కార్యక్షికమంపై మాత్రం తీవ్ర నిర్బంధానికి దిగుతోంది! ఇవేవీ తమ సంకల్పాన్ని సడలించలేవంటున్న తెలంగాణవాదులు 14న జరిగే చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని విజయవంతం చేసి తీరుతామని తెగేసి చెబుతున్నారు.

నిర్బంధాలను అధిగమించి.. చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని ఉద్యమ చరివూతలోనే అపూర్వ ఘట్టంగా నిలుపుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తమదైన ప్రత్యేకతను చాటుకునే ఉద్యోగులు.. ప్రభుత్వం చలో అసెంబ్లీ కార్యక్షికమానికి అనుమతి ఇవ్వకుండా.. దమనకాండను ఇలానే కొనసాగిస్తే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.ఇవేవీ పట్టని ప్రభుత్వం చలో అసెంబ్లీని ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం చేసేందుకే కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అనుమతి కోసం ఎమ్మెల్యేలు తనను కలిస్తే.. పోలీసులకు చెప్పి చూస్తానన్న సీఎం.. ఈ కార్యక్షికమాన్ని అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నిర్వహించుకోవాలని సలహా ఇవ్వటం విశేషం. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్షికమానికి అనుమతి ఇవ్వరాదని పేర్కొన్నట్లు, శాంతి భద్రతలకు ఆటంకం కల్పింస్తే ముందస్తు అరెస్టు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. ప్రభుత్వ యత్నాపూలా ఉన్నా.. చలో అసెంబ్లీని దిగ్విజయం చేసేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. 14న లక్షలాదిగా హైదరాబాద్ తరలివచ్చేందుకు తెలంగాణవాదులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమీప జిల్లాల నుంచి వేలల్లో ఉద్యమకారులు హైదరాబాద్ చేరుకున్నారని, పోలీసులు అడ్డుకుంటే ఏం చేయాలనే వ్యూహాలను రచిస్తున్నారని సమాచారం. ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. కనీసం ఐదు లక్షల మంది చలో అసెంబ్లీలో కదం తొక్కుతారని జేఏసీ నాయకత్వం విశ్వాసంతో ఉంది. ఒకవేళ నిర్బంధం తీవ్రస్థాయిలో ఉండి హైదరాబాద్ రాలేని పరిస్థితులు ఏర్పడితే తెలంగాణలోని మొత్తం 240 ఠాణాల వద్దే ‘చలో అసెంబ్లీ’ ఆందోళనలు జరగాలని ఇప్పటికే టీజేఏసీ పిలుపునిచ్చింది.

తీవ్ర స్థాయిలో నిర్బంధం
చలో అసెంబ్లీ సన్నాహక సదస్సుల కోసం హాల్స్ ఇవ్వవద్దని, సమావేశాలకు టెంట్‌లు ఇవ్వవద్దని, తెలంగాణ ఉద్యమకారులకు వాహనాలు అద్దెకు ఇవ్వవద్దని పోలీసులు బెదిరిస్తున్నారన్న సమాచారం వస్తున్నది. పెద్దపల్లిలో జేఏసీ నాయకులు పిట్టలరవీందర్, జిల్లా జేఏసీ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్ తదితరులను బోరబండలో జరిగిన సన్నాహక సదస్సు సందర్భంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. వరంగల్‌లో జరిగిన ‘ఓరుగల్లు పోరుయాత్ర’ సభాస్థలం చుట్టూ పోలీసులు మోహరించి అతి చేశారు. అనేక జిల్లాల్లో అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి హైదరాబాద్ వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

వరంగల్ జిల్లాలో 20 మందిని 151 సెక్షన్ కింద అరెస్ట్ చేశారు. జిల్లాలో పోలీస్‌యాక్ట్ 30 విధించారు. ఇతర జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులున్నాయి. అంగన్‌వాడీ సమస్యలపై ఆందోళనలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళుతున్న అంగన్‌వాడీలను చలో అసెంబ్లీకి ముందస్తుగా వెళుతున్నారంటూ సిరిసిల్ల మండలం జిల్లెల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు రోడ్డుపైనే రాస్తారోకో చేశారు.

దమనకాండను కొనసాగిస్తే ఉద్యోగుల మెరుపుసమ్మె!
చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, తీవ్ర నిర్బంధాన్ని పెంచుతున్నదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ మండిపడింది. ప్రభుత్వం ఇదే విధంగా దమనకాండను కొనసాగిస్తే తెలంగాణవ్యాప్తంగా అత్యవసర సర్వీసులు నిలిపివేస్తామని, మెరుపు సమ్మెకు సైతం వెనుకాడబోమని ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు జీ దేవీవూపసాద్, సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్ సీ విఠల్, కారం రవీందర్‌డ్డి ప్రకటించారు. మంగళవారం ఉద్యోగ జేఏసీ స్టీరింగ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై గురువారం జరిగే ఉద్యోగ జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తామని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.

తెలంగాణవ్యాప్తంగా ఉద్యోగులపైన, ఉపాధ్యాయులపైన, రిటైర్డ్ ఉద్యోగులపైన బైండోవర్ కేసులు పెడుతున్నారని, బారికేడ్లు ఏర్పాటు చేసి.. ముళ్లకంచెలు పెట్టి ప్రజలను భయవూభాంతులను చేస్తున్నారని అన్నారు. జేఏసీ నాయకులు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్ తదితరుల అరెస్టుకు ప్రయత్నించారని చెప్పారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ దేవీవూపసాద్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన మీడియా దృష్టికి తెచ్చారు. చలో అసెంబ్లీలో పాల్గొనకుండా ఉద్యోగులపైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఉద్యోగాలు, పదోన్నతులలో అన్యాయాలు చేసిందేకాక, ప్రత్యేక రాష్ట్రంకోసం ప్రజాస్వామికంగా ఉద్యమిస్తుంటే అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఈ అణచివేతలకు సమాధానం చెబుతామని, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్తు, రవాణావంటి అత్యవసర సర్వీసులను కూడా నిలిపివేసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్యమకార్యాచరణను గురువారం ప్రకటిస్తామని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.