సీఎం అటెన్షన్.. విపక్షాలకు టెన్షన్

సీఎం కేసీఆర్ కూర్చుంటే కూల్.. అటెన్షన్ అయి లేస్తే అపోజిషన్ కు టెన్షన్.. ఎప్పుడు ఏ బాంబు పేలుస్తడో.. ఏం పంచ్ లు వేస్తడో.. పార్టీకి బ్యాండ్ బజాయిస్తడో లేక పర్సనల్ గా కార్నర్  చేస్తడో అని విపక్షాలు వణికిపోతున్నయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సర్వం తానే అయి సభను నడిపిస్తున్నరు. ఈటెల, హరీష్, కేటీఆర్ లకు దిశా నిర్దేశం చేస్తూ సభలో విపక్షాలను ధీటుగా ఎదుర్కొంటున్నరు. ఇదివరకైతే అసెంబ్లీ సమావేశాలంటే ప్రభుత్వాలు విపక్షాలను ఎదుర్కొనేందుకు కసరత్తు చేసేవి. ఇప్పుడంతా రివర్స్.. విపక్షాలే అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి రాత్రింభవళ్లు సాధన చేస్తున్నరు. అన్ని రంగాల్లో సబ్జెక్ట్ ఉండటం.. పకడ్బంధీ వ్యూహరచనలు చేయడంలో దిట్ట అయిన కేసీఆర్ ను ఎదుర్కోవడం విపక్షాలకు అగ్నిపరీక్ష.. సభలో సీఎం వన్ మెన్ ఆర్మీలా  వ్యవహరిస్తూ బడ్జెట్ సెషన్స్ ను ఒక మిషన్ లా నడుపుతున్నరు. ప్రజల మేలు కోరే ప్రభుత్వాలకు దేవుడు, ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటరు. పోరు తెలంగాణ కూడా అదే కోరుకుంటుంది. జై తెలంగాణ.. జై కేసీఆర్..

This entry was posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.