వడోదర లోక్‌సభ స్థానానికి మోడీ నామినేషన్

గుజరాత్ : వడోదర లోక్‌సభ స్థానానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడారు. లోక కళ్యాణం కోసం తమకు మద్దతివ్వండని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు మద్దతిస్తే సుపరిపాలన అందిస్తామని చెప్పారు. తన పట్ల వడోదర ప్రజలు చూపిన ప్రేమ, అభిమానానికి కతజ్ఞతలు తెలిపారు. వడోదర ప్రజలు తనకు మద్దతిస్తారన్న విశ్వాసం ఉందన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.