13 ఏళ్లు దాటితేనే తెలంగాణవాసం

హైదరాబాద్, మార్చి 6 :రాష్ట్ర విభజన తుది దశకు చేరడంతో ఉద్యోగుల విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమల్‌నాథన్ కమిటీ గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో సమావేశమైన కమిటీ సభ్యులు ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. విభజనకు ప్రాతిపదిక రూపొందించే దిశగా వివిధ రాష్ట్రాల విభజన సందర్భంగా అనుసరించిన పద్ధతులపై చర్చించారు. విభజన పూర్తిగా నిబంధనల మేరకు, పారదర్శకంగా జరగాలని కమిటీ సభ్యులు దృఢాభివూపాయం వ్యక్తపరిచినట్టు తెలిసింది. ఈ దిశగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొన్ని మార్గదర్శకాలను సూచించారని సమాచారం. అమలులో ఉన్న నిబంధనల మేరకు 13 సంవత్సరాలపాటు ఎక్కడ పనిచేసినవారిని అక్కడే అనుమతించాలని, అంతకంటే తక్కువ కాలం పనిచేసినవారిని నేటివిటీ ఆధారంగా వారి సొంత రాష్ట్రానికి పంపించాలని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పదేళ్ల వరకు కొనసాగిస్తున్నందున పదేళ్లలో రిటైర్ అయ్యే ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్లు ఇవ్వాలనే మరో ఆలోచనలో కమిటీ ఉన్నట్లు సమాచారం.

Kamalanathanదీనితోపాటు ఉద్యోగుల విభజనపై ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి అభివూపాయాలు తెలుసుకోవాలని కూడా కమిటీ నిర్ణయించింది. మొత్తం ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్టు తెలిసింది.కమల్‌నాథన్ కమిటీలో సభ్యులుగా అర్చనా వర్మ, కిప్‌గిన్, ఎస్.నాయక్, ప్రతాప్ ఉన్నారు. ఢిల్లీనుంచి గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న సభ్యులు లేక్‌వ్యూ గెస్టు హౌజ్‌లో బస చేశారు.మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో దాదాపు 3గంటల పాటు చర్చలు జరిపారు. కమిటీ సభ్యుల కన్నా కాస్త ముందే

13 ఏళ్లు దాటితేనే తెలంగాణవాసం
కమల్‌నాథన్ సచివాలయానికి వచ్చారు. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఉద్యోగుల వివరాలు, స్టేట్, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల వివరాలను కమిటీ సభ్యులు సీఎస్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టులకు విభజన ఉండదని, కేవలం స్టేట్ కేడర్ పోస్టుల విభజన మాత్రమే ఉంటుందని సమావేశంలో స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ కేటగిరి కింద రాష్ట్రంలో 76వేల రాష్ట్ర కేడర్ పోస్టుల్లో 53 వేలమంది ఉద్యోగుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని అధికారులు సభ్యులకు వివరించారు. మరో 24 వేల పోస్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని మహంతి కమిటీ సభ్యులకు వివరించినట్లు సమాచారం. సచివాలయంలో ఉద్యోగుల విభజన మాత్రమే ఉంటుందని, బదిలీలు ఉండవని తెలుస్తోంది. కాగా, ఈరోజు జరిగిన సమావేశంలో కీలకమైన చర్చ జరగలేదని, ఉద్యోగలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే కమలనాధన్ కమిటీకి అందజేయడం జరిగిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఉద్యోగుల విభజనపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన వారిలో ఆర్థిక కార్యదర్శి పీవీ రమేష్, జీఏడీ కార్యదర్శి సిన్హా, ప్రణాళిక శాఖ కార్యదర్శి టక్కర్, మరికొంత మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.