సంఘాలు సాయం చేస్తున్నయని అన్నరు కదా.. పక్కవారి కోసం ఎవరూ పోరాడరనడానికి మరో సాక్ష్యం

ఏ.. డెస్క్ జర్నలిస్టులకు ఐడీ కార్డులు సరిపోతాయి.. హెల్త్ కార్డులు ఇస్తున్నాంగా అక్రిడేషన్లు ఎందుకు..  అని కమిటీలో చర్చించినట్టు తెలుస్తున్నది.   ఈ కమిటీలో మన అభిమాన సంఘాల నేతలు లేరా.. వాళ్లెందుకు వ్యతిరేకించలేదు. పక్కవారి  కోసం ఎవరూ పోరాడరు. మీరు గుడ్డిగా నమ్మినవాళ్లు సాయం చేయరు. అక్రిడేషన్ల కోసం ఐక్యంగా కొట్లాడుదామంటే కొందరు మూర్ఖంగా వాదిస్తున్నరు.  ఒక కాజ్ కోసం కలిసికట్టుగా పోరాడితే తప్పులేదు. పోరాటంలో విజయం సాధిస్తే క్రెడిట్ మొత్తం  మీకే ఇస్తం.. మీ సంఘానికే ఇస్తం.. మాకు అక్రిడేషన్లు చాలు.. మీ క్రెడిట్ కోసం ఐకమత్యాన్ని దెబ్బతియ్యొద్దు. ఎవరినో నమ్ముకుని డెస్క్ జర్నలిస్టులు తడిగుడ్డ వేసుకోవద్దన్నదే పోరుతెలంగాణ ఉద్దేశం. అప్రమత్తంగా లేకుంటే అంతే.. ఇప్పుడు రాకుంటే ఇంకెప్పుడూ అక్రిడేషన్లు రావు..

 

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.