29, 30 తేదీల్లో సంసద్ యాత్ర

 

tjac
ండ్రోజులూ సత్యాక్షిగహం
-ఢిల్లీ సర్కార్‌కు కనువిప్పు కలిగిస్తాం
– ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలి
-టీ జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణపై తేల్చాలన్న డిమాండ్‌తో ఈ నెల 29, 30 తేదీల్లో సంసద్ యాత్రను నిర్వహించనున్నట్లు టీ జేఏసీ కో చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం జేఏసీ కార్యాలయంలో కార్యక్షికమాల అమలు కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంసద్ యాత్ర సందర్భంగా రెండురోజులపాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సత్యాక్షిగహాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. సత్యాక్షిగహ ఏర్పాట్లపై జేఏసీ భాగస్వామ్య పార్టీల నాయకులతో చర్చించనున్నట్లు తెలిపారు. జేఏసీ బృందం కొన్ని రోజులముందే ఢిల్లీలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని చెప్పారు. సంసద్ యాత్ర ద్వారా ఢిల్లీ సర్కార్‌కు కనువిప్పు కలిగిస్తామన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఇవే చివరి సమావేశాలవుతాయనిపిస్తోందన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన హామీని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలోకి కలిసొస్తేనే రాజకీయ నాయకులకు గుర్తింపు ఉంటుందన్నారు. ఢిల్లీ యాత్ర సందర్భంగా రొట్టె, పచ్చడిని వెంట తీసుకెళ్తామని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రస్తుతం రాష్ట్రం భౌగోళికంగా పెద్దగా ఉండటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఢిల్లీ పర్యటన తరువాత తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో టీ జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్, అధికార ప్రతినిధులు కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు మాదు సత్యం, మునగాల మణిపాల్‌డ్డి, భైరీ రమేష్, తెలంగాణ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి నాగరాజు, కోశాధికారి ఏ సృజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పట్ల విద్యుత్‌రంగంలో వివక్ష: రఘు
విద్యుత్‌రంగంలో తెలంగాణ ప్రాంతంపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని విద్యుత్ జేఏసీ చైర్మన్ కే రఘు అన్నారు. తెలంగాణకు జరుగుతున్న విద్యుత్ వివక్షపై వామపక్ష పార్టీలు స్పందించాలని ఆయన కోరారు. సీమాంవూధలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాగుతుంటే తెలంగాణలో మాత్రం నాలుగు గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. ప్రభుత్వ సంస్థ జెన్‌కోను విస్మరించి ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.