15న పార్లమెంటులో టీ బిల్లు: మధుయాష్కీగౌడ్

ఫిబ్రవరి 21లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ తెలిపారు. వీఎస్‌టీ కార్మిక భవన్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ ప్రథమ మహాసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ బిల్లును వచ్చేనెల 15న పార్లమెంట్‌లో ప్రవేశపెడతారని, 21లోగా బిల్లు పాసయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని నాయకత్వం బానిస విధానాల వల్లనే రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందని ధ్వజమెత్తారు.

febtwentfirst తెలంగాణను అడ్డుకోవటానికి ఇద్దరు చిత్తూరు నేతలు చేయని ప్రయత్నంలేదని కిరణ్, చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. తండ్రికి అంత్యక్రియలు చేయక ముందే సీఎం పదవి కోసం అర్రులు చాచిన జగన్ ఆర్టికల్ 3పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎల్పీనేత ఈటెల రాజేందర్ మాట్లాడుతు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారాన్ని పైరవీకారులు హైజాక్ చేసే ప్రమాదం ఉన్నదని, అందువల్ల తెలంగాణ కోసం పోరాడిన వారంత అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడంతోనే మనకు పండగ కాదని, అసలు కథ అప్పుడే మొదలవుతుందని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.