భద్రత లేని బడి బస్సులు

 ప్రైవేట్ బడి బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు భద్రత కరువయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 2,545 బస్సులు ఫిట్‌నెస్ లేకుండానే రోడ్లపై పరుగులు తీస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. 

badibusluపాఠశాలల యాజమాన్యాలు కూడా బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్ చేయించకుండానే నడిపిస్తూ ప్రమాదాలకు గురై విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాదికి 882 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేశారు. 183 బస్సులకు ఇంత వరకు ఫిట్‌నెస్ చేయించకుండానే నడుస్తున్నాయి. విద్యా సంస్థల బస్సులను నడుపుతున్న డ్రైవర్లు కూడా లారీల క్లీనర్లుగా పనిచేసిన వారినో లేదా లైట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారో డ్రైవింగ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 1100 స్కూల్, కళాశాలల బస్సులు, వ్యాన్లు నడుస్తున్నాయి. ఇందులో 845 పెద్ద వాహనాలు కాగా మిగిలినవి ఆటో, చిన్న వ్యాన్లు ఉన్నాయి. ఇందులో 600 పైనే వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకుండా నడుస్తున్నాయి.
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.