17 మందికి ముగ్గురే హాజరు

– 30 పడకల ఆస్పత్రిలో సిబ్బంది తీరు..
– రోగులకు ఎర్రగోలీలే దిక్కు
– ఎలాంటి సమాచారం లేకుండానే డాక్టర్లు డుమ్మా
– నాలుగు రోజులకు ఓసారి రిజిస్టరులో సంతకాలు
– ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలో వెలుగుచూసిన వాస్తవాలు
– డుమ్మాకొట్టిన వారిపై జిల్లా వైద్యాధికారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు
– కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన హరీశ్‌రావు

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది నంగునూరు ఆస్పత్రి. ఎర్రగోళీలు సూదూ లు తప్ప ఇంక ఏం ఉండదు. పేరుకు 30 పడకల ఆస్పత్రి అయినప్పటికీ ఏ ఒక్కడాక్టరు కూడా అందుబాటులో ఉండడని సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. రిజిష్టరులో నాలుగు రోజులకోసారి సంతకాలు. ఒకరి సంతకాలకు బదులు మరొకరు, అటెండెన్స్ రిజిష్టరు అంటే లెక్కలేదన్నట్లుగా వైద్యులు వ్యవహరించడం. మొత్తం 17 మంది సిబ్బందికిగాను కేవలం ఒక ఫార్మాసిస్టు, ఇద్దరు నాల్గవ తరగతి ఉద్యోగులు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. దీంతో శాసనసభ్యుడు హరీశ్‌రావు జిల్లా వైద్యాధికారితో ఫోన్‌లో మాట్లాడి ఆస్పత్రి దుస్థితిని వివరించి ఇద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు గైర్హాజరు అయినవారికి షోకాజు ఇవ్వమని చెప్పాడు. అంతేగాక జీతాల్లో కోత విధించండని చెప్పారు.

నంగునూరు 30 పడకల ఆస్పవూతిని సోమవారం ఉదయం 9.35 గంటల సమయంలో సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు. అస్పవూతికి వెళ్లేసరికి వైద్యుల రాక కోసం కొంతమంది వృద్ధ్దులు ఎదురు చూస్తున్నా రు. వైద్యాధికారి చాంబర్‌లోకి వెళ్లేసరికి వైద్యుడి కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. రిజిష్టరు తెప్పించుకొని చూశారు. అస్పవూతిలో ఆరుగురు వైద్యులకు గాను ముగ్గురు డిప్యూ వెళ్లారు. మిగిలిన ముగ్గురు డ్యూటీకి రావాల్సినప్పటికీ ఏఒక్కరు కూడా రాలేదు. కేవలం ఒక ఫార్మాసిస్టు, ఇద్దరు నాల్గవ తరగతి ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. రిజిష్టరులో ఉన్న పేర్ల ప్రకారం ఒక్కొక్కరిని ఎమ్మెల్యే ఆరా తీశారు. ముగ్గురు వైద్యులలో ఏ ఒక్కరు కూడా సెలవు పత్రం కాని కనీస సమాచారం లేకుండానే డ్యూటీకి గైర్హాజరయ్యారు. ఒక్కో డాక్టరు నాలుగు రోజులుగా రిజిష్టరులో సంతకాలు కూడా పెట్టలేదు. మరో డాక్టరు పరిస్థితి సమాచారం లేకుండానే డ్యూటీకి రావడంలేదు. దీంతో వరుసబెట్టి ఒక్కొక్కరిని పేరు పేరున పిలుచుకుంటూ అందరికి గైర్హజరు వేశారు. ఓ ఉద్యోగి కేవలం సంతకాల కోసం అస్పవూతికి వచ్చి వెళుతుంటాడని ఆకస్మిక తనిఖిలో వెల్లడైందిపతి ఉద్యోగివి మూడు నుంచి నాలుగు గైర్హాజర్లు పడ్డాయి. 10 గంటల సమయంలో హెడ్ నర్సు ప్రేమలత, కమల, కంటివైద్యుడు ప్రవీణ్‌కుమార్ వచ్చారు. సమాయానికి రావడం నేర్చుకోవాలని వారికి ఎమ్మెల్యే సూచించారు.

జిల్లా వైద్యాధికారికి ఎమ్మెల్యే హరీశ్ ఫోన్
జిల్లా వైద్యాధికారికి ఎమ్మెల్యే హరీశ్ రావు ఫోన్ చేసి నంగునూరు ఆస్పత్రి దుస్థితిపై వివరించారు. ఆరుగురు డాక్టర్లుకు గాను ముగ్గురుని డిప్యూ పంపించగా మరో ముగ్గురు డ్యూటీకి రావాల్సిన వారిలో ఎవరు కూడా రాలేదని వివరించారు. పైగా ఎలాంటి సమాచారం లేకుండా, రిజిష్టరులో సంతకాలు పెట్టకుండానే డ్యూటీ నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. డిప్యూ పంపించిన డాక్టర్లను వెనక్కి పిలిపించాలని చెప్పారు. అస్పత్రి తీరు బాగు పడాలంటే కనీసం ఇద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు గైర్హాజరు అయిన వారికి షోకాజు నోటీసు ఇచ్చి, జీతాలను కట్ చేయాలన్నారు. దీనికి స్పందించిన జిల్లావైద్యాధికారి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.

రూ.4 కోట్లతో ప్రతిపాదనలు..
నంగునూరు అస్పత్రి భవనం నిర్మాణం కోసం 4 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని త్వరలోనే నిధులు మంజూరవుతాయని సిద్దిపేట హరీశ్‌రావు తెలిపారు. ఆస్పవూతిని తనిఖీ చేసిన అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న భవనం స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడి పడిపోతుందని చెప్పారు. అందుకోసం నూతనంగా మరోభవనం నిర్మాణం కోసం 4కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం జరిగిందని ఆ నిధులు రాగానే భవనాన్ని నిర్మించుకోవచ్చన్నారు. అస్పత్రి లో పని చేసే ఉద్యోగులు డ్యూటీపై అంకితభావంతో పని చేయాలని సూచించారు. డ్యూటీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.