1200 ల మందిని బలిగొన్న సోనియా బలిదేవతి-కేటీఆర్‌

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైరయ్యారు. కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగడుతూ..సోనియాకు, టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు పలు ప్రశ్నలకు సంధించారు. పదేళ్ల పాటు తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసి 1200మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన సోనియా బలిదేవత అని విమర్శించిన్రు.  టీపీసీపీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. ఒక్కమాటంటే పది మాటలతో సమాధానం చెబుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉద్యమ ద్రోహిలు ఎవరో తెలియజేయడానికి.. పొన్నాల సొంత గ్రామంలోనే టీఆర్ఎస్ చర్చకు సిద్ధంగా ఉందన్నారు కేటీఆర్. జూన్ 2న పుట్టబోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహులైన కాంగ్రెస్ నాయకుల చేతిలో పెట్టొద్దని కేటీఆర్ ప్రజలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇక్కడి ప్రజలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే.. తన ప్రశ్నలకు సోనియాతో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.