10 జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోద ముద్ర

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రజల పోరాటం ఫలించింది. 10 జిల్లాల తెలంగాణకే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. జీవోఎం తయారు చేసిన బిల్లు ముసాయిదాను కేబినెట్ సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించినట్లు హోంమంత్రి షిండే అధికారికంగా ప్రకటించారు. అన్ని వర్గాలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. రేపు లేదా ఎల్లుండి తెలంగాణ బిల్లు రాష్ట్రపతికి పంపుతామని, రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి బిల్లు వెళ్తుందని షిండే ప్రకటించారు. జీవోఎం రూపొందించిన డ్రాఫ్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందని, సీఎం, డిప్యూటీ సీఎంతోనూ డ్రాఫ్ట్‌పై చర్చించామని షిండే వివరించారు.

బిల్లులోని ముఖ్యాంశాలు

1. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

2. 10 సంవత్సరాలు గ్రేటర్ హైదరాబాదు ఉమ్మడి రాజధాని

3. శాంతి భద్రతల అంశం తెలంగాణ గవర్నర్ పరిధిలోకి

4. నిబంధనల ప్రకారమే అస్తుల అప్పుల పంపకం

5. ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు ఎక్కడ చేయాలనే అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటు…
45 రోజుల్లో కమిటీ ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది.

6. రెండు రాష్ట్రాల్లోనూ 371డీ ఉంటుంది.

7. నీటి కేటాయింపుల బాధ్యత కేంద్రానిదే.

8. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా

This entry was posted in NATIONAL NEWS, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.