1 నుంచి ‘గడప గడపకి తెలంగాణ’: హరీష్‌రావు


హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1 నుంచి ‘గడప గడపకి తెలంగాణ’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని పేర్కొన్నారు.

‘మంచినీటి సమస్యకు దానం, ముఖేష్‌లే కారణం’
హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్యకు నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌లే కారణమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఆనాడు వాళ్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి అమ్ముడు పోవడం వల్లే ఇవాళ నగరానికి ఈ దుస్థితి దావురించిందని , నగర ప్రజలకు ఇన్ని బాధలు వచ్చి పడ్డాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ జయసుధ ఒక్కసారైనా సికింద్రాబాద్ నియోజక వర్గం గురించి అసెంబ్లీలో మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు.

సీఎం కిరణ్‌ది వివక్ష ప్రభుత్వం
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వివక్షతతో వ్యవహరిస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. తాను హైదరాబాదీనని చెప్పుకునే సీఎం కిరణ్ నిజంగానే హైదరాబాదీ వాసి అయితే చిత్తూరు జిల్లాలకు తాగునీటి కోసం ఏడువేల కోట్లు కేటాయించి, నగరానికి ఎనిమిది వందల కోట్లు కేటాయిస్తాడా అని నిలదీశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.