పౌరుషం ఉంటే పరిటాల గుండు కొట్టించినపుడు ఏం చేశావు: ఎంపీ పొన్నం

ప్రసంగాల్లో నీతి గురించి మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్,తాను నటించిన సినిమాలకు ఎంత పారితోషికం తీసుకున్నాడో,ఎంత ఆదాయపన్ను చెల్లిస్తున్నాడో బహిర్గతం చేయాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.శుక్రవారం కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మొదటి భార్యకు విడాకులు ఇచ్చినపుడు చెల్లించిన డబ్బు వైట్‌మనీయా? బ్లాక్ మనీయో చెప్పాలన్నారు. పౌరుషం ఉందని చెబుతున్న పవన్, పరిటాల రవి గుండు కొట్టించినపుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో మోడీ హవా ఉంటే, బీజేపీ ఎందుకు సినీ నటులను రంగంలో దించుతోందని ప్రశ్నించారు. బీజేపీ నావ మునిగిపోకతప్పదని జోస్యం చెప్పారు. ప్రధానిగా మోడీని చూడాలని మాట్లాడుతున్న పవన్ ఎజెండా లేదనడం, ఓట్లు, సీట్లు వద్దకున్నప్పుడు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టినట్లని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలను చంద్రబాబు స్వాగతించడంపై స్పందిస్తూ.. నువ్వుకూడ దొంగేనని పవన్ చెప్పాడు, వినలేదా అని ఎద్దేవాచేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.