ఖాళీ అవుతున్న సీవీఆర్, 10టీవీ

యాజమాన్యం టార్చర్ భరించలేక జర్నలిస్టులు పారిపోతున్నరు. అవసరమైతే ఖాళీగానైనా ఉంటాం కానీ ఈ సంస్థల్లో పనిచేయమని చెప్తున్నరు.  సీవీఆర్ లో యాజమాన్యం వేధింపులు భరించలేక అవుట్ పుట్ మొదలుకొని సబ్ ఎడిటర్స్, గ్రాఫిక్స్ అన్ని డిపార్టుమెంట్ల వాళ్లు ఉద్యోగాలకు రిజైన్ చేస్తున్నరట. సీవీఆర్ యాజమాన్యం జర్నలిస్టులను డాక్టర్  కోసం వచ్చే రిప్రజెంటేటర్స్ లాగా ట్రీట్ చేస్తుంది. రిప్రజెంటేటర్స్ వాళ్ల ప్రొడక్ట్ అమ్ముకోవడానికి అవమానాలు భరిస్తరు. కానీ జర్నలిస్టులు అలాకాదు.. నువ్వు కాకపోతే 150 చానళ్లు.. ఇప్పటికైనా సీవీఆర్ యాజమాన్యం పద్ధతి మార్చుకుంటే మంచిది.

10టీవీలో తమ్మినేని, సీపీఎం పార్టీ వేధింపులు భరించలేక జర్నలిస్టులు వేరేదారి చూసుకుంటున్నరు. త్వరలో పెద్దతల కూడా వెళ్లిపోతున్నట్టు చర్చ జరుగుతుంది. అతనున్నందు వల్లే ఆ చానల్ అంతంతమాత్రాన నడుస్తున్నది. ఆయన కూడా వెళ్లిపోతే సీపీఎం పార్టీకి పట్టిన గతే 10టీవీకి కూడా పడుతుంది.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.