మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష రద్దు

హైదరాబాద్ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో కుంభకోణం జరిగిన విషయం విదితమే. ఈ కుంభకోణానికి సంబంధించి సీఐడీ బృందం గవర్నర్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయని తేలిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ ప్రకటించారు. పరీక్ష ఎప్పుడు నిర్వహించాలన్నా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.