21న చలో అసెంబ్లీని విజయవంతం చేయండి : ఆర్ కృష్ణయ్య

కార్పొరేట్ కాలేజీల ఫీజుల నియంవూతణ చట్టం తేవడానికి అసెంబ్లీలో బిల్లుపెట్టాలని ఈ నెల 21న చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. సోమవారం వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి కే పార్థసారథిని కలిసి చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. పలు సమస్యలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని అందజేసినట్లు కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆరు కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ గాయత్రి, ఎన్‌ఆర్‌ఐ, వికాస్, కాలేజీలు ప్రతి ఏటా అడ్డూ అదుపులేకుండా ఫీజుల రేట్లను పెంచుతున్నారన్నారు. వీటిని అదుపు చేసి ఫీజును 10 వేలుగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేయాలని మంత్రి పార్థసారథిని కోరినట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ కాలేజీలు విద్యావ్యవస్థను కబ్జా చేశాయని ఆరోపించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.