29న ఛలో ఢిల్లీ, మే 2వ వారంలో సడక్ బంద్: టీ జేఏసీ

 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఈ నెల 29న ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చింది. సంసది యాత్ర పేరుతో రెండు రోజుల పాటు హస్తినలో ధర్నా నిర్వహించనుంది.  ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షాలను కలిసి తెలంగాణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని కోరుతామని కోదండరాం చెప్పారు. మే 2వవారంలో విజయవాడ సడక్‌ బంద్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు బంద్ నిర్వహిస్తమాని జేఏసీ తెలిపింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.