సమస్యలపై చర్చకు సిద్ధం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలోని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన ఉందన్నారు. సభకు ఆటంకం కలగకుండా సభ్యులు నడుచుకోవాలని సూచించారు. ఆటంకం కలిగిస్తే సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. సమస్యలపై చర్చించేందుకు సభను ఎన్ని రోజులైనా నిర్వహిస్తామన్నారు. చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా సభ్యులు సభకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు.
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.