మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ ఇన్‌చార్జీగా శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీగా తెలంగాణ రాజకీయ జేఏసీ కో చైర్మన్, టీజీవో అధ్యక్షులు వి. శ్రీనివాస్ గౌడ్‌ను నియమిస్తున్నట్లు ఆపార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న ఇబ్రహీంను సమీప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రగామిగా పని చేసిన శ్రీనివాస్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.