త్వరలో జేఏసీ మ్యానిఫెస్టో : కోదండరాం

ఉద్యమ క్రమంలో వెలువరించిన ప్రజల ఆకాంక్షలను, డిమాండ్లను క్రోడీకరించి జేఏసీ మ్యానిఫెస్టోను రూపొందింస్తుందని, త్వరలో ఈ మ్యానిఫెస్టోను విడుదల చేసి పార్టీల ముందు ఉంచుతామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడు తూ మ్యానిఫెస్టో అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ శక్తులను ఆదరించాలని పిలుపునిచ్చారు. సమైక్య పార్టీలు మళ్లీ ప్రజల ముందుకు రావడానికి కుట్ర చేస్తున్నాయని, పెత్తనం చెలాయించేందుకు మళ్లీ ప్రవేశించాలని చూస్తున్నారని, ఇలాంటి పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.