2/3 మెజారిటీతో బిల్లు ఆమోదం పొందుతది -కేటీఆర్

ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని, ఆ సమావేశాల్లో తెలంగాణ బిల్లు 2/3 మెజారిటీతో ఆమోదం పొందితీరుతుందని కేటీఆర్ స్పష్టం చేసిన్రు. పార్లమెంట్‌లో 42 పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకున్నామని తెలపిన్రు.  తెలంగాణ బిల్లుపై జనవరి 30 వరకు ఒక ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల చర్చ జరుగుతుందన్నరు. సీఎం తానే పెద్ద మేధావిలా ఫీలవుతన్నడని ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. కిరణ్ మానసిక స్థితి బాగా లేదని.. ఏ భాషలో మాట్లాడుతున్నడో ఆయనకే అర్థం కావడం లేదని కేటీఆర్ మండిపడ్డరు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.