బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదికాదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: పార్లమెంట్‌లో బీజేపీ సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేకాదని ఆపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, మోడీకి భయపడే కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిందని తెలిపారు. 8 నెలల క్రితం తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని బీజేపీ ఇదే మైదానం నుంచి హామీ ఇచ్చిందని, రాజ్‌నాథ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ జాతీయనేత ప్రకాశ్ జవదేకర్ ఎంతో కషి చేశారని వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.