10టీవీని వీడిన సతీష్‌ కమాల్‌

10టీవీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ జర్నలిస్ట్, ఇన్‌పుట్‌ ఎడిటర్ సతీష్‌ కమాల్‌ 10టీవీని వీడారు. టీవీ9లో వివిధ ఆరోపణలు ఎదుర్కొని తొలగింపునకు గురైన రాంబాబు ప్రస్తుతం సాగర్ టీంలో ముఖ్యవ్యక్తిగా పనిచేస్తున్నరు.. 10టీవీలో కో -ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నరు. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డ ఓ స్టింగర్‌ను తొలగించాలని సతీష్‌కమాల్ పట్టుబట్టగా.. అలాంటి వారే తమ చానల్‌కు అవసరమని సాగర్‌ టీం అడ్డుపడిందట.  ఇలాంటి వ్యవస్థలో కొనసాగడం కన్నా రిజైన్‌ చేయడమే ఉత్తమమని సతీష్‌ కమాల్‌ చానల్‌ను వీడారని ప్రచారం జరుగుతోంది. అయినా ఆ టీమ్‌ మధ్య ఇన్నాళ్లు సక్సెస్‌ఫుల్‌గా పనిచేయడమే గ్రేట్‌ అని కొందరు సీనియర్లు అంటున్నరు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.