బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్: బడ్జెట్‌లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 60 వేల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు 4800 కోట్లు కేటాయించారని, ఇప్పుడు లక్ష కోట్లలో బీసీలకు కేవలం రెండువేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ప్రతి ఏటా నిధుల కేటాయింపులు పెరగాల్సిందిపోయి తగ్గడం ఎంతవరకు సమంజసమన్నారు.

టీఆర్ఎస్  ప్రభుత్వం బీసీల వ్యతిరేకిగా మారిందన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీల కోసం ఒక్క పథకం కూడా పెట్టలేదన్నారు. టీఆర్ఎస్ కోసం త్యాగాలు చేసిన బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలని కృష్ణయ్య సూచించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.