టీయూడబ్ల్యూజే ఆవిర్భావం.. లోగో ఆవిష్కరించిన కేసీఆర్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ జర్నలిస్టుల జాతర సభ గ్రాండ్ గా జరిగింది.  టీజేఎఫ్ టీయూడబ్ల్యూజేగా మారింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు లోగోను టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆవిష్కరించారు. రాబోయే తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టులకు 2 బెడ్ రూంల ఇళ్లు కట్టిస్తమని చెప్పిన్రు. ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కేసీఆర్ కొనియాడిన్రు.

అల్లం నారాయణ మాట్లాడుతూ టీజేఎఫ్ టీయూడబ్ల్యూజేగా ఆవిర్భవించిందని చెప్పిన్రు. TEMJU   (తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్)ను టీయూడబ్ల్యూజేలో విలీనం అయినట్టు ప్రకటించిన్రు. భవిష్యత్ లో మహాసభ నిర్వహిస్తమని చెప్పిన్రు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.