సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’-ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: ఇక నుంచి సిక్కు కుటుంబాల్లోని  ఆడపిల్లలకూ ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలలోని అమ్మాయిల పెళ్లి ఖర్చుల కోసం  ప్రవేశపెట్టిన  ఈ పథకాన్ని  సిక్కులకు కూడా విస్తరించనున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను ఆదేశించనున్నట్లు  చెప్పారు. సి

సెలవు దినంగా నానక్ జయంతి
గురునానక్  జయంతి రోజును ఇక నుంచి   ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించనున్నట్లు  చెప్పారు.అపారమైన  ధైర్య సాహసాలతో పాటు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో, కష్టపడేతత్వం గల సిక్కుల జీవన విధానం  అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అనంతరం కేసిఆర్ తన కుటుంబం తరపున రూ.1.16 లక్షల  చెక్కును గురుద్వారా నిర్మాణం నిమిత్తం నిర్వాహకులకు విరాళంగా అందజేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.