25న తెలంగాణ అధికారికంగా ఖరారు..!

ఈనెల 25న హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో.. తెలంగాణపై కేంద్ర కార్యదర్శుల స్థాయి కీలక భేటీ జరగనుంది. ఇందులో 9 మంది కేంద్ర కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్లానింగ్‌ కమిషన్‌, విద్యుత్‌, జలవనరులు, న్యాయశాఖ, పెట్రోలియం, మానవ వనరుల శాఖ, ఆరోగ్యం, సిబ్బంది వ్యవహారాలు, ఆర్థికశాఖ కార్యదర్శలు హాజరై.. విభజనపై జీవోఎంకు ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. రాష్ట్రానికి చెందిన వివిధ విభాగాల కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మొత్తం 10 శాఖలు నోడల్‌ ఏజెన్సీలుగా పనిచేయనున్నాయి.
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.