3న ముసాయిదా అట…4న కేబినెట్ ముందుకట

దీనమ్మా జీవితం ఇప్పుడు అప్పుడు అంటూ నాలుగు నెలలు జరిపిన్రు. స్పీడ్ అంటరు. ఇంచు ముందుకు కదలరు.  సీడబ్ల్యూసీ నిర్ణయం జులై 30న జరిగింది. అప్పటి నుంచి ఇగో అగో అంటూ జరుపుకుంట వచ్చిన్రు. నవంబర్ లో ముసాయిదా సిద్ధమైతే.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లోగా అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు బిల్లు పోతదనుకుంటే.. డిసెంబర్ సెకండ్ వీక్ వరకు ముసాయిదా అసెంబ్లీకి వచ్చేట్టు లేదు. డిసెంబర్ 3న ముసాయిదా సిద్ధం చేస్తే, 4న  కేబినెట్ ముందుంచితే రాష్ట్రపతికి పోనెప్పుడు.. అసెంబ్లీకి రానెప్పుడు.. తిరిగి పార్లమెంట్ కు పోనెప్పుడు.. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందనెప్పుడు, రాజ్యసభలో పాస్ కానెప్పుడు.. తెలంగాణ బిల్లును మరో మహిళా బిల్లును చెయ్యరు కదా..

 

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.