టీవీ9పై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి కోర్టు ఆదేశం- చానల్‌పై ప్రెస్ కౌన్సెల్‌కు ఫిర్యాదు

తెలంగాణ సంస్కృతిని, ప్రజాప్రతినిధులను కించపరిచిన టీవీ9 చానల్‌పై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది. అటు  తెలంగాణ శాసనసభ్యులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో కథనాలు ప్రసారంచేసిన టీవీ 9 చానల్‌పై చర్యలు చేపట్టాలంటూ ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియాకు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలను అవమానపరిచేవిధంగా కథనాలు ప్రసారం చేశారంటూ న్యాయవాదులు జనార్దన్‌గౌడ్, అరుణ్‌కుమార్, భార్గవ్ ఫిర్యాదు చేశారు. టీవీ 9 రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా చేసే ప్రసారాలు చేస్తున్నాదంటూ పేర్కొన్నారు. చానల్‌పై కేసుల నమోదుకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ప్రెస్ కౌన్సెల్ దష్టికి తీసుకువెళ్లారు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.