‘రూ.5కే భోజనం’ పథకం

హైదరాబాద్: కొంత మంది పేద ప్రజల కడుపులైనా నింపాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈమేరకు అక్షయ ఫౌండేషన్‌తో కలిసి రూ.5కే భోజనం పేరుతో పు ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తుంది. నగర్ మేయర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. నాంపల్లితోపాటు పలు జీహెచ్‌ఎంసీ సర్కిళ్లలో ఈ పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం కోసం జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో రూ.11 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లోని 50 కేంద్రాల్లో మొదటగా వచ్చిన 300 మందికి రూ.5కే భోజనం అందించనున్నారు. ఇలా ప్రతిరోజు పదిహేను వేల మందికి భోజనం ఏర్పాటు చేయనున్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.