28న అఖిలపక్షం డ్రామా

 

shinde1 -కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటన
-ఫలించిన టీ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి.. అన్ని పార్టీలకూ కేంద్రం నుంచి లేఖలు?
-రాష్ట్రం సాధించేదాక విశ్రమించం.. ఒక పార్టీ నుంచి ఒకే ప్రతినిధి: షిండే చెప్పారన్న పొన్నం
-నిరసన విరమించిన ఎంపీలు.. ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు
కాంగ్రెస్ ఎంపీల పట్టుదల.. ఫలితాన్నిచ్చింది. తెలంగాణపై తేల్చకుండా కీలకమైన ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో తాము పాల్గొనబోమని తెగేసి చెప్పిన టీ కాంక్షిగెస్ ఎంపీల పట్టుతో కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని ఈ నెల 28న ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. తొలుత కెమెరాల ముందు మాట్లాడటానికి నిరాకరించిన షిండే.. కారెక్కి వెళ్లిపోయే ముందు.. ‘అవును..అవును.. 28వ తేదీనే’’ అంటూ వెళ్లారు. ఢిల్లీలో 28న ఉదయం పది గంటలకు ఈ సమావేశం జరుగుతుదని టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా ధ్రువీకరించారు. ఈ మేరకు షిండే తమకు స్పష్టమైన హామీ ఇచ్చారని వెల్లడించారు. అన్ని పార్టీలకూ ఆహ్వానాలు వెళతాయని టీ కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నప్పటికీ.. ఎవవరికి లేఖలు అందుతాయన్నది స్పష్టంగా తెలియడం లేదు. గతంలో జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇతర విపక్షాలు పీఆర్పీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, లోక్‌సత్తా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు పీఆర్పీ.. కాంగ్రెస్‌లో విలీనమైంది. కొత్తగా జగన్ పార్టీ వచ్చింది. ఎఫ్‌డీఐలపై జరిగే ఓటింగ్‌కు టీ కాంగ్రెస్ ఎంపీలు హాజరవుతారా? లేదా? అన్న అంశంలో ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది. మధ్యాహ్నానికి కూడా స్పష్టత రాలేదు.

ttt అధిష్ఠానం నుంచి కూడా అప్పటిదాకా ఎలాంటి హామీ రాకపోవడంతో ఎంపీలు ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా పెరిగింది. పలు ఊహాగానాలు వెలువడ్డాయి. టీ కాంగ్రెస్ ఎంపీలను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మంగళవారం రాత్రి కలవడం కూడా కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చిందని పలువురు పరిశీలకులు అంటున్నారు. ఉదయం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంట్లో సమావేశమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ‘ఆపరేషన్ అధిష్ఠానం’ కార్యక్షికమాన్ని గ్రూపులుగా విడిపోయి నిర్వహించారు. మొదటి నుంచి అధిష్ఠానానికి అనుకూలంగా మెదులుతారనే వాదనలు ఉన్న ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీలు బుధవారం నాటి వ్యవహారంలో కీలకంగా మారారు. అధిష్ఠానం పెద్దలకు టీకాంక్షిగెస్ ఎంపీల అభివూపాయాలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ చురుకుగా వ్యవహరించారు. మధ్యవర్తిగా జైపాల్‌డ్డితో అధిష్ఠానంతో మాట్లాడించారని తెలిసింది. తెలంగాణపై ప్రస్తుత సమయంలో ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తేనే మేలని, పార్టీకీ ప్రయోజనం ఉంటుందని వారు అధిష్ఠానానికి మరోమారు విన్నవించుకున్నట్లు సమాచారం. ఇంతదాకా వచ్చాక ఎలాంటి హామీ ప్రకటన లేకుండా ఓటేస్తే.. ఎంపీలు తెలంగాణలో ప్రజల మధ్య తిరగడం కష్టమవుతుందని అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించినట్లు సమాచారం.

తర్వాత ఆయన మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్‌తో పాటు షిండేతో కూడా సమావేశమై చర్చించారని తెలిసింది. హోంమంవూతితో జరిగిన భేటీలో అఖిలపక్షంపై అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఇదే విషయమై సమాచారం కోసం పార్లమెంటులోని మీడియా ప్రతినిధులు షిండేను సంప్రదించారు. తొలుత వివరాలు చెప్పడానికి నిరాకరించిన షిండే.. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నందున తక్షణం ప్రకటించం వీలు కాదని తప్పించుకోజూశారు. కానీ.. ఓ విలేకరి పదే పదే ప్రశ్నించడంతో ‘‘అవును..అవును.. 28తేదీనే’’ అంటూ కారు ఎక్కారు. కేవలం ఈ విజువల్స్ మాత్రమే ఎలక్ట్రానిక్ మీడియాకు లభించాయి. హోం మంత్రి చేసిన ప్రకటనపై కొంత సేపు గందరగోళం నెలకొంది. అఖిలపక్షం తేదీ విషయంలో షిండే అధికారికంగా ప్రకటించారా? లేక అనధికారికంగానా? అనే అనుమానం కలిగింది. అయితే.. విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడిన టీ కాంగ్రెస్ ఎంపీలు.. ఆ అనుమానాన్ని నివృత్తి చేశారు. డిసెంబరు 28, ఉదయం 10 గంటలకు అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్ష సమావేశానికి అధిష్టానం పచ్చజెండా ఊపిందని ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రకటించారు. హోం మంత్రి షిండే తమకు ఈ మేరకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ హామీ ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు వేసినట్టయిందన్నారు. దీనిని చరివూతాత్మక నిర్ణయంగా యాష్కి అభివర్ణించారు. ఈ సమావేశంతో వైఎస్సార్సీపీ, టీడీపీల అసలు రంగు బయటపడుతుందని అన్నారు. ఇన్నాళ్లూ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఉన్న అనిశ్చితి తొలగిపోయి, రాష్ట్ర సాధన దిశగా పరిణామాలు కొత్త మలుపు తీసుకున్నాయని చెప్పారు.

విపక్షాలు రాజకీయం చేయొద్దు : పొన్నం ప్రభాకర్
తెలంగాణపై అధిష్ఠానం చేపట్టబోయే అఖిలపక్ష సమావేశంపై అధికార ప్రకటన రేపోమాపో వస్తుందని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. షిండే ప్రకటన అధికారికమా? అనధికారికమా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన పై వివరణ ఇచ్చారు. డిసెంబర్ 28కి ముందుగానే రాష్ట్రంలోని ఏడు పార్టీలకు చెందిన అధ్యక్షులు తమ తమ లేఖలను సిద్ధం చేసుకోవాలని పొన్నం కోరారు. కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలకూ ఆహ్వాన పత్రాలను పంపించనుందని తెలిపారు. ఈ సమావేశానికి ప్రతి పార్టీ ఒకే ప్రతినిధిని పంపాలని కోరనుననట్లు షిండే తమకు చెప్పారని పొన్నం వెల్లడించారు. అఖిలపక్ష సమావేశాన్ని టీడీపీ టీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్ స్వాగతించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కల సాకారం కానున్న సమయంలో బీజేపీ రాజకీయం చేయకుండా అఖిలపక్ష సమావేశంలో పాల్గొని, సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా తన వైఖరి చెప్పాల్సి ఉందని గతంలో చిదంబరం చెబుతూ వచ్చిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తమ పార్టీ కూడా తెలంగాణపై వైఖరిని ప్రకటించనుందని పొన్నం స్పష్టం చేశారు.

ఇదీ మా చిత్తశుద్ధి : మందా జగన్నాథం
తెలంగాణ కోసం తాము రాజీ పడకుండా పోరాడుతామనే విషయం నేటితో రుజువైందని కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ సాధించే వరకు అధిష్ఠానంతో పోరాడుతామని స్పష్టం చేశారు. తమపై తెలంగాణ ప్రజలు మరింత విశ్వాసాన్ని ఉంచాలని, తెలంగాణ వ్యతిరేక పార్టీలయిన టీడీపీ, వైఎస్సార్సీపీలను తిప్పికొట్టాలని మందా విజ్ఞప్తి చేశారు. జగన్ ఒకప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నారని, ఇప్పుడు ఆ పార్టీ నాయకురాలు షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడమే కాక పాలమూరు విద్యార్థులపై దాడులు చేయడం సిగ్గు చేటని చెప్పారు. షర్మిలకు తెలంగాణలో పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వరంగల్‌లో బాబు పాదయాత్ర ఎవరిని ఉద్ధరించడానికో చెప్పాలని డిమాండ్ చేశారు. వీరిద్దరి వ్యక్తిగత పాదయావూతలకు సీఎం కిరణ్ వేల మంది పోలీసులను రక్షణగా పంపడం ఆయన తెలంగాణ వ్యతిరేకతను తెలియజేస్తుందని మండిపడ్డారు.

అఖిలపక్షం తర్వాత త్వరలోనే నిర్ణయం: గుత్తా
డిసెంబర్ 28న జరిగే అఖిలపక్షం తర్వాత త్వరలోనే తెలంగాణపై యూపీఏ తుది నిర్ణయం ప్రకటిస్తుందన్న ఆశాభావాన్ని ఎంపీ గుత్తా సుఖేందర్‌డ్డి వ్యక్తం చేశారు. కొంత ఆలస్యంగానైనా తెలంగాణపై నిర్దిష్టవైఖరితో అధిష్ఠానం అడుగులేస్తున్నదనటానికి షిండే ప్రకటనే నిదర్శనమన్నారు. సార్వవూతిక ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణపై ఇక తాత్సారం చేయరనే తాము భావిస్తున్నట్లు టీ మీడియాకు తెలిపారు. తమ డిమాండ్ నెరవేరినందున ఇక అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎఫ్‌డీఐలపై జరిగే ఓటింగ్‌లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇక్కడ విలేకరుల సమావేశం ముగించుకున్న ఎంపీలు.. లోక్‌సభకు బయల్దేరారు.

డ్రామాలొద్దు.. రోడ్ మ్యాప్ కావాలి
కాంగ్రెస్ డ్రామాలు ఆడుతూ తప్పించుకునే ధోరణిని అవలంబిస్తోంది. తెలంగాణపై ఆ పార్టీ తేల్చుతుందన్న నమ్మకం లేదు. డ్రామాలను కట్టి పెట్టి తక్షణం రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలి. పార్టీకి ఒక్కరినే పిలువాలి.
– కోదండరాం, టీ జేఏసీ చైర్మన్

మోసాలు చాలు.. తక్షణం బిల్లు పెట్టాలి
కాంక్షిగెస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్ గండం గట్టెక్కేందుకు, టీ కాంగ్రెస్ ఎంపీలను బుజ్జగించేందుకే అఖిలపక్షం పేరిట ప్రభుత్వం డ్రామాలాడుతోంది… పార్లమెంట్‌లో తక్షణం తెలంగాణ బిల్లు పెట్టాల్సిందే.
– ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత

తెలంగాణ ఆకాంక్ష ప్రకటించాల్సిందే
రాజకీయ పార్టీలు ఒకే ఒక ప్రతినిధిని అఖిలపక్ష సమావేశానికి పంపించాలి. ప్రజల ఉద్యమ ఆకాంక్షలను ప్రకటించని రాజకీయ పక్షాలను తెలంగాణ ద్రోహులుగా ముద్రించి ప్రజలలో నిలబెడుతాం.
– జీ దేవీ వూపసాద్, టీ ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.