తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాకే పవన్ పార్టీ పెట్టుకోవాలి: కవిత

హైదరాబాద్: సినీనటుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నాడనే అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న అన్న చిరంజీవి సామాజిక తెలంగాణ పేరుతో వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. ఇవాళ తమ్ముడు మరో పార్టీ పేరుతో తెలంగాణకు వస్తున్నాడు. ఆనాడు చిరంజీవి మోసం చేశాడు.  పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసేందుకే వస్తున్నాడు అని విమర్శించారు. అన్న చిరంజీవి చేసిన తప్పులకు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు భేషరుతుగా క్షమాపణ చెప్పాకే పార్టీ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. గంగిరెద్దులోళ్లు వస్తుంటరు పోతుంటరని, వాళ్లను తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దని ఆమె తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేశారు. అసలు పవన్ ఏ మొఖం పెట్టుకుని పార్టీ పెడుతున్నారో స్పష్టత ఇవ్వాలని ఆమె పునరుద్ఘాటించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.