రాయుడి చేతిని ముద్దాడిన కేసీఆర్

హైదరాబాద్: ప్రస్తుత టీమిండియా ఆటగాడు, హైదరాబాద్ మాజీ ఆటగాడు అంబటి రాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పద్ధతిలో పలకరించారు.  ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా  హాజరైన కేసీఆర్ .. ముందుగా ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. అయితే ఆటగాళ్ల అందర్నీ కరచాలనంతో పరిచయం చేసుకున్న కేసీఆర్.. రాయుడి చేతిని మాత్రం దగ్గరకు తీసుకుని ముద్దాడారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.